వీగిపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు
ABN , Publish Date - Apr 17 , 2026 | 07:40 PM
ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లులో ముడిపడిన మూడు బిల్లులపై సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం సాయంత్రం ఓటింగ్ జరిగింది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై ఈ ఓటింగ్ జరిగింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుకు మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం కాగా, ఓటింగ్ ప్రక్రియలో 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. దీంతో మెజారిటీకి అవసరమైన 352 మంది సభ్యుల బలం లేకపోవడంతో బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆ వెంటనే డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026ను వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
ఇండి కూటమి సభ్యులు బిల్లును వ్యతిరేకించారు: అమిత్ షా
బాలాకోట్ మెజిషియన్.. మోదీపై రాహుల్ విసుర్లు, భగ్గుమన్న బీజేపీ