Share News

కొనసాగుతున్న గోల్డ్ ర్యాలీ! రూ.1.6 లక్షల మార్కు దాటిన ధర

ABN , Publish Date - Feb 24 , 2026 | 06:39 AM

అమెరికా సుంకాల విధింపులో సందిగ్ధత, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

 కొనసాగుతున్న గోల్డ్  ర్యాలీ! రూ.1.6 లక్షల మార్కు దాటిన ధర
Gold, Silver Rates on Feb 23

ఇంటర్నెట్ డెస్క్: గత వారం ద్వితీయార్ధంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరల్లో ఈ వారం కూడా ర్యాలీ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్‌లో భారత్‌లో పసిడి ధర ఏకంగా రూ.2 వేల మేర పెరిగింది. గత వారం పసిడి ధర సుమారు రూ.4,300 మేర పెరిగిన విషయం తెలిసిందే.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,360గా ఉంది. నిన్న ఇదే సమయానికున్న రేట్‌తో పోలిస్తే రూ.2,080ల మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,910ల మేర పెరిగి రూ.1,47,910కు చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. రూ.10 వేల మేర పెరిగి రూ.3,00,100లకు చేరుకుంది (Gold, Silver Rates on Feb 24).

సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. కానీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు 15 శాతం సుంకం విధించడంతో వాణిజ్యంపై సందిగ్ధత నెలకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా డాలర్‌ బలహీనపడి ఇన్వెస్టర్లు బంగారం, వెండి వైపు మళ్లుతున్నారని వివరిస్తున్నాయి . దీనికి తోడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా బంగారం, వెండికి డిమాండ్ కొనసాగేలా చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.


ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు ఇవీ

  • చెన్నై: ₹1,62,120; ₹1,48,610

  • ముంబై: ₹1,61,360; ₹1,47,910

  • ఢిల్లీ: ₹1,61,510; ₹1,48,060

  • కొలకతా: ₹1,61,360; ₹1,47,910

  • బెంగళూరు: ₹1,61,360; ₹1,47,910

  • హైదరాబాద్: ₹1,61,360; ₹1,47,910

  • విజయవాడ: ₹1,61,360; ₹1,47,910

  • కేరళ: ₹1,61,360; ₹1,47,910

  • పుణే: ₹1,61,360; ₹1,47,910

  • వడోదరా: ₹1,61,410; ₹1,47,960

  • అహ్మదాబాద్: ₹1,61,410; ₹1,47,960

వెండి (కిలో) ధరలు

  • చెన్నై: ₹3,01,100

  • ముంబై: ₹2,99,100

  • ఢిల్లీ: ₹3,00,000

  • కొలకతా: ₹3,00,000

  • బెంగళూరు: ₹3,00,100

  • హైదరాబాద్: ₹3,00,100

  • విజయవాడ: ₹3,00,100

  • కేరళ: ₹3,00,000

  • పుణే: ₹2,99,000

  • వడోదరా: ₹3,00,100

  • అహ్మదాబాద్: ₹3,00,000


గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

ఈ వార్తలూ చదవండి:

ద్రవ్యోల్బణాన్ని బట్టే వడ్డీ రేట్ల నిర్ణయం: ఆర్బీఐ గవర్నర్

లాభాల్లో మార్కెట్లు

Updated Date - Feb 24 , 2026 | 07:20 AM