బీసీలు ఎప్పటికీ టీడీపీతోనే.. : మంత్రి సవిత
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:52 AM
రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి ఎన్టీఆర్ పునాదులు వేస్తే.. ఆ పునాదులపై అభివృద్ధి అనే గోపురాన్ని సీఎం చంద్రబాబు నిర్మించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి ఎన్టీఆర్ పునాదులు వేస్తే.. ఆ పునాదులపై అభివృద్ధి అనే గోపురాన్ని సీఎం చంద్రబాబు నిర్మించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. ఈ బడ్జెట్‌లో సింహభాగం బీసీల అభివృద్ధికే కేటాయించారని, రాష్ట్రంలోని బీసీలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పారు. శిక్షణ పొందిన మహిళలకు త్వరలోనే కుట్టు మిషన్లు అందజేస్తామని, ఆదరణ పథకాన్ని తిరిగి అమలులోకి తెస్తామని చెప్పారు.