లోక్సభ కీలక అజెండా విడుదల.. మహిళా రిజర్వేషన్లపై చర్చకు రంగం సిద్ధం
ABN , Publish Date - Nov 28 , 2026 | 08:56 PM
లోక్సభ కీలక అజెండాను లోక్సభ సచివాలయం విడుదల చేసింది. మహిళా సీట్ల రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు, 2026 , 132వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026 సోమవారం లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు.
ఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): లోక్సభ కీలక అజెండాను (Lok Sabha Agenda - 2026) లోక్సభ సచివాలయం విడుదల చేసింది. మహిళా సీట్ల రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు, 2026 (Delimitation Bill 2026) , 132వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026 సోమవారం లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. పాత బిల్లులను ఉపసంహరించుకోనున్నట్లు ఆయన తెలపనున్నారు.
డీలిమిటేషన్ బిల్లు, 2026 యూనియన్ టెరిటరీస్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు, 2026లను ఉపసంహరించుకునేందుకు తీర్మానాలను కేంద్రమంత్రులు ప్రవేశపెట్టనున్నారు. అలాగే, నౌగాంగ్ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అస్సాంలోని నౌగాంగ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన దేవాశిష్ శర్మ సోమవారం ఉదయం 11 గంటలకు లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే, మాజీ సభ్యులకు సభలో సంతాపం తెలపనున్నారు. ఇటీవల కన్నుమూసిన ఆరుగురు మాజీ లోక్సభ సభ్యులకు సభలో సంతాప తీర్మానాలను సభ్యులు ప్రవేశపెడతారని లోక్సభ సచివాలయం వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News