Share News

లాభాల్లో మార్కెట్లు

ABN , Publish Date - Feb 24 , 2026 | 06:28 AM

టారీఫలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో సోమవారం సూచీలు లాభాల్లో ముగిసాయి...

లాభాల్లో మార్కెట్లు

ముంబై: టారీఫలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో సోమవారం సూచీలు లాభాల్లో ముగిసాయి. పీఎ్‌సయూ బ్యాంక్‌, ఆటోమొబైల్‌, ఫైనాన్షియల్‌ రంగ షేర్లు లాభాల్లో మదుపరులు భారీగా అమ్మకాలు దిగటంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 479 పాయింట్ల లాభంతో 83,294.66 పాయింట్ల వద్ద క్లోజైంది. ఇంట్రాడేలో ఒక దశలో సూచీ 671.44 పాయింట్ల లాభంతో 83,486.15 పాయింట్లను తాకింది. మరోవైపు ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ కూడా 141.75 పాయింట్ల లాభంతో 25,713 పాయింట్ల దగ్గర ముగిసింది. సూచీలు లాభాల్లో ముగియటం వరుసగా ఇది రెండో రోజు. బీఎ్‌సఈలో మొత్తం 2,435 స్టాక్స్‌ పతనమవగా 1,894 షేర్లు లాభాల్లో 168 స్టాక్స్‌ ఎలాంటి మార్పు లేకుండా ముగిసాయి. అమెరికా సుప్రీంకోర్టు టారి్‌ఫల అమలు రద్దు చేయటం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపిందని, ట్రంప్‌ మరోసారి 15 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని అంతగా పట్టించుకోలేదని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే డాలర్‌ బలహీనత, 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల లాభాలు క్షీణించటం మధ్యకాలికంగా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపించే అవకాశం ఉందని వారన్నారు. సోమవారం నాటి ట్రేడింగ్‌లో పీఎ్‌సయూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.4 శాతం లాభపడగా హాస్పిటల్‌ ఇండెక్స్‌ 0.89 శాతం, సేవల రంగం 0.97 శాతం, ఆటోమొబైల్‌ 0.71 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసుల రంగం 0.65 శాతం మేర లాభపడ్డాయి.

ఇవి కూడా చదవండి..

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..

Updated Date - Feb 24 , 2026 | 06:28 AM