Share News

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - May 30 , 2026 | 01:52 PM

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
CM Chandrababu Naidu

అమరావతి: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు. మహిళా రిజర్వేషన్లను అన్ని పార్టీలు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. మొదటి నుంచీ మహిళలకు టీడీపీ అండగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.


డీలిమిటేషన్ విషయంలో 2011 జనాభా లెక్కలైనా, తాజా లెక్కలైనా మనకు నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందుకే ఉన్న స్థానాలను 50 శాతం పెంచితే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. పెంచిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారి ఆలోచన కూడా మారవచ్చని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు.


రెండు బిల్లులను తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోందని, ఆ రెండింటినీ విడదీసి చూడాల్సిన అవసరం ఏముందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రెండు బిల్లులు కలిపి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లులు తప్పనిసరిగా తీసుకురావాలని, ఇవి దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

రంపచోడవరం ఏజెన్సీలో కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం

వైఎస్ వివేకా కుమార్తె సునీత పోరాటంలో న్యాయం ఉంది: సీఎం చంద్రబాబు

Updated Date - May 30 , 2026 | 01:52 PM