Share News

చూస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేకూ క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్‌ తీసుకుంటా

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:27 AM

టీ-20 ప్రపంచక్‌పలో ఇండియా ఫైనల్‌కు చేరితే తప్పనిసరిగా మ్యాచ్‌ చూడటానికి వెళ్తానని మంత్రి లోకేశ్‌ తెలిపారు.

చూస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేకూ క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్‌ తీసుకుంటా

  • కిలో రూ.360 అంటేఅది కల్తీ నెయ్యే.. మంచి నెయ్యి మార్కెట్‌లో వెయ్యికి పైనే: లోకేశ్‌

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): టీ-20 ప్రపంచక్‌పలో ఇండియా ఫైనల్‌కు చేరితే తప్పనిసరిగా మ్యాచ్‌ చూడటానికి వెళ్తానని మంత్రి లోకేశ్‌ తెలిపారు. మ్యాచ్‌ చూసేందుకు వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేకూ (జగన్‌) టికెట్‌ తీసుకుంటానన్నారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. వైసీపీ హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్‌కు రూ.1000 కోట్లు లబ్ధి చేకూర్చారని, హెరిటేజ్‌ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదన్నారు. కిలో రూ.360 అంటే అది కల్తీ నెయ్యేనని, మార్కెట్‌లో కిలో నెయ్యి రూ.వెయ్యిపైనే ఉందని తెలిపారు.

Updated Date - Feb 24 , 2026 | 08:12 AM