Share News

పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం

ABN , Publish Date - Feb 24 , 2026 | 09:37 AM

పోలవరం జిల్లాలో మరోసారి పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో సంచరించిన అదే పులి.. ఇప్పుడు రంపచోడవరం మండలం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.

పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం
Tiger Sighting

రాజమండ్రి, ఫిబ్రవరి 24: పోలవరం జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపుతోంది. రంపచోడవరం మండలం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పులి సంచరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ పులిని అటవీ అధికారులు ఎంతో చాకచక్యంగా బంధించి విశాఖపట్నం జూకు తరలించారు. అక్కడ చికిత్స అందించిన తర్వాత, ప్రత్యేక కమిటీ నిర్ణయం మేరకు పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టి.. ఆ వీడియోలను మీడియాకు విడుదల చేశారు.


అయితే, ఇదే పులి గత రెండు రోజులుగా మారేడుమిల్లి మండలం అటవీ ప్రాంతంలో కనిపించింది. కాకవాడ, దారగూడెం, నూరుపూడి, సీమగండి, రామన్నవలస, తుర్రూరు, దేవరపల్లి, సున్నంపాడు గ్రామాల సరిహద్దుల్లో సంచరించినట్లు సమాచారం. ప్రస్తుతం రంపచోడవరం మండలంలోని గెద్దాడ, చిలకమామిడి, బూసిగూడెం అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులి సంచారంతో అటవీశాఖ నిఘా పెంచింది. పులి కదలికలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని అటవీ అధికారులు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

చూస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేకూ క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్‌ తీసుకుంటా

కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండి.. ఇవిగో సింపుల్ చిట్కాలు..


Read Latest AP News And Telugu News

Updated Date - Feb 24 , 2026 | 09:56 AM