-
-
Home » Mukhyaamshalu » AP Telangana National International news ABN Andhrajyothy Live Updates of 24th February 2026 siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 24 , 2026 | 07:15 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Feb 24, 2026 21:34 IST
శ్రీకాకుళంలో డయేరియా అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష
జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు..
బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు..
-
Feb 24, 2026 20:46 IST
రాజమండ్రి: కల్తీ పాల కేసులో నిందితుడు గణేష్‌కు రిమాండ్
అడ్డాల గణేష్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్..
రాజమండ్రి సెంట్రల్ జైలుకు అడ్డాల గణేష్ తరలింపు..
-
Feb 24, 2026 20:44 IST
ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
మనం చేసే కార్యక్రమాలు అసెంబ్లీలో మాట్లాడితే సరిపోతుంది: సీఎం చంద్రబాబు
మీ శాఖల్లో చేపట్టిన కార్యక్రమాలు ఆయా మంత్రులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..
మనకు రోజూ పరీక్షే.. ప్రభుత్వం చేసే పని కింది స్థాయిలోకి వెళ్లాలి: సీఎం చంద్రబాబు
-
Feb 24, 2026 20:23 IST
తమిళనాడులో శశికళ కొత్త పార్టీ ప్రకటన
తమిళ రాజకీయాల్లో నా మార్క్ చూపిస్తా: శశికళ
తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో పార్టీ జెండా ఆవిష్కరించిన శశికళ
జయలలిత, అన్నాదురై, MGR బొమ్మలతో జెండా ఆవిష్కరణ
పార్టీ పేరు త్వరలో వెల్లడిస్తా: శశికళ
-
Feb 24, 2026 19:19 IST
హైదరాబాద్: బల్దియా దోమల ఫాగింగ్‌లో భారీ స్కాం
పంపకాల్లో తేడాలు రావడంతో బయటపడ్డ అవినీతి బాగోతం..
ఫాగింగ్ కోసం కేటాయించిన డీజిల్ వాడకుండా అవినీతి..
విచారణ అనంతరం సూపర్‌వైజర్‌ను తొలగించిన ఉన్నతాధికారులు..
-
Feb 24, 2026 18:44 IST
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన పాకిస్థాన్
పల్లెకెలె స్టేడియం వేదికగా తలపడనున్న ఇంగ్లండ్-పాక్ జట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
దీంతో తొలుత ఫీల్డింగ్ చేయనున్న ఇంగ్లండ్
-
Feb 24, 2026 17:15 IST
హైదరాబాద్‌లో టీ పౌడర్ కల్తీ రాకెట్ గుట్టురట్టు
టాస్క్‌ఫోర్స్, వెస్ట్‌జోన్ పోలీసుల సంయుక్త ఆపరేషన్..
ఫతేనగర్ నివాసి జగన్నాథ్ బిష్ణోయ్ అరెస్ట్..
కోకోపీట్, బెల్లం, సింథటిక్ ఫుడ్ కలర్స్, సన్‌సెట్ ఎల్లో..
టార్ట్రాజిన్ రంగులతో కల్తీ టీ పొడి తయారు చేస్తున్నట్టు గుర్తింపు..
-
Feb 24, 2026 17:07 IST
మంత్రి నారా లోకేష్ పనితీరును ప్రశంసించిన హైకోర్టు
కస్తూర్బా పాఠశాలల్లో టీచర్ల జీతాలు పెంచడంతో పాటూ..
పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని ప్రకటించిన మంత్రి లోకేష్..
సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్య
-
Feb 24, 2026 16:53 IST
కల్తీ పాల ఘటనపై.. డీఎస్పీ విచారణ
రాజమండ్రి: కల్తీ పాల ఘటనపై కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ విచారణ..
పాల వ్యాపారి గణేష్ నిర్వహిస్తున్న వరలక్ష్మి డెయిరీని సీజ్ చేసిన డీఎస్పీ..
పాల వ్యాపారి గణేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
ఆర్థిక ఇబ్బందుల వల్ల కల్తీ పాలు విక్రయించిన వ్యాపారి గణేష్: డీఎస్పీ దేవకుమార్
-
Feb 24, 2026 16:32 IST
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ ఆపరేషన్..
నార్కోటిక్, జగద్గిరిగుట్ట పోలీసుల జాయింట్ ఆపరేషన్..
ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు, ఏడుగురు వినియోగదారుల అరెస్ట్..
మూసాపేట కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తింపు..
తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్, ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్..
-
Feb 24, 2026 16:22 IST
మహిళల టీ 20 ప్రపంచ కప్2026 షెడ్యూల్ రిలీజ్
టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ..
జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీ..
జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, పాకిస్థాన్..
జూన్ 12 ఇంగ్లండ్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్..
-
Feb 24, 2026 16:20 IST
హెరిటేజ్ సంస్థ మా కుటుంబ వ్యాపార సంస్థ: సీఎం చంద్రబాబు
ప్రభుత్వంలో ఎక్కడా హెరిటేజ్ ఉత్తత్తులు సరఫరా చేయలేదు..
హెరిటేజ్‌పై వ్యతిరేక కథనాలు రాశారు..
హెరిటేజ్ ఎప్పుడూ తప్పుడు పనులు చేయదు..
గత పాలకులు చేసిన తప్పుల్ని ఒప్పుకోవాలి: సీఎం చంద్రబాబు నాయుడు
-
Feb 24, 2026 16:17 IST
శిశువును కట్టెల పొయ్యిలో వేసిన తల్లి..
హైదరాబాద్: దుండిగల్ బౌరంపేటలో దారుణం..
రెండు నెలల మగ శిశువును చంపిన కన్న తల్లి..
మగ శిశువుని కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపిన తల్లి..
-
Feb 24, 2026 15:39 IST
ఛలో సెక్రటేరియట్‌లో భాగంగా ఇందిరా పార్క్‌కు ఆర్టీసీ కార్మికులు
హైదరాబాద్: ఛలో సెక్రటేరియట్‌లో భాగంగా ఇందిరా పార్క్‌కు ఆర్టీసీ కార్మికులు..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికుల డిమాండ్..
ఇందిరా పార్క్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు,,
-
Feb 24, 2026 15:33 IST
కేరళ పేరు మార్పు సహా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
కేరళ పేరు మార్పు బిల్లును రాష్ట్ర ఆసెంబ్లీ ఆమోదానికి పంపనున్న కేంద్రం..
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తర్వాత పార్లమెంటుకు బిల్లు..
అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం ఆమోదం..
గోండియా-జబల్‌పూర్ రైల్వే లైను డబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్..
విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆమోదం..
-
Feb 24, 2026 15:23 IST
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడ్డ ఎలక్ట్రిసిటీ ఏఈ
ఏసీబీ వలలో హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ ఏఈ మామిడి శెట్టి శ్రీనివాస్ రావు..
రూ.16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఏఈ..
మీటర్ ట్యాంపరింగ్ విషయంలో బాధితుడి నుంచి తొలుత రూ.16 వేలు లంచం తీసుకున్న ఏఈ.
మరోసారి 16,000 లంచం డిమాండ్ చేసిన ఏఈ..
ఇవాళ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
-
Feb 24, 2026 15:05 IST
అంతరిక్ష విమానం షెన్‌లాంగ్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన చైనా..
షెన్‌లాంగ్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
ఫిబ్రవరి 7న షెన్‌లాంగ్‌ను భూ కక్ష్యలోకి పంపించినట్లు వార్తలు వస్తున్నాయి.
-
Feb 24, 2026 15:02 IST
ఖమ్మం: వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..
101 కిలోల ఎండు గంజాయి, 2.7 కిలోల హ్యాష్ ఆయిల్ సీజ్..
యూపీకి చెందిన వ్యక్తి అరెస్ట్..
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న మత్తు పదార్థాలు..
-
Feb 24, 2026 15:01 IST
భార్యను గొడ్డలితో నరికి హతమార్చిన భర్త..
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలో దారుణం..
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..
అమృత (45) అక్కడికక్కడే మృతి..
మృతురాలికి ఇద్దరు కొడుకులు..
హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..
-
Feb 24, 2026 14:57 IST
AI సమ్మిట్‌లో కాంగ్రెస్ నిరసన కేసు.. క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ..
ఢిల్లీ: AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతల నిరసనల కేసు..
ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసిన ఢిల్లీ పోలీసులు..
ఇకపై కేసు విచారణ జరపనున్న ఇంటర్-స్టేట్ క్రైమ్ బ్రాంచ్..
ఇప్పటివరకు ఆందోళన చేసిన ఏడుగురు యూత్ కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Feb 24, 2026 14:47 IST
దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెబుతూనే నిర్లక్ష్యం: హరీశ్ రావు
మంత్రుల మాటలకు, సీఎం మాటలకు పొంతన లేదు: మాజీ మంత్రి
దేవాదుల ప్రాజెక్ట్‌ను త్వరలో పూర్తి చేయాల్సిందే: హరీశ్ రావు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై నిర్లక్ష్యం వద్దు: మాజీ మంత్రి హరీశ్ రావు
-
Feb 24, 2026 14:46 IST
అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో కీలకం కానున్న భారత్-జింబాబ్వే మ్యాచ్..
సౌతాఫ్రికాపై ఓటమితో దారుణంగా పడిపోయిన టీమిండియా నెట్‌రన్ రేట్..
టీమిండియాకు పలు సూచనలు చేసిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్..
-
Feb 24, 2026 13:48 IST
అలిపిరి ఘటనలో ఆ వేంకటేశ్వర స్వామే నన్ను కాపాడారు: చంద్రబాబు
గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశాం
దేవాలయాలపై దాడులు జరిగాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టారు
రాముడి విగ్రహం ధ్వంసం చేశారని ప్రశ్నిస్తే నాపైనే దాడికి దిగారు
అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళణ కోసం ఈవోను నామినేట్ చేశా
నా దృష్టికి వచ్చిన NDDB రిపోర్ట్ వివరాలు వెల్లడించా
లడ్డూ విషయంలోనే కాదు.. అనేక విషయాల్లో తప్పు చేశారు
కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి
-
Feb 24, 2026 13:27 IST
ఏపీ అసెంబ్లీ: నెయ్యిలో నెయ్యి లేదని ఇప్పటికే తేలిపోయింది: పవన్
నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోంది
అందుకే మేం వివరణ ఇవ్వాల్సి వచ్చింది
కల్తీ నెయ్యి తయారీలోనూ సృజనాత్మకత చూపించారు
నెయ్యి పాల నుంచే కాదురసాయనాల నుంచీ తయారు చేయొచ్చని నిరూపించారు
గత ప్రభుత్వాధినేత తప్పుచేశారని నేనెక్కడా చెప్పలేదు
అప్పటి టీటీడీ పాలకమండలి తన బాధ్యత నిర్వహణలో విఫలమైంది
-
Feb 24, 2026 13:24 IST
కేరళ రాష్ట్రం పేరు మార్పునకు రంగం సిద్ధం?
జాతీయ మీడియాలో కథనాలు
రాష్ట్రాన్ని ‘కేరళం’ అని పిలిచే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్
మలయాళంలో కేరళను కేరళం అని పిలుస్తారన్న సీఎం విజయన్
-
Feb 24, 2026 13:19 IST
వణుకుతున్న కుక్కకు దుప్పటి కప్పాడని జాబ్‌లోంచి తీసేశారు
రష్యాలోని ప్రముఖ పిజ్జా చెయిన్ మాజీ ఉద్యోగి ఆరోపణ
చలిలో వణుకుతున్న కుక్కకు దుప్పటి కప్పినందుకు తనను తీసేశారన్న బాధితుడు
మేనేజర్ ఆదేశాలను ఖాతరు చేయలేదన్న కక్షతోనే ఇలా చేశారని ఆగ్రహం
-
Feb 24, 2026 13:09 IST
సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్
దేశవ్యాప్తంగా సైబర్ మాఫియాపై హైదరాబాద్ పోలీసుల మెగా సర్జికల్ స్ట్రైక్
16 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు, 104 మంది నిందితులు అరెస్ట్
1,055 సైబర్ ఫ్రాడ్ కేసులను ఛేదించిన పోలీసులు
-
Feb 24, 2026 13:08 IST
సత్యసాయి: కదిరి, హిందూపురం కోర్టుకు బాంబు బెదిరింపు
LTTE పేరుతో కోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్
కోర్టులో బాంబు స్క్వాడ్, పోలీసుల తనిఖీలు
-
Feb 24, 2026 13:07 IST
కల్తీ వ్యవహారంలో అసలు దోషులను సిట్ తేల్చలేదు: కాల్వ శ్రీనివాసులు
నివేదికలో భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పేర్లు ఎందుకు లేవు?
స్వామివారిపై భక్తి లేనివారిని టీటీడీ చైర్మన్లుగా నియమించడం దారుణం
అన్యమతాల ఆచారాలు ఇంట్లో అనుసరిస్తూ.. టీటీడీ చైర్మన్‌గా ఎలా ఉంటారు?
పాలు సేకరించని, నెయ్యి తయారు చేయని కంపెనీలకు టెండర్ ఇవ్వడమేంటి?
కల్తీ వ్యవహారం బాధ్యులపై సరైన చర్యలు తీసుకున్నట్టు లేదు
-
Feb 24, 2026 13:07 IST
ఏపీ అసెంబ్లీ: హిందూమతంపై వైసీపీ అనేక కుట్రలు చేసింది: గౌతు శిరీష
కరోనా తరహాలో రాష్ట్ర ప్రజలను వైసీపీ వైరస్ పట్టుకుంది
-
Feb 24, 2026 13:06 IST
నెయ్యి వ్యవహారంతో హిందువుల మనోభావాలు గాయపడ్డాయి: కూన రవి
నాడు వైఎస్ కూడా తిరుమలపై కుట్రలు పన్నారు
తిరుమల రెండు కొండలేనని వైఎస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది
ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆందోళన చేస్తే జీవో వెనక్కి తీసుకుంది
పింక్ డైమండ్ విషయంలోనూ వైసీపీ దుష్ప్రచారం చేసింది
వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యాక పింక్ డైమండ్ లేదని ఒప్పుకున్నారు
పరకామణి చోరీ కేసును చిన్న విషయంగా చెప్పడం దారుణం
-
Feb 24, 2026 12:38 IST
నిర్మల్: మరో రెండేళ్లలో రానున్నది మన ప్రభుత్వమే: కేటీఆర్
అప్పటి వరకు అందరం ఓపికతో ఉందాం, ఆందోళన చెందవద్దు
నిర్మల్ జిల్లాలోని మూడు ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంటాం
మరోసారి నిర్మల్ జిల్లాలో పర్యటిస్తాను
బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్
-
Feb 24, 2026 12:30 IST
తహవ్వుర్ రాణా పౌరసత్వ రుద్దుకు సిద్ధమైన కెనడా
ముంబై దాడుల కుట్రదారు తహవ్వుర్ రాణాపై చర్యలకు రంగం సిద్ధం
పౌరసత్వం కోసం అప్లై చేసేటప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చాడని ఆరోపణ
తీవ్రమైన మోసానికి పాల్పడ్డాడన్న నిర్ధారణకు వచ్చిన కెనడా
-
Feb 24, 2026 12:25 IST
ఐటీ షేర్ల పతనంతో కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు
ఈ మధ్యాహ్నం గం. 12 సమయానికి సెన్సెక్స్ 800 పాయింట్లు పతనం
25,500 దిగువకు నిఫ్టీ
ఏఐ (AI) ఆందోళనలతో ఐటీ రంగంలో అమ్మకాలు
అమెరికా టారిఫ్ భయాలు మార్కెట్లను వణికించాయి
ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావం మార్కెట్‌పై పడింది
విదేశీ ఇన్వెస్టర్ల (FII) నిరంతర విక్రయాలతో ఒత్తిడికి మార్కెట్లు గురయ్యాయి
-
Feb 24, 2026 12:20 IST
IND vs AUS: టీమిండియా ప్లేయర్ స్మృతి మంధాన అరుదైన రికార్డు
అర్ధ సెంచరీతో రాణించిన స్మృతి మంధాన
ఆసీస్‌పై అత్యధిక 50 కి పైగా పరుగులు చేసిన ఆసియా ప్లేయర్‌గా మంధాన రికార్డు
-
Feb 24, 2026 11:59 IST
మావోయిస్టు అగ్రనేత గణపతి అచూకీ లభ్యం
దశాబ్దాల పాటు పార్టీని నడిపించిన గణపతి
వృద్ధాప్యంతో పార్టీ సెక్రటరీ పదవి వదిలిపెట్టిన గణపతి
గణపతి కొన్నేళ్ల నుంచి నేపాల్‌లో మకాం వేసినట్టు సమాచారం
తీవ్ర అనారోగ్యంతో పాటు నడవలేని స్థితిలో గణపతి
గణపతిని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ పోలీసులు
-
Feb 24, 2026 11:28 IST
రాజమండ్రి కల్తీ పాల వ్యాపారి అడ్డాల గణేష్‌కు అస్వస్థత
కిమ్స్ ఆస్పత్రిలో గణేష్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు
-
Feb 24, 2026 11:27 IST
త్వరలో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌ను వీడే పరిస్థితి రావొచ్చు: యనమల
జగన్ నీచమైన మనస్తత్వ రాజకీయ ఆట ఆడుతున్నారు
జగన్ అధికారంలోకి రావడం కష్టమనే భావన వైసీపీ నేతల్లో పెరుగుతోంది
60రోజుల అసెంబ్లీ గైర్హాజరుతో అర్హత కోల్పోయే భయం వైసీపీ MLCల్లో ఉంది
జగన్‌లో నాయకత్వ లక్షణాలు లేవని ప్రజలకు తెలుసు
-
Feb 24, 2026 11:23 IST
హైదరాబాద్: అంబర్‌పేట్‌లో విషాదం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
రామ్ రాజ్(55), మాధవి(50), శశాంక్(24)
దర్యాప్తు చేస్తున్న అంబర్‌పేట్ పోలీసులు
-
Feb 24, 2026 11:20 IST
నెల్లూరు: మాజీ మంత్రి అనిల్‌పై ఇన్‌చార్జ్ మేయర్ పరోక్ష వ్యాఖ్యలు
మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని రూ.వందల కోట్లు సంపాదించుకున్నారు
నమ్మిన క్యాడర్‌ను, పదవులు ఇచ్చిన పార్టీని వదిలేశారు: రూప్‌కుమార్
మాజీ మేయర్ చేసిన అక్రమాలకు అన్ని ఆధారాలున్నాయి: రూప్‌కుమార్
అవినీతి చేసిన మాజీ మేయర్‌కు అనిల్ సపోర్ట్ చేస్తున్నారు: రూప్‌కుమార్
మాజీ మేయర్ అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తాం: ఇన్‌చార్జ్ మేయర్ రూప్‌కుమార్
-
Feb 24, 2026 11:08 IST
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై ఛైర్మన్ సీరియస్
ప్రశ్నోత్తరాల్లో సుదీర్ఘ ప్రసంగాలు వద్దు: ఛైర్మన్
ఆడియో సరిగ్గా లేదన్న బొత్స
ఎవ్వరు మాట్లాడినా రికార్డ్ చేయాలని ఛైర్మన్ ఆదేశం
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలపై వరుదు కల్యాణి ప్రశ్న
ఏపీలో మహిళలపై నేరాలు తగ్గాయని హోంమంత్రి అనిత సమాధానం
-
Feb 24, 2026 10:39 IST
రంగారెడ్డి: మహేశ్వరం పీఎస్ పరిధిలో ఘోర ప్రమాదం
చెట్టును ఢీకొట్టిన మారుతి షిఫ్ట్ కారు
కార్లో ఉన్న చిన్నారి మృతి, మరో ముగ్గురికి గాయాలు
హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
-
Feb 24, 2026 10:36 IST
ఢిల్లీ: 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న సమావేశం
సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ప్రధాని కార్యాలయం సేవా తీర్థ్‌లో తొలిసారి జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశం
ఇటీవల సౌత్ బ్లాక్ నుంచి సేవా తీర్థ్‌కు మారిన ప్రధాని కార్యాలయం
-
Feb 24, 2026 10:20 IST
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై చైర్మన్ ఆగ్రహం
వివాదాస్పద అంశాలు సభలో ప్రస్తావించడంపై అభ్యంతరం
-
Feb 24, 2026 10:11 IST
క్లాడ్ AIని చైనా సంస్థలు కాపీ చేస్తున్నాయి: ఆంథ్రోపిక్
24వేల ఫేక్ ఖాతాలను ఉపయోగించి క్లాడ్‌తో 16 మిలియన్ల ఎక్స్‌ఛేంజ్‌లు జరిపినట్టు గుర్తించాం: ఆంథ్రోపిక్
-
Feb 24, 2026 10:10 IST
ఆంథ్రోపిక్ భయంతో కుప్పకూలిన ఐబీఎం షేర్లు
40 బిలియన్ డాలర్లు పడిపోయిన కంపెనీ మార్కెట్ విలువ
కోబాల్ కోడ్‌లను క్లాడ్ ఆధునీకరించగలదన్న ప్రచారంతో భయాలు
-
Feb 24, 2026 10:10 IST
ఢిల్లీ: AI సదస్సులో ఆందోళన కేసు
ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను అరెస్ట్
-
Feb 24, 2026 10:07 IST
ఏపీ అసెంబ్లీ: వైసీపీ హయాంలో ముఖ్య శాఖలను నిర్లక్ష్యం చేశారు: అచ్చెన్న
అన్ని శాఖల్లో నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు
ఇబ్బందులు సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది
పశు వైద్యశాలల్లో సౌకర్యాలు, ఉపకరణాలు ఏర్పాటు చేస్తున్నాం
-
Feb 24, 2026 10:07 IST
బ్రహ్మోస్ కంటే వేగవంతమైన మిసైల్..
భారత్‌కు ఇజ్రాయెల్ ఆఫర్
జాతీయ మీడియాలో కథనాలు
ఈ బాలిస్టిక్ మిసైల్‌తో 2 వేల కిలోమీటర్ల లోపు లక్ష్యాలు ధ్వంసం
మిసైల్‌కు గరిష్ఠంగా మాక్-5 వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం
భూగర్భ బంకర్‌ల ధ్వంసం కోసం మిసైల్‌ను డిజైన్ చేసిన వైనం
-
Feb 24, 2026 10:04 IST
అన్నమయ్య: అనపగుట్టలోని శ్రీకృష్ణ దేవాలయంలో భారీ చోరీ
రూ.కోటి విలువైన బంగారం, వెండి నగలు అపహరణ
సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హర్డ్‌డిస్క్ తీసుకెళ్లిన దొంగలు
-
Feb 24, 2026 10:03 IST
క్లాడ్ AIపై నియంత్రణకు అమెరికా చర్యలు
ఆంథ్రోపిక్ సీఈవోకు పెంటగాన్ సమన్లు
-
Feb 24, 2026 10:03 IST
అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం
న్యూయార్క్‌లో భారీగా పేరుకుపోయిన మంచు
అమెరికాలో 3 రోజుల్లో 10వేలకు పైగా విమానాలు రద్దు
-
Feb 24, 2026 10:03 IST
అమెరికాతో వాణిజ్య ఒప్పందం నిలిపివేసిన ఐరోపా సమాఖ్య
సుప్రీం తీర్పుపై స్పష్టత వచ్చేవరకు నిలిపివేయాలని నిర్ణయం
-
Feb 24, 2026 10:03 IST
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 700, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టం
-
Feb 24, 2026 09:51 IST
పోలవరం జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం
ఇటీవల మండపేటలో పెద్దపులిని పట్టుకుని విశాఖ జూకు తరలింపు
చికిత్స తర్వాత పులిని పాపికొండలు అటవీ ప్రాంతంలో వదిలిన సిబ్బంది
ప్రస్తుతం గెద్దాడ, చిలకమామిడి, బూసిగూడెంలో సంచరిస్తున్నట్టు గుర్తింపు
-
Feb 24, 2026 09:47 IST
అన్నమయ్య జిల్లా అనపగుట్టలోని శ్రీకృష్ణ దేవాలయంలో భారీ చోరీ
రూ.1 కోటి విలువైన బంగారం, వెండి నగల అపహరణ
సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేసి హర్డ్‌డిస్క్ తీసుకెళ్లిన దొంగలు
-
Feb 24, 2026 09:42 IST
హైదరాబాద్: కోఠి కాల్పుల కేసు ఛేదించిన పోలీసులు
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జనవరి 31న కోఠి SBI దగ్గర కాల్పులు జరిపిన నిందితులు
నిందితుల నుంచి వెపన్ రికవరీ చేసిన పోలీసులు
-
Feb 24, 2026 09:36 IST
నేటి నుంచి ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు
అసెంబ్లీ సమావేశాలు ముగిశాక పోటీల నిర్వహణ
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 3 రోజుల పాటు జరగనున్న క్రీడలు
క్రికెట్ పోటీల్లో 2 టీమ్‌లుగా ఎమ్మెల్యేలు.. కెప్టెన్లుగా నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్
-
Feb 24, 2026 09:28 IST
నేడు ఏపీ శాసనమండలిలో లా అండ్ ఆర్డర్‌పై చర్చ
బుధవారం వ్యవసాయంపై మండలిలో చర్చ
-
Feb 24, 2026 09:20 IST
జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా అడవుల్లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్
65 శాతం కాలిన గాయాలతో రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా విషాదం
ప్రమాదంలో పేషెంట్‌తో సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి
ప్రమాదానికి గురైన రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన బీచ్‌క్రాఫ్ట్ విమానం
రాంచీ నుంచి బయల్దేరిన 23 నిమిషాల్లోనే తెగిపోయిన సంబంధాలు
ప్రతికూల వాతావరణం, ఉరుములే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా
సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన డీజీసీఏ
-
Feb 24, 2026 09:11 IST
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ
దివంగత మాజీ ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ సంతాపం
ప్రశ్నోత్తరాల అనంతరం రసాయనాల నెయ్యి అంశంపై ప్రత్యేక చర్చ
-
Feb 24, 2026 09:11 IST
నేడు మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు
మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు మావోయిస్టులు
-
Feb 24, 2026 09:02 IST
నేడు ఆదిలాబాద్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆదిలాబాద్ జైల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను కలవనున్న కేటీఆర్
వరంగల్‌కు మాజీమంత్రి హరీష్ రావు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించనున్న మాజీమంత్రి
-
Feb 24, 2026 08:55 IST
నంద్యాల వెల్త్ అండ్ హెల్త్ సంస్థపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రూ. 35 కోట్ల ఉద్యోగాల మోసం
నిర్వాహకుల ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు
ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు పెద్ద ఊరట
మోసగాళ్లపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
-
Feb 24, 2026 08:48 IST
నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో జగన్ పర్యటన
సాయంత్రం రకు జగన్ ప్రజాదర్బార్
రేపు నందిపల్లి శివాలయ ప్రారంభోత్సవానికి హాజరు
-
Feb 24, 2026 08:29 IST
ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదు: డొనాల్డ్ ట్రంప్
మార్-ఏ-లాగో ఎస్టేట్‌లోకి చొరబడ్డ యువకుడి కాల్చివేతపై అధ్యక్షుడి స్పందన
తనను అనేక మంది టార్గెట్ చేసుకున్నారని కామెంట్
ఇప్పటికే ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నం జరిగిన వైనం
-
Feb 24, 2026 08:27 IST
మెక్సికోలో హింసతో 2026 వరల్డ్ కప్‌పై అనిశ్చితి
మెక్సికో డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో హతుడైన తర్వాత దారుణాలు
డ్రగ్ కార్టెల్స్, సైన్యం మధ్య ఘర్షణలతో క్షీణించిన శాంతిభద్రతలు
ఆటగాళ్లు, అభిమానుల రక్షణపై ఫిఫా (FIFA) తీవ్ర ఆందోళన
మెక్సికో మ్యాచ్‌లను అమెరికా, కెనడాకు తరలించే అవకాశం
-
Feb 24, 2026 07:19 IST
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
10 గ్రాముల బంగారంపై రూ.2080 పెరుగుదల
కిలో వెండి రూ.10 వేలు పెరిగిన ధర
-
Feb 24, 2026 07:15 IST
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు
మార్చి 16 నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలు
మార్చి 16న గవర్నర్ ప్రసంగం
మార్చి 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
మార్చి 20న తెలంగాణ వార్షిక బడ్జెట్