ఇంధన ధరల పెంపు.. ప్రధానిపై రాహుల్ గాంధీ ధ్వజం
ABN , Publish Date - May 25 , 2026 | 12:32 PM
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను విడతల వారీగా పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని ధ్వజమెత్తారు.
ఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై (PM Narendra Modi) కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను విడతల వారీగా పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ‘ద్రవ్యోల్బణ సూత్రధారి’ అంటూ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను నెమ్మదిగా పెంచుతూ ప్రజల జేబులను నిశ్శబ్దంగా ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారు..
కొన్ని నెలల క్రితమే దేశంలో ఆర్థిక తుఫాను రాబోతోందని తాను ముందుగానే హెచ్చరించానని.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల రాజకీయాలతో బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ సెటైర్లు గుప్పించారు. ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్ ధరలను రూ.8ల వరకు పెంచారని దుయ్యబట్టారు. ఈ ధరల పెంపు ఇక్కడితో ఆగదని, ఇంకా కొనసాగుతుందని విమర్శించారు. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, మిగతా సమయంలో ప్రజల జేబులపై దాడి చేయడం మోదీ ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్
వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..
Read Latest Telangana News And AP News And International News And Telugu News