ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కమాండోల మృతి..
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:33 PM
ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తారి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో నలుగురు కమాండోలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని ధమ్‌తారి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం జిల్లాలోని ఖప్రి బైపాస్‌పై ఆగి ఉన్న ట్రక్కును.. కోబ్రా కమాండోలు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కమాండో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేశ రక్షణకోసం పోరాడే కమాండోలు నలుగురు ఒకేసారి మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
సెలవు మంజూరు చేసిన తర్వాత కమాండోలు జగదల్‌పూర్ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్తుండగా ఆగి ఉన్న ట్రక్కును వెనుక వైపు బలంగా ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కమాండోలు నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు ముఖేష్ కుమార్, ఉమేంద్ర సింగ్, రాజ్ కుమార్ గౌర్, డ్రైవర్ హీరాలాల్ నగర్‌గా గుర్తించారు. మరో కమాండో అభిమాన్ రాయ్‌గా గుర్తించారు. అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
స్టాలిన్ కావాలో.. నేను కావాలో తేల్చుకోండి