Share News

కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:56 AM

ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరపు పరీక్షా కేంద్రాల విషయంలో కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరపు పరీక్షా కేంద్రాల విషయంలో కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. నిబంధనలకు నీళ్లొదిలి నలభై, యాభై కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు.


ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఎంబీబీఎస్‌ ఎక్కడ చదివారో అక్కడి కళాశాలల్లోనే విద్యార్థులు పరీక్షలు రాసేలా కాళోజీ హెల్త్‌ వర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ నిర్ణయం ఉప సంహరించుకోకపొతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.


ఈ వార్తలూ చదవండి

నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 28 , 2026 | 05:56 AM