Share News

ద్రవ్యోల్బణాన్ని బట్టే వడ్డీ రేట్ల నిర్ణయం

ABN , Publish Date - Feb 24 , 2026 | 06:31 AM

రిటైల్‌ ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి రేటు ఆధారంగానే కీలక రెపో రేటుపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా చెప్పారు...

ద్రవ్యోల్బణాన్ని బట్టే  వడ్డీ రేట్ల నిర్ణయం

రిటైల్‌ ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి రేటు ఆధారంగానే కీలక రెపో రేటుపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా చెప్పారు. ప్రస్తుతం దేశంలో నిధుల సరఫరా కి ఎలాంటి లోటు లేదన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా అన్ని రంగాలకు నిధుల లభ్యత పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాత రుణ పత్రాలు తీసుకుని కొత్త రుణ పత్రాలు జారీ చేయడం ఆర్‌బీఐ రుణ నిర్వహణలో భాగమన్నారు. 2022లో ఆర్‌బీఐ ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) కరెన్సీ నోట్లు లేదా యూపీఐ చెల్లింపులకు ప్రత్యామ్నాయం కాదని మల్హోత్రా తేల్చి చెప్పారు. అయితే సీబీడీసీలో మరిన్ని సురక్షిత ఫీచర్లను జోడించాల్సి ఉందన్నారు.

ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ పరిణామాలను గమనిస్తున్నాం: ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా చెప్పారు. చండీగఢ్‌లోని తమ బ్యాంకు శాఖలో ఉద్యోగులు, ఇతరులు రూ.590 కోట్ల నిధులు స్వాహా చేసినట్టు ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఇప్పటికే ప్రకటించింది. దీన్ని ప్రత్యేక సంఘటనగా చూడాలే తప్ప వ్యవస్థాగత సమస్యగా చూడలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ నిధుల స్వాహా కూడా హరియాణా ప్రభుత్వానికి చెందిన కొన్ని శాఖల నిధులని అన్నారు.

కొత్త ద్రవ్యోల్బణ సూచీ మంచిదే: రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాల కోసం 2024 నాటి వినియోగ ధరల ఆధారంగా రూపొందించిన కొత్త వినియోగ ధరల సూచీ (సీపీఐ)ని మల్హోత్రా సమర్ధించారు. ఇది గృహ వినియోగదారుల వినియోగ వివరాలు, ఖర్చుల వివరాలను మరింత సమర్ధవంతంగా ప్రతిఫలిస్తుందన్నారు. తద్వారా మరింత మెరుగైన ఆర్థిక, ద్రవ్య విధానాల రూపకల్పన సాధ్యమవుతుందన్నారు.

ఇవి కూడా చదవండి..

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..

Updated Date - Feb 24 , 2026 | 06:31 AM