-
-
Home » Mukhyaamshalu » AP Telangana National International ABN Andhrajyothy General Live Updates of 14th February 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 14 , 2026 | 06:46 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Feb 14, 2026 21:02 IST
కొత్తగూడెం అంశాన్ని పరిశీలించాలని మంత్రి పొంగులేటికి సీఎం రేవంత్ ఆదేశం
మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినందుకు..
మంత్రులు, కార్యకర్తలకు సీఎం రేవంత్ అభినందనలు
భవిష్యత్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి: సీఎం రేవంత్
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: సీఎం రేవంత్
ఇన్‌ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకోవాలి: సీఎం రేవంత్
-
Feb 14, 2026 21:02 IST
మంత్రులతో ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
సీఎం రేవంత్, మంత్రుల సమావేశంలో కీలక చర్చ
నిజామాబాద్, కొత్తగూడెం మేయర్ పదవులను..
కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయం
నిజామాబాద్‌లో MIMతో చర్చలు జరపాలని..
టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌కు సీఎం రేవంత్ సూచన
కొత్తగూడెంలో స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుతో..
మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం
-
Feb 14, 2026 19:22 IST
మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష
హంగ్ ఏర్పడిన 37 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో పార్టీ వ్యూహంపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
ఎల్లుండి మేయర్లు, చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫిషియో ఓట్ షేర్‌పై సీఎం రేవంత్ సూచనలు
-
Feb 14, 2026 19:21 IST
కాంగ్రెస్‌లో చేరిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు
సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ సమక్షంలో..
కాంగ్రెస్‌లో చేరిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు
-
Feb 14, 2026 19:21 IST
కరీంనగర్ కార్పొరేషన్ దాదాపు బీజేపీ కైవసం
కేంద్రమంత్రి బండి సంజయ్ సమక్షంలో..
బీజేపీలో చేరిన మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు
60 డివిజన్లలో 30 స్థానాల్లో గెలిచిన బీజేపీ
నలుగురు స్వతంత్రుల చేరికతో 34కి పెరిగిన బీజేపీ బలం
బండి సంజయ్ ఎక్స్ అఫిషియో ఓటు అవసరం లేకుండానే..
మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ
-
Feb 14, 2026 19:20 IST
హైదరాబాద్: ఫార్ములా E-రేస్ కేసులో కీలక పరిణామం
IAS అరవింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి
ప్రాసిక్యూషన్ అంశంపై తెలంగాణకు సమాచారం ఇచ్చిన కేంద్రం
ఇప్పటికే ఫార్ములా E-రేస్ కేసు విచారణ చేస్తున్న ఏసీబీ
ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి
రాజకీయ నాయకులు, అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతితో..
చార్జ్‌షీట్ దాఖలుకు సిద్ధమవుతున్న ఏసీబీ
-
Feb 14, 2026 18:45 IST
టీ20 వరల్డ్ కప్: రేపు కొలంబోలో భారత్ Vs పాక్ మ్యాచ్
పాక్ జట్టుతో కరచాలనం అంశంపై కొనసాగుతున్న సస్పెన్స్
హ్యాండ్‌షేక్‌పై రేపు టాస్ సమయంలో నిర్ణయం: సూర్యకుమార్
పాక్‌తో మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం: సూర్యకుమార్
ఒత్తిడి సమయాల్లో చాలా మ్యాచ్‌లు ఆడాం: సూర్యకుమార్
పాక్ బౌలర్లను ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం: సూర్యకుమార్
పాక్‌తో రేపటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడతాడు: సూర్యకుమార్
-
Feb 14, 2026 18:44 IST
మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ షేర్ ప్రకటించిన తెలంగాణ EC
మున్సిపల్ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లు- 37,81,232
39.80 శాతం ఓట్ షేర్‌తో అగ్రస్థానంలో కాంగ్రెస్
BRSకు 29.75, BJPకి 15.67, MIM 3.28, స్వతంత్రులు 8.30% ఓట్ షేర్
కాంగ్రెస్‌కు పోలైన 15,05,006, BRSకు 10,87,347 ఓట్లు
-
Feb 14, 2026 18:01 IST
ఛత్తీస్‌గఢ్: ధమ్‌తారి జిల్లాలో తీవ్ర విషాదం
ఖప్రి బైపాస్‌పై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన కారు
కారులోని నలుగురు కమాండోలు అక్కడికక్కడే మృతి
ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మరో కమాండో
-
Feb 14, 2026 17:59 IST
దారుణ హత్య
హైదరాబాద్: అత్తాపూర్‌లో హత్యకు గురైన అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్
సులేమాన్ నగర్‌లోని సొంత ఆఫీసులోనే ఖదీర్‌పై కత్తులతో దాడి
అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఖదీర్ మొదటి భార్య తమ్ముళ్లు
-
Feb 14, 2026 17:40 IST
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోష్
ZPTC, MPTC ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్
సాయంత్రం మంత్రులతో సమావేశంకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Feb 14, 2026 17:39 IST
మెట్రో పిల్లర్ ప్రమాదం..
ముంబై: మెట్రో పిల్లర్ కూలిన ఘటనలో ఒకరి మృతి
ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు
-
Feb 14, 2026 16:50 IST
ఎల్లుండి అమరావతికి బిల్‌గేట్స్ వస్తున్నారు: సీఎం చంద్రబాబు
బిల్‌గేట్స్‌ను 3 సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే: చంద్రబాబు
తొలిసారి హైటెక్ సిటీ.. రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చారు: చంద్రబాబు
ఇప్పుడు సంజీవిని పథకం కోసం వస్తున్నారు: సీఎం చంద్రబాబు
-
Feb 14, 2026 16:40 IST
త్వరలో తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త
ఈ నెల 17న రైతు భరోసా విడుదల చేయాలని..
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం
ఇప్పటికే రూ.9వేల కోట్లు సమీకరించిన తెలంగాణ ప్రభుత్వం
-
Feb 14, 2026 16:16 IST
ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదుపై CS, SECతో మాట్లాడాం: కేటీఆర్
30 మున్సిపాలిటీలకు పైగా గెలుచుకుంటామని అనుకున్నాం: కేటీఆర్
కొంత తగ్గింది..హంగ్ ఉన్న చోట మాకు అనుకూలంగా ఉంది: కేటీఆర్
కాంగ్రెస్‌కి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదు: కేటీఆర్
కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే BJP ఎక్కడా అంతగా లేదు: కేటీఆర్
స్థానిక ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు: కేటీఆర్
-
Feb 14, 2026 16:16 IST
హైదరాబాద్: కేటీఆర్ నివాసంలో BRS నేతల కీలక భేటీ
BRS గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికపై చర్చ
పాల్గొన్న కేటీఆర్, హరీష్‌రావు, పలువురు నేతలు
-
Feb 14, 2026 16:14 IST
మంచిర్యాల: బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగ్
వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు
కేటీఆర్ సమక్షంలో BRSలో చేరిన..
ముగ్గురు స్వతంత్రులు, మరో ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు
BJP కౌన్సిలర్‌ని కూడా తమవైపు తిప్పుకున్న బీఆర్ఎస్
BRSకు పీఠం దక్కనీయకుండా MLA గడ్డం వినోద్ ప్రయత్నాలు
-
Feb 14, 2026 14:24 IST
ముంబైలో కుప్పకూలిన నిర్మాణంలోని మెట్రో పిల్లర్
నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
ములుంద్ వెస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ఘటన.
శిథిలాల కింద చిక్కుకున్న పలువురు.
ధ్వంసమైన పలు వాహనాలు.
-
Feb 14, 2026 14:23 IST
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోష్..
ZPTC, MPTC ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్.
సాయంత్రం మంత్రులతో సమావేశంకానున్న సీఎం రేవంత్‌రెడ్డి.
-
Feb 14, 2026 14:21 IST
త్వరలో తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త!
ఈ నెల 17న రైతు భరోసా విడుదల చేయనున్న ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే రూ.9 వేల కోట్లు సమీకరించిన తెలంగాణ ప్రభుత్వం.
-
Feb 14, 2026 14:20 IST
బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది: ఎంపీ అర్వింద్
నిజామాబాద్ కార్పోరేషన్‌లో ప్రతిపక్షంగానే ఉంటాం.
ఎప్పటికైనా ఇందూరులో మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటుంది.
ఎవరు పార్టీ మారినా పదవులకు రాజీనామా చేసి వెళ్లాలి.
-
Feb 14, 2026 14:19 IST
హైదరాబాద్: కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ
బీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికపై చర్చ.
పాల్గొన్న కేటీఆర్, హరీష్‌రావు, పలువురు నేతలు.
-
Feb 14, 2026 14:18 IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందన..
-
Feb 14, 2026 14:16 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ చోరీ కేసులో మరో అరెస్ట్
మాస్టర్ మైండ్‌గా నేపాల్‌కు చెందిన భీమ్లా ఉన్నట్టు గుర్తింపు.
హైదరాబాద్‌లో అనేక నేపాలీ గ్యాంగ్ చోరీల్లో భీమ్లా కీలక పాత్ర.
నేపాల్ పారిపోతుండగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.
-
Feb 14, 2026 14:10 IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
రూ.1,60,504 కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
అసోంలో అండర్ వాటర్ రివర్ టన్నెల్‌కు గ్రీన్‌సిగ్నల్.
గుడెబెళ్లూరు-మహబూబ్‌నగర్ మధ్య 4లైన్ల హైవేకు ఆమోదం.
హైదరాబాద్ పనాజీ కారిడార్‌లో భాగంగా కొత్త 4లైన్ల రోడ్డు నిర్మాణం.
మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.
ఢిల్లీ-అంబాల, కసారా-మన్మాడ్, బళ్లారి-హోస్పేట్ మధ్య రైల్వేలైన్లు ఏర్పాటు.
-
Feb 14, 2026 11:13 IST
పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడేళ్లు
ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి.
అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు.
అమరవీరులను స్మరించుకున్న ప్రధాని మోదీ.
-
Feb 14, 2026 10:59 IST
కరీంనగర్‌లో మేయర్ పదవి కోసం ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం
ఇండిపెండెంట్ కార్పోరేటర్‌కు మేయర్ పదవిని ఆఫర్ చేసిన 3 పార్టీలు.
సదరు కార్పోరేటర్‌తో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల రహస్య మంతనాలు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తీరును తీవ్రంగా పరిగణిస్తున్న బీజేపీ.
-
Feb 14, 2026 09:36 IST
నాగర్‌కర్నూల్: తిమ్మన్నపల్లి శివారులో రోడ్డుప్రమాదం
కల్వర్టును ఢీకొట్టిన క్రూజర్ వాహనం, ముగ్గురు మృతి.
పలువురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన.
-
Feb 14, 2026 08:34 IST
ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
ఆర్థిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్.
11:15 గంటలకు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల.
మండలిలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అనిత.
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు.
మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.
-
Feb 14, 2026 07:57 IST
నంద్యాల: శ్రీశైలంలో ఏడవ రోజుకు చేరుకున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
సాయంత్రం గజావాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకొనున్న ఆది దంపతులు.
రాత్రి క్షేత్ర పురవీధులలో స్వామి అమ్మవారికి వైభవంగా గ్రామోత్సవం.
-
Feb 14, 2026 07:46 IST
జగిత్యాల ఛైర్ పర్సన్ ఎవరికి?
ఎవరికీ రాని మ్యాజిక్ ఫిగర్ స్థానాలు
జగిత్యాలలో 50 వార్డుల్లో 18 సంజయ్, 17 జీవన్ రెడ్డి వర్గం గెలుపు.
పార్టీ బీ ఫామ్‌పై గెలిచిన అభ్యర్థుల్లో రెండు వర్గాలుగా చీలిక.
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో నాటకీయ పరిమాణం.
-
Feb 14, 2026 07:43 IST
యాదాద్రి: చౌటుప్పల్ ఎల్లగిరి వద్ద బృందావన్ కెమికల్ కంపెనీలో పేలిన రియాక్టర్
పేలుడు దాటికి భారీ శబ్దం, ఉలిక్కిపడిన సమీప గ్రామ ప్రజలు, స్థానికులు.
ఏడు ఫైరింజన్‌లతో మంటలు అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది.
రియాక్టర్ పేలుడుతో దెబ్బతిన్న కంపెనీ భవనం.
కార్మికుల షిఫ్ట్ చేంజ్ సమయంలో ప్రమాదం జరగడంతో తప్పిన పెను ప్రమాదం.
-
Feb 14, 2026 07:38 IST
ఈ నెల 16న అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన
అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న బిల్ గేట్స్.
ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించనున్న బిల్ గేట్స్.
-
Feb 14, 2026 07:10 IST
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక వాయిదా పడనున్న ఉభయసభలు
రేపు, ఎల్లుండి చట్టసభలకు సెలవు
ఈ నెల 17న బడ్జెట్‌పై చర్చ అజెండాగా పునఃప్రారంభం కానున్న ఉభయసభలు
-
Feb 14, 2026 07:02 IST
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ఉ.10:30కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ
ఏపీ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్న మంత్రివర్గం
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి వంగలపూడి అనిత
మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అనగాని
-
Feb 14, 2026 06:52 IST
అమరావతి: నేడు ఏపీ బడ్జెట్
నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు
-
Feb 14, 2026 06:46 IST
నేడు అసోంలో ప్రధాని మోదీ పర్యటన
రూ.5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
దిబ్రూగఢ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీకి చర్యలు
గువాహటిలో కుమార్ భాస్కర్ వర్మ సేతు ప్రారంభం