-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Live Updates of 2nd June 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 02 , 2026 | 06:25 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 02, 2026 21:47 IST
సంగారెడ్డి: పీచేరాగడి తండాలో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు
రూ. 6.22 కోట్ల విలువైన ముడి పదార్థాల స్వాధీనం
3 కిలోల మెఫెడ్రిన్, క్లోరోఫామ్, అసిటోన్, మోనోమిథైలమైన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, 2,293 లీటర్ల రసాయనాల సీజ్
ముగ్గురిని అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు
-
Jun 02, 2026 21:09 IST
నంద్యాల: శ్రీశైలంలో ముగిసిన ట్రస్టు బోర్డు సమీక్ష
వర్షాకాలంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు
క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి త్వరితగతిన చర్యలకు నిర్ణయం
-
Jun 02, 2026 21:08 IST
విశాఖ: ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం
AI విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ల్యాండింగ్
విమానంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
-
Jun 02, 2026 20:32 IST
మన్యం: 24 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు
వెలగవలసలో చేతబడి నెపంతో రమేష్(30) దారుణ హత్య
మృతుడి సోదరుడు శ్రీధర్ ఫిర్యాదుతో 16 మంది అరెస్టు
-
Jun 02, 2026 20:06 IST
గుజరాత్‌లో ఘోర ప్రమాదం
సూరత్ జిల్లా బర్దోలి దగ్గర ఢీకొన్న రెండు బస్సులు
మంటలు చెలరేగి ఏడుగురు సజీవ దహనం
పలువురికి గాయాలు, కొనసాగుతున్న సహాయకచర్యలు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
-
Jun 02, 2026 20:06 IST
భవిష్యత్ డిజిటల్ ఎకానమీకి కీలక గమ్యస్థానంగా ఏపీ: సీఎం చంద్రబాబు
విశాఖ డిజిటల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది: సీఎం
ఆసియా-పసిఫిక్‌లో ప్రముఖ హైపర్‌స్కేల్ డిజిటల్ ఇన్‌ఫ్రా సంస్థ ఎయిర్‌ట్రంక్: సీఎం
విశాఖలో 2 గిగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ప్రతిపాదన: సీఎం
-
Jun 02, 2026 20:05 IST
మాస్కో చేరుకున్న మంత్రి నారా లోకేష్
ఈ నెల 7వరకు రష్యాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
సెయింట్ పీటర్స్‌బర్గ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొననున్న లోకేష్
-
Jun 02, 2026 20:04 IST
NDAలో జనసేన భాగస్వామి: టీ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
జనసేన, పవన్‌కల్యాణ్ అంటే గౌరవం: రాంచందర్‌రావు
ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టొచ్చు: రాంచందర్‌రావు
జనసేన సభకు కాంగ్రెస్ అనుమతించకపోవడం అప్రజాస్వామికం: టి బీజేపీ చీఫ్
-
Jun 02, 2026 19:45 IST
పవన్ కల్యాణ్ అజ్ఞానంతో మాట్లాడారు: ఎమ్మెల్సీ అద్దంకి
పవన్ వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించరు: అద్దంకి
కాంగ్రెస్ లక్ష్యంగా పవన్ మాట్లాడారు: అద్దంకి
పవన్ ఎత్తులను చిత్తు చేస్తాం: అద్దంకి దయాకర్
-
Jun 02, 2026 19:30 IST
TGPSC నోటిఫికేషన్లు విడుదల
290 పోస్టులకు TGPSC నోటిఫికేషన్
R&B శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్
49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్
కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్
-
Jun 02, 2026 18:59 IST
పవన్ ప్రెస్‌మీట్ పెడితే తెలంగాణ సీఎంకు అభ్యంతరమేంటి?: ఎంపీ రఘునందన్
రేవంత్ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రెస్‌మీట్ పెట్టరా?: రఘునందన్
పక్క రాష్ట్రం వాళ్లు ఇక్కడ ప్రెస్‌మీట్లు పెట్టరా?: రఘునందన్
గతంలో కేసీఆర్ కూడా పక్క రాష్ట్రంలో సభలు పెట్టారు: రఘునందన్
ఏపీ డిప్యూటీ సీఎం సభ పెడితే.. కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు: రఘునందన్
-
Jun 02, 2026 18:58 IST
పవన్, కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
ప్రజా సమస్యలు దారిమళ్లించేందుకే వారి ప్రయత్నం: జగదీష్‌రెడ్డి
పవన్ సభకు ఆంక్షలు పెట్టడమేంటి?: జగదీష్‌రెడ్డి
తెలంగాణలో ఓ డ్రామా నడుస్తోంది: జగదీష్‌రెడ్డి
రాష్ట్రంలో తిరగకుండా ఎవరిని ఎవరూ ఆపలేరు: జగదీష్‌రెడ్డి
పవన్ బాధ్యతాయుత పదవిలో ఉన్నారు.. జాగ్రత్తగా మాట్లాడాలి: జగదీష్‌రెడ్డి
ఇవన్నీ పవన్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాలు: జగదీష్‌రెడ్డి
గతంలోనూ తెలంగాణలో పవన్ పోటీ చేశారు: జగదీష్‌రెడ్డి
భవిష్యత్‌లోనూ పవన్ పోటీ చేయొచ్చు: జగదీష్‌రెడ్డి
-
Jun 02, 2026 18:30 IST
పవన్‌తో బీజేపీ మాట్లాడించింది: మంత్రి పొన్నం
బీజేపీ నేతలు పవన్‌కు సరిగ్గా స్క్రిప్ట్ ఇచ్చినట్టు లేదు: మంత్రి
పేమెంట్ తీసుకుని రాజకీయాలు మాట్లాడితే ఊరుకోం: మంత్రి
తెలంగాణ వాళ్లని వేర్పాటువాదులు అంటే ఊరుకోం: మంత్రి
పవన్.. నువ్వు కూడా కాంట్రాక్టులు చేసుకో: పొన్నం
-
Jun 02, 2026 18:20 IST
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే: పొన్నం
ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరు: పొన్నం
తెలుగు రాష్ట్రాలు ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం: పొన్నం
తెలంగాణకు పవన్ ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా?: పొన్నం
తెలంగాణ అమరవీరులకు ఏనాడైనా అండగా నిలిచారా?: పొన్నం
-
Jun 02, 2026 18:03 IST
హైదరాబాద్: పవన్ కల్యాణ్ నివాసం వద్ద జనసేన కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వివాదం
పవన్ ఇంటికి భారీగా చేరుకున్న ఆయన అభిమానులు
పవన్ ప్రెస్‌మీట్ తర్వాత ఒక్కసారిగా దూసుకొచ్చిన జనసేన కార్యకర్తలు
అదుపు చేసే క్రమంలో లాఠీలకు పని చెప్పిన పోలీసులు
కింద పడిన పలువురు కార్యకర్తలు
పోలీసులకు వ్యతిరేకంగా జనసేన క్యాడర్ నినాదాలు
బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేసిన పవన్ కళ్యాణ్
-
Jun 02, 2026 17:56 IST
కర్నూలు: నగరంలో భారీ వర్షం
పలుచోట్ల రోడ్లపై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
-
Jun 02, 2026 17:33 IST
ఏపీలో నా తల తీయడానికి కొందరు రెడీగా ఉన్నారు: పవన్
దాడులు చేయాలనుకుంటే నా అడ్రస్ ఇదే.. ఎవరొస్తారో రండి: పవన్
అందుకే నా ఇంటి ఎదుటే ప్రెస్‌మీట్ పెట్టా: పవన్
ఆంధ్రా కొడకా అని తిట్టినా.. నా తెలంగాణ అని ఊరుకున్నా: పవన్
అనవసర గొడవలు వద్దనేదే నా అభిప్రాయం: పవన్
కాంగ్రెస్ నేతలు నాలుక కోస్తామని బెదిరిస్తున్నారు: పవన్
ఎవరొస్తారో రండి నా నాలుక చూపిస్తా: పవన్
బెదిరిస్తే భయపడేవాళ్లం కాదు: పవన్
-
Jun 02, 2026 17:28 IST
ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా పాస్‌పోర్టు కావాలా?: పవన్
కాంగ్రెస్ పార్టీకి పద్ధతి ఉందా?: పవన్
దీనిపై రాహుల్, ప్రియాంక స్పందించాలి: పవన్
దమ్ముంటే.. నేను తెలంగాణకు రావొద్దని కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో తీర్మానం చేయండి: పవన్
తెలంగాణను జనసేన ఏనాడూ అగౌరవపరచలేదు: పవన్
తెలంగాణను గుండెల్లో పెట్టుకున్నాం: పవన్
ఐ లవ్ పాకిస్థాన్ అంటే తప్పులేదు.. నేను ప్రెస్‌మీట్ పెడితే తప్పా?: పవన్
ప్రొ. నాగేశ్వర్‌లా నేను కుట్రలు చేయను: పవన్
-
Jun 02, 2026 17:11 IST
చావుకు సిద్ధపడే పార్టీ పెట్టా: పవన్
ఎంతకాలం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారు: పవన్
ఉగ్రవాదం కంటే ప్రాంతీయ విద్వేషాలు ప్రమాదకరం
-
Jun 02, 2026 17:11 IST
తెలంగాణలో పుట్టినవే జనసేన సిద్ధాంతాలు: పవన్
తెలంగాణలో గొడవలు పెట్టడానికి నేను రాను: పవన్
సమస్యలపై పోరాటానికి మాత్రమే వస్తా: పవన్
-
Jun 02, 2026 17:04 IST
తెలంగాణలో జనసేన ఉంటుంది: పవన్
తెలంగాణలో పోటీ చేస్తాం: పవన్
ఇప్పుడు డిసైడ్ అయ్యా.. తెలంగాణలోనే తిరుగుతా: పవన్
దేశంలో అంతర్భాగం తెలంగాణ: పవన్
తెలంగాణను వ్యతిరేకించినవారే పదవుల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు అయ్యారు: పవన్
రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేయొచ్చు: పవన్
ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేయొచ్చు: పవన్
పీవీని నంద్యాల నుంచి ఆంధ్రులు గెలిపించలేదా?: పవన్
-
Jun 02, 2026 17:03 IST
ఆంధ్రా వాళ్లను తిడుతుంటే వాళ్లు ఇక్కడెలా ఉంటారు: పవన్
ఇంకెంతకాలం ఆంధ్రావాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారు: పవన్
సడెన్‌గా ఇక్కడికి రావొద్దంటే ఎలా: పవన్
తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు: పవన్
మీరు ఎవరిని బేవకూఫ్ చేస్తారు: పవన్
-
Jun 02, 2026 17:03 IST
నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు: పవన్
నన్ను ఎన్ని తిట్టినా పట్టించుకోను: పవన్
తెలంగాణలో ఉపాధి లేకపోతే నేను కారణమా?: పవన్
మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చింది: పవన్
-
Jun 02, 2026 17:01 IST
గుంటూరులో TRS కార్యాలయం పెడితే స్వాగతించాం: పవన్
ఏపీలోనే కాలేదు.. ఇక్కడ ఏమైనా చేస్తే నేను సీఎం అయిపోతానా?: పవన్
తెలంగాణను నేనెప్పుడు అవమానించాను?: పవన్
నా పీక కోసినా కూడా నేను భయపడేది లేదు: పవన్
-
Jun 02, 2026 17:01 IST
మీ తాటాకు చప్పుళ్లకు జనసేన భయపడదు: పవన్
భయపడేవాడినే అయితే పార్టీ పెడతానా?: పవన్
తెలంగాణకు ద్రోహం జరిగితే మొట్టమొదట గొంతులేపేది జనసేనే: పవన్
ఏం చేసినా ఓట్ల కోసం కాదు.. నాకు తెలంగాణపై ప్రేమ, మమకారం: పవన్
-
Jun 02, 2026 16:52 IST
గద్దర్‌తో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది: డిప్యూటీ సీఎం పవన్
రాజకీయాల్లోకి రాకముందే నాకు గద్దర్ తెలుసు: పవన్
గద్దర్ ఒంట్లో బుల్లెట్లు దిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు: పవన్
గద్దర్ మా పార్టీ కార్యాలయానికి వచ్చేవారు: పవన్
గద్దర్ బతికున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు?: పవన్
-
Jun 02, 2026 16:51 IST
సీఎం రేవంత్‌రెడ్డిపై నాకు గౌరవం ఉంది: డిప్యూటీ సీఎం పవన్
నేను ఒక చెరువును కబ్జా చేశానని కొందరు అంటున్నారు: పవన్
అలా చేస్తే నన్ను ఇక్కడ ఉండనిస్తారా?: పవన్
నా ఫామ్‌హౌస్ కబ్జా అని తేలిస్తే ప్రభుత్వానికే రాసిస్తా: పవన్
-
Jun 02, 2026 16:50 IST
ఓ విశ్లేషకుడు ఇక్కడ నా గురించి తప్పుగా మాట్లాడారు: డిప్యూటీ సీఎం పవన్
ఆ విశ్లేషకుడి వల్లే ఈ గొడవ మొదలైంది: పవన్
ఆ వ్యాఖ్యల పైనే జనసేన సైనికులు స్పందించారు: పవన్
కొన్ని చోట్ల కేసులు పెట్టారు.. అందులో నా ప్రమేయం లేదు: పవన్
పార్టీ స్థాపించి 13 ఏళ్లు గడుస్తున్నా ఇంకా మేం నోరు మూసుకుని కూర్చోవాలా?: పవన్
తెలంగాణలో మార్పు తప్ప మేం అధికారం కోరుకోవడం లేదు: పవన్
దేశంలో చాలాచోట్ల తెలుగువారు ఉన్నారు: పవన్
వాళ్లను అక్కడి నుంచి వెళ్లిపోమంటే కరెక్టేనా?: పవన్
-
Jun 02, 2026 16:45 IST
మీ ఇష్టానికి మాట్లాడితే మేం భయపడాలా: డిప్యూటీ సీఎం పవన్
తెలంగాణలో జనసేన ఎదగాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు: పవన్
మీరు ఎన్ని తిట్లు తిట్టినా.. నా గుండెలో తెలంగాణ ఉంటుంది: పవన్
వైసీపీ గూండాల బెదిరింపుల ముందు ఈ బెదిరింపులు ఓ లెక్కా?: పవన్
-
Jun 02, 2026 16:44 IST
తెలంగాణ మీ అయ్య జాగీరా: డిప్యూటీ సీఎం పవన్
హైదరాబాద్‌లో నాకేం పని కొందరు ప్రశ్నిస్తున్నారు: పవన్
మీరు ఎవరు నన్ను బెదిరించడానికి: పవన్
నాపై దాడులు చేస్తామంటున్నారు: పవన్
నాకు తెలంగాణలో కంటే ఏపీలోనే బెదిరింపులు ఎక్కువ: పవన్
2019 నేను ఓడిపోయినప్పుడు తెలంగాణ వాసులే ఇక్కడ ఆ పరిస్థితి రాదన్నారు: పవన్
-
Jun 02, 2026 16:42 IST
తెలంగాణ విభజన తీరుకు మేం వ్యతిరేకం: డిప్యూటీ సీఎం పవన్
పార్లమెంట్ తలుపులు మూసి విభజించిన తీరును ప్రశ్నించాం: పవన్
నాకు వారాహి యాత్రకు అనుమతి ఇచ్చింది తెలంగాణ: పవన్
వైసీపీ నన్ను ఏపీలో అడుగుపెట్టనివ్వనంటే ఈ ప్రాంతం ఆదరించింది: పవన్
ఏపీలోనే నేను అధికారం కోరుకోలేదు.. తెలంగాణలో ఎందుకు కోరుకుంటా: పవన్
తెలంగాణ ప్రజలు, నాయకులకు ఏపీపై విద్వేషం లేదు: పవన్
విద్వేషం చూపించి ఉంటే ఏపీ వారు ఇక్కడ తిరిగేవారు కాదు: పవన్
-
Jun 02, 2026 16:41 IST
తెలంగాణ నలుమూలలా పెరిగిన వాడిని: డిప్యూటీ సీఎం పవన్
తెలంగాణ బాగుండాలనే ఎప్పుడూ కోరుకున్నా: పవన్
నా సినిమాల్లో తెలంగాణ స్ఫూర్తి కనిపిస్తుంది: పవన్
ఆదిలాబాద్ తాండాల్లో గడిపిన వాడిని: పవన్
ఆ తాండాల్లో దాహార్తి తీర్చినవాడిని: పవన్
-
Jun 02, 2026 16:40 IST
హైదరాబాద్: 13వ ఏట అడుగుపెడుతున్న తెలంగాణకు శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్
లక్ష మందికి పైగా జనసేన నాయకులు, సైనికులు ఉన్న తెలంగాణలో కేడర్ తరఫున ప్రజలకు శుభాకాంక్షలు: పవన్ కల్యా్ణ్
తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన: పవన్ కల్యాణ్
ఇక్కడి నాయకులంతా 2007-08 నుంచి అప్పటి యువరాజ్యం సభ్యులు: పవన్ కల్యాణ్
తెలంగాణపై నాకు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు: పవన్ కల్యాణ్
తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: పవన్ కల్యాణ్
తెలంగాణపై నాకున్న ప్రేమ రాజకీయాలకు అతీతం: పవన్ కల్యాణ్
-
Jun 02, 2026 16:22 IST
హైదరాబాద్: పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్
-
Jun 02, 2026 15:42 IST
రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం
విశాఖ: రాగల 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం: వాతావరణ శాఖ
విశాఖ, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, పార్వతీపురంమన్యం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు, ఏన్టీఆర్, కృష్ణా జిల్లాలలో ఉరుములు మెరుపులో కూడిన వర్షాలు పడే ఆవకాశం.
-
Jun 02, 2026 15:34 IST
కామారెడ్డి: గాంధారి మండలం చెద్మల్ తండాలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
భూమి విషయంలో తలెత్తిన వివాదం
రెండు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలు
ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు
గాయపడ్డ వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు
-
Jun 02, 2026 15:29 IST
వెస్టిండీస్ మహిళల జట్టుకు ఊహించని షాకిచ్చిన ఐర్లాండ్
ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ విజయం
డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో గెలిచిన ఐర్లాండ్
వెస్టిండీస్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం
-
Jun 02, 2026 15:22 IST
అమరావతి: సీఎం చంద్రబాబుతో బ్లాక్ స్టోన్ ప్రతినిధుల భేటీ
ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై సీఎంతో చర్చలు
డేటా సెంటర్ రంగంపైనా చర్చలు
న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ బ్లాక్ స్టోన్
ఎయిర్‌ట్రంక్ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్ ఖుదా, వైస్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ కాక్స్ సైతం సీఎంతో భేటీ అయ్యారు.
వీరి భేటీలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు
-
Jun 02, 2026 15:19 IST
హైదరాబాద్: పవన్ డ్రామాలు ఆపాలి: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి: వేముల వీరేశం
తెలంగాణలో అశాంతి సృష్టించొద్దు: వేముల వీరేశం
రాజకీయంపై పవన్‌కు స్పష్టత లేదు: వేముల వీరేశం
పవన్ కల్యాణ్ పార్ట్‌టైమ్ పొలిటికల్ లీడర్: వేముల వీరేశం
-
Jun 02, 2026 15:18 IST
విజయవాడ: మంచినీటి కోసం తవ్విన గోతిలో దిగి నిరసన తెలిపిన వైసీపీ నేత దేవినేని అవినాష్
గుణదల కొండ ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేసిన నీటిని పక్క నియోజకవర్గానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని నిరసన తెలిపిన అవినాష్
ఎండాకాలం మంచినీటి సమస్యతో ప్రజలు బాధపడుతున్నారు: అవినాష్
మంచినీటిని తరలించడం ఎంతవరకు సమంజసం: అవినాష్
మంచినీటిని తరలించకుండా అధికారులు చర్యలు చేపట్టాలి: అవినాష్
అధికారుల హామీతో నిరసనను విరమించిన దేవినేని అవినాష్: అవినాష్
-
Jun 02, 2026 15:16 IST
తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు
ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజుల వివరాలను ప్రతి ప్రైవేట్ స్కూల్లో నోటీస్ బోర్డుపై ఉంచాలని ఆదేశం
నిబంధనలు ఉల్లంఘించే స్కూళ్లపై తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు
-
Jun 02, 2026 15:13 IST
ఈ నెల 4న ఎన్డీయే నేతల సమావేశం: సీఎం చంద్రబాబు
అన్ని స్థాయిల్లో సమన్వయ కమిటీల నియామకం: సీఎం
క్షేత్రస్ధాయిలో మిత్రపక్షాలను కలుపుకునివెళ్లాలి: సీఎం
కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి: సీఎం
అధికారంలో కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలి: సీఎం
పనిచేయకపోతే నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తా: సీఎం
ఎవరూ వన్‌టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దు: సీఎం
ఎమ్మెల్యేలు ఎక్కడా నోరుపారేసుకోవద్దు: సీఎం
-
Jun 02, 2026 15:11 IST
ఎబోలాపై కేంద్రం కీలక అడ్వయిజరీ
ఎబోలా ప్రభావిత దేశాల్లో ప్రయాణించినవారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచన
కాంగో, ఉగాండాలో ప్రబలుతున్న ఎబోలా
భారత్‌లో ఎబోలా కేసులు లేవు: కేంద్రం
ఎబోలా లక్షణాలు ఉంటే 1075 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి: కేంద్రం
-
Jun 02, 2026 15:07 IST
బెంగళూరు: కర్ణాటక సీఎంగా బుధవారం నాడు డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం
మంత్రులుగా ప్రమాణం చేయనున్న 12 మంది
-
Jun 02, 2026 15:06 IST
మంచిర్యాల: జన్నారం (మం) తిమ్మాపూర్‌లో విషాదం
పొలంలో వరి కొయ్యలు కాల్చివేసే క్రమంలో మంటలు అంటుకుని రేగుంట పోచయ్య (60)అనే రైతు మృతి.
-
Jun 02, 2026 14:09 IST
సంగారెడ్డి: న్యాల్కల్‌లో అమానుషం
మగ శిశువును PHC వెనుక వదిలి వెళ్లిన దుండుగలు
శిశువును గుర్తించి ICDSకు సమాచారం ఇచ్చిన స్థానికులు
-
Jun 02, 2026 14:09 IST
ఏపీ దేవాదాయ శాఖ మాజీ AC శాంతి రిమాండ్ పొడిగింపు
ఈ నెల 15 వరకు రిమాండ్ పొడిగించిన విజయవాడ ACB కోర్టు
-
Jun 02, 2026 14:08 IST
విశాఖలో యువకుడి కిడ్నాప్ కలకలం
యువకుడు భాస్కర్ బాలాజీపై హత్యాయత్నం
మారణాయుధాలతో దాడి చేసిన మరో యువకుడు
యువతి విషయంలో ఇద్దరి మధ్య వివాదం
-
Jun 02, 2026 14:02 IST
చెన్నై పోర్టులో గ్యాస్ లీక్
ట్యాంకర్ నుంచి సల్ఫర్ గ్యాస్ లీక్
పోర్టు పరిసరాల్లో కిలోమీటర్ల మేర కమ్ముకున్న పొగ
సెక్రటేరియట్ రోడ్డు మూసివేసిన అధికారులు
-
Jun 02, 2026 14:01 IST
విశాఖ: 'పెద్ది' సినిమాను అడ్డుకోవాలని ప్రయత్నం: నిర్మాత నట్టి కుమార్
ఎన్ని అడ్డంకులు సృష్టించినా 'పెద్ది' సినిమా రిలీజ్ అవుతుంది: నిర్మాత
మన శంకర వరప్రసాద్ సినిమా డిస్ట్రిబ్యూషన్ అంశంలో బత్తుల సత్యనారాయణ మోసం చేశారు: నిర్మాత
బత్తుల సత్యనారాయణ సినిమాను రిలీజ్ చేస్తానని చెప్పి సడన్‌గా చేతులెత్తేశారు: నిర్మాత
-
Jun 02, 2026 14:00 IST
మంచిర్యాల: కన్నెపల్లిలో కాంగ్రెస్-BRS శ్రేణుల ఘర్షణ
కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఇరువర్గాల గొడవ
ప్రొటోకాల్ పాటించడం లేదని BRS నేతల అభ్యంతరం
కుర్చీలతో కొట్టుకున్న ఇరు పార్టీల నాయకులు
-
Jun 02, 2026 13:49 IST
బీజేపీకి తమిళనాడు నేత అన్నామలై రాజీనామా
నితిన్ నబిన్‌కు రాజీనామా లేఖ అందజేసిన అన్నామలై
రాజ్యసభ సీటును తీసుకునేందుకు అన్నామలై విముఖం
సాయంత్రం 4:00 గంటలకు అమిత్ షాతో అన్నామలై భేటీ అయ్యే అవకాశం
సొంత పార్టీ పెట్టాలని అన్నామలై నిర్ణయం
-
Jun 02, 2026 13:35 IST
పవన్ సభ ఎందుకు పెడుతున్నారు?: అద్దంకి దయాకర్
పవన్ వెనుక బీజేపీ ఉంది: అద్దంకి దయాకర్
ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు: అద్దంకి
మోదీ వచ్చి వెళ్లాక తెలంగాణ టార్గెట్ అని బీజేపీ చెప్పింది: అద్దంకి
పవన్ సభపై BRS ఎందుకు మాట్లాడటం లేదు?: అద్దంకి
-
Jun 02, 2026 13:32 IST
జనసేన హౌస్‌మోషన్ పిటిషన్ తిరస్కరణ
పిటిషన్ తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు
వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ ధాఖలు చేసుకోవాలని న్యాయస్థానం సూచన
-
Jun 02, 2026 13:25 IST
తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహితలకు ఊరట
వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
కారుణ్య నియామకాలకు కుమార్తెలు అర్హులే: సుప్రీంకోర్టు
తల్లిదండ్రులు మరణిస్తే కారుణ్య నియామకానికి అర్హులు: సుప్రీంకోర్టు
వైవాహిక స్థితి ఆధారంగా హక్కులను కాలరాయలేరు: సుప్రీంకోర్టు
-
Jun 02, 2026 13:18 IST
తెలంగాణ హైకోర్టులో జనసేన హౌస్ మోషన్ పిటిషన్
సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టుకు జనసేన
సభ జరిగితే నిరసనలకు అవకాశముందని స్పష్టం చేసిన పోలీసులు
సభకు అనుమతి ఇవ్వొద్దని పాశం యాదగిరి కేవియట్ పిటిషన్
తమ వాదన వినకుండా కోర్టు ఏకపక్ష నిర్ణయం లేదా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్న యాదగిరి
-
Jun 02, 2026 13:11 IST
ఉద్యమకారుల గుర్తింపుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
రేపు ఉ.11:30కు సచివాలయంలో అఖిలపక్ష సమావేశం
అన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం
ప్రతి పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధుల నామినేషన్ కోరిన ప్రభుత్వం
ఉద్యమకారుల గుర్తింపుపై సూచనలు స్వీకరించనున్న కమిటీ
-
Jun 02, 2026 12:59 IST
తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి: మహేశ్ గౌడ్
తెలంగాణ ప్రజలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం: మహేశ్ గౌడ్
ఆంధ్ర నాయకులకు తెలంగాణలో ఏం పని?: మహేశ్ గౌడ్
మనుగడ లేని పార్టీలు తెలంగాణలో విజయవంతం కావు: మహేశ్ గౌడ్
-
Jun 02, 2026 12:52 IST
లివింగ్ లెజెండ్ కేసీఆర్: కేటీఆర్
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు కేసీఆర్: కేటీఆర్
పుష్కర తెలంగాణ.. ఇప్పుడు ముష్కరుల పాలైంది: కేటీఆర్
2028 డిసెంబర్‌లో కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారు: కేటీఆర్
దేశమంతా కాంగ్రెస్‌ను వదిలించుకుంది: కేటీఆర్
-
Jun 02, 2026 12:39 IST
SIR వర్క్‌షాప్‌నకు హాజరుకాని MLAలపై చంద్రబాబు సీరియస్
సీరియస్‌నెస్ లేకపోతే ఇబ్బందులే: సీఎం చంద్రబాబు
గతంలోనూ భేటీకి కొంతమంది రాలేదు: చంద్రబాబు
కీలక సమావేశాలకు రాకపోతే ఎలా అని ప్రశ్నించిన చంద్రబాబు
ఇకపై ఇలాంటి అంశాల్లో సీరియస్‌గా ఉంటానని చంద్రబాబు హెచ్చరిక
-
Jun 02, 2026 12:26 IST
పీవీ సునీల్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందన
4వేల SC, ST కేసుల్లో చార్జ్‌షీట్ వేయించానన్నారు: రఘురామ
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో CIDకి సంబంధం లేదు: రఘురామ
సెన్సేషనల్ ఉంటే 200 కేసులు స్వీకరించటానికి లేదు: రఘురామ
4వేల కేసుల్లో చార్జ్‌షీట్ వేయించాననడం టూమచ్: రఘురామ
నా కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్‌కు సంబంధం ఉంది: రఘురామ
చార్జ్‌షీట్లు వేయడంలో సునీల్ పాత్రపై విచారణ జరపాలి: రఘురామ
-
Jun 02, 2026 12:17 IST
అమరావతి: టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో సీఎం చంద్రబాబు
SIRపై MLAలు, మంత్రులు, పరిశీలకులకు చంద్రబాబు దిశానిర్దేశం
-
Jun 02, 2026 12:14 IST
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొనసాగుతున్న హైడ్రామా
తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక
54 మంది TMC ఎమ్మెల్యేల తిరుగుబాటు
న్యూ తృణమూల్ ఏర్పాటుకు MLAల సన్నాహాలు
సంతకాల ఫోర్జరీ అంశంతో మొదలైన వివాదం
తిరుగుబాటు MLAలపై మమతా బెనర్జీ ఆగ్రహం
-
Jun 02, 2026 12:08 IST
CBSE చీఫ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు
పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్ హాజరుకావాలని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశం
CBSE చీఫ్ రాహుల్‌సింగ్ కూడా పార్లమెంటరీ విద్యాస్థాయీ సంఘం ముందు హాజరుకావాలని ఆదేశం
కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) పద్ధతిపై వివాదంతో చర్యలు
-
Jun 02, 2026 11:48 IST
హైదరాబాద్: గండిపేట భూముల నకిలీ జీవోల కేసు
పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
ఏపీలోని బ్రహ్మనాయుడు ఇంట్లో పోలీసుల సోదాలు
కేసులో కీలక నిందితుడు రాధాకృష్ణపై ఇప్పటికే 9 కేసులు
ఫేక్ జీవోలతో రూ.వందల కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు కుట్ర
-
Jun 02, 2026 11:39 IST
తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు అయినా జయశంకర్ విగ్రహం లేదు: కవిత
ఆగస్టు 6 నాటికి ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలి: కవిత
అమరవీరుల కుటుంబాలకు జులై 2లోపు న్యాయం చేయాలి: కవిత
డిమాండ్లు నెరవేర్చకపోతే ఉప్పల్ భగాయత్‌లో భూ ఉద్యమం: కవిత
-
Jun 02, 2026 11:31 IST
తెలంగాణకు పవన్ రావాల్సిన అవసరమేంటి?: ABNతో కోదండరాం
పవన్ ఇక్కడికి చాలాసార్లు వచ్చినా.. మాట్లాడినా ఏం అనలేదు: కోదండరాం
ప్రత్యేక సందర్భంలో వచ్చి సంగతి చూస్తామనడం సరికాదు: కోదండరాం
-
Jun 02, 2026 11:15 IST
సూర్యాపేట: కోదాడలోని శ్రీరంగాపురంలో రైతులకు కుచ్చుటోపీ
అధిక వడ్డీ ఇస్తానంటూ రూ.11 కోట్లు వడ్డీకి తీసుకున్న రియల్టర్ జితేందర్‌రెడ్డి
ఏడాది వరకు డబ్బు ఇవ్వలేనని కోర్టు నుంచి రైతులకు నోటీసులు
వ్యాపారి ఇంటి ముందు టెంట్ వేసి రైతుల నిరసన
-
Jun 02, 2026 11:07 IST
యాదాద్రి: భువనగిరి బైపాస్‌పై బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్
ఎదులగూడెంకు చెందిన యువకుడు రాహుల్ మృతి
-
Jun 02, 2026 11:02 IST
ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
జడ్జిలుగా ప్రమాణం చేసిన జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్, జస్టిస్ అరుణ్‌పల్లి, జస్టిస్ వెంకిట సుబ్రమణి
ప్రమాణం చేయించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
సుప్రీంకోర్టులో 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య
-
Jun 02, 2026 10:49 IST
మేం ఎప్పుడూ ఏపీ ప్రజలకు వ్యతిరేకం కాదు: ఎమ్మెల్సీ కోదండరాం
ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని మాత్రమే వ్యతిరేకించాం: కోదండరాం
చిన్న చిన్న విషయాల్లోనూ ఏపీ పాలకులు తల దూరుస్తున్నారు: కోదండరాం
BRS ప్రభుత్వం నిరంకుశ వైఖరితో వ్యవహరించింది: కోదండరాం
నిరసన తెలిపేందుకు కూడా ఒకప్పుడు స్వేచ్ఛ లేదు: కోదండరాం
-
Jun 02, 2026 10:41 IST
తెలంగాణ భవన్‌లో అమరవీరులకు నివాళులర్పించిన కేటీఆర్
పలువురు తెలంగాణ కళాకారులను సన్మానించిన కేటీఆర్
కేసీఆర్, తెలంగాణపై రూపొందించిన పలు పాటల ఆవిష్కరణ
-
Jun 02, 2026 10:41 IST
హైదరాబాద్: గాంధీభవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జాతీయ జెండా ఆవిష్కరించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
-
Jun 02, 2026 10:32 IST
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష
ఇవాళ జైలు నుంచి విడుదల కానున్న 92 మంది ఖైదీలు
2024లో 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష
-
Jun 02, 2026 10:26 IST
తెలంగాణ ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటే: చంద్రబాబు
తెలంగాణ, ఏపీ అభివృద్ధిలో పోటీపడి దూసుకుపోవాలి: చంద్రబాబు
ప్రపంచంలోనే హైదరాబాద్, అమరావతి అత్యుత్తమ నగరాలుగా వెలగాలి: చంద్రబాబు
ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలి: ఎక్స్‌లో చంద్రబాబు
-
Jun 02, 2026 10:24 IST
హైదరాబాద్: సా.4:30-5:30 మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పవన్ మీడియా సమావేశం
ప్రెస్‌మీట్‌కు పోలీసులు అనుమతి ఇస్తారని భావిస్తున్నా: ఎక్స్‌లో పవన్
-
Jun 02, 2026 10:17 IST
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
ప్రజల ఆకాంక్షలు, యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ
జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనే: ఎక్స్‌లో పవన్
ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకుంది: పవన్
-
Jun 02, 2026 10:12 IST
బీజేపీ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర బీజేపీదే: బండి సంజయ్
కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తే.. బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడింది: బండి సంజయ్
రేవంత్ పానలపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు: బండి సంజయ్
-
Jun 02, 2026 10:05 IST
తెలంగాణలో అమల్లోకి వచ్చిన అడ్వకేట్స్ ప్రొటెక్షన్ చట్టం
న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక చట్టం అమలు
జీవో MS నం.41 విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
Jun 02, 2026 09:28 IST
సంక్షేమం, అభివృద్ధికి ఈ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోంది: సీఎం రేవంత్
రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి
మాది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజాప్రభుత్వం: సీఎం రేవంత్
తెలంగాణ విజన్-2047 లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నాం: సీఎం రేవంత్
-
Jun 02, 2026 09:23 IST
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
ధైర్యసాహసాల తెలంగాణ చరిత్రకు ప్రధాని మోదీ నివాళి
వికసిత్ భారత్‌లో తెలంగాణ పాత్ర కీలకం: ప్రధాని మోదీ
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: మోదీ
తెలంగాణ సంస్కృతి, వారసత్వం గొప్పది: మోదీ
-
Jun 02, 2026 09:04 IST
ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
పరేడ్ గ్రౌండ్స్‌లో జెండా ఎగరవేసిన డిప్యూటీ సీఎం భట్టి
-
Jun 02, 2026 08:51 IST
మహరాష్ట్ర పర్యటనలో మంత్రి లోకేశ్కు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేక కానుక
ముంబైలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బృందంతో మంత్రి లోకేశ్ భేటీ
రాయల్ ఎన్‌ఫీల్డ్ అందించిన మినియేచర్ బహుమతిపై లోకేశ్ ఆనందం
'Choose Speed-Choose AP' హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌లో లోకేష్ పోస్ట్
పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ 'బుల్లెట్' వేగంతో ముందుకెళ్తోంది: లోకేశ్
-
Jun 02, 2026 08:49 IST
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి
-
Jun 02, 2026 08:27 IST
సిద్దిపేట: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి పొన్నం
హుస్నాబాద్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
-
Jun 02, 2026 08:25 IST
హైదరాబాద్‌లో నకిలీ ఫోన్‌పే యాప్ బెడద
గొర్రెల వ్యాపారిని మోసం చేసిన ముఠాను అరెస్ట్ చేసిన కంచన్‌బాగ్ పోలీసులు
5 గొర్రెలు కొనుగోలు చేసి ఫేక్ రసీదు చూపించి పరారీ
పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
ఇద్దరు మైనర్లు సహా ఆరుగురి అరెస్ట్
-
Jun 02, 2026 08:11 IST
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
ఏటా గత త్యాగాలను స్మరిస్తూ రేపటి లక్ష్యాలు సమీక్షించే భావోద్వేగ సందర్భం జూన్ 2: సీఎం
-
Jun 02, 2026 08:11 IST
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: హరీశ్ రావు
త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు నేడు: హరీశ్ రావు
అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు ఇది: హరీశ్ రావు
4 కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు: హరీశ్ రావు
-
Jun 02, 2026 08:01 IST
హైదరాబాద్: గన్‌పార్క్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన రేవంత్
కాసేపట్లో పరేడ్ గ్రౌండ్స్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
-
Jun 02, 2026 07:50 IST
ఏలూరు: వేలేరుపాడులో అగ్నిప్రమాదం
ఇద్దరు మహిళల మృతి, రెండు పూరిళ్లు దగ్ధం
-
Jun 02, 2026 07:37 IST
నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
కల్వకుర్తి మం. తాండ్ర గేటు సమీపంలో అదుపుతప్పి బోల్తాపడిన కారు
ఇద్దరి మృతి, ఒకరి పరిస్థితి విషమం
మృతులు వంగూరు గ్రామానికి చెందిన బాలు, ప్రవీణ్‌గా గుర్తింపు
-
Jun 02, 2026 07:21 IST
తెలంగాణలో పవన్ సభపై కొనసాగుతున్న సందిగ్ధత
సా.4 గంటలకు గచ్చిబౌలిలో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ
ఇప్పటికే పవన్ సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు
కోర్టు అనుమతిస్తుందని జనసేన నేతల ధీమా
-
Jun 02, 2026 07:03 IST
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్
శాసనమండలిలో త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
-
Jun 02, 2026 07:01 IST
నేడు ఢిల్లీలో బీజేపీ నేతలతో అన్నామలై సమావేశం
కొత్త పార్టీ వార్తలపై 2 రోజుల్లో వివరణ: అన్నామలై
కొత్త పార్టీ ఏర్పాటు చేయాలంటూ అభిమానుల పోస్టర్లు
-
Jun 02, 2026 07:00 IST
RCB ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు భారీ జరిమానా
మ్యాచ్ ఫీజ్‌లో 50 శాతం కోత సహా రెండు డీమెరిట్ పాయింట్లు
వచ్చే సీజన్ తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధం
ఫైనల్‌లో అంపైర్ వైపు ఐస్ బ్యాగ్ విసిరిన డేవిడ్
-
Jun 02, 2026 06:40 IST
నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
జడ్జిలుగా జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ అరుణ్‌పల్లి
సీనియర్ అడ్వకేట్ సుబ్రమణి ప్రమాణస్వీకారం
ప్రమాణం చేయించనున్న CJI
-
Jun 02, 2026 06:39 IST
తమిళనాడులో మరోసారి తెరపైకి కావేరి నదీజలాల వివాదం
నేడు తమిళ పార్టీల నేతృత్వంలో చెన్నైలో ఆందోళనలు
మేఘదాతు ప్రాజెక్ట్‌కు కర్ణాటక సర్కార్ ఏర్పాట్లు
కర్ణాటక వైఖరిని ఖండిస్తూ ఆందోళనలకు వైగో పిలుపు
-
Jun 02, 2026 06:38 IST
పవన్ సభకు అనుమతి కోరుతూ నేడు హైకోర్టుకు జనసేన
జనసేన సభకు అనుమతి లేదన్న ప్రచారం అవాస్తవం: జనసేన
హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ వార్తల్లో నిజం లేదు: జనసేన
హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేస్తాం: జనసేన
-
Jun 02, 2026 06:37 IST
విశాఖ కేజీహెచ్ సమీపంలోని ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
చెవి సమస్యతో వచ్చిన 13ఏళ్ల చిన్నారికి రాంగ్ ట్రీట్‌మెంట్, చిన్నారి మృతి
కేజీహెచ్ ఎదురుగా ఉన్న ఆయుష్మాన్ ఆసుపత్రిలో ఘటన.. బంధువుల ఆందోళన
-
Jun 02, 2026 06:36 IST
ఏపీలో ద్రోణి ప్రభావం
నేడు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
-
Jun 02, 2026 06:36 IST
రెండు, మూడు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు: IMD
ఈ నెల రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు
రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు
నేడు, రేపు పలుచోట్ల వర్షాలు పడే అవకాశం
గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
నేటి నుంచి 4 రోజులపాటు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
-
Jun 02, 2026 06:35 IST
ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి: ట్రంప్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడా: ట్రంప్
ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి రప్పిస్తుంది: ట్రంప్
హెజ్‌బొల్లా కూడా కాల్పుల విరమణకు అంగీకరించింది: ట్రంప్
-
Jun 02, 2026 06:34 IST
నేడు ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు
వేడుకల్లో పాల్గొననున్న BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
వేడుకలకు హాజరుకానున్న కిషన్ రెడ్డి, రాంచందర్‌రావు
-
Jun 02, 2026 06:29 IST
నేడు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
పరేడ్ గ్రౌండ్స్‌లో పతాకావిష్కరణ చేయనున్న సీఎం రేవంత్
ఎండల దృష్ట్యా గంటన్నరలోపే వేడుకలు ముగించాలని అధికారులకు సీఎం ఆదేశాలు
అసెంబ్లీలో స్పీకర్, మండలిలో చైర్మన్ జెండావిష్కరణ
తెలంగాణభవన్‌లో జెండా ఆవిష్కరించనున్న కేటీఆర్
BJP కార్యాలయంలో జెండావిష్కరించనున్న బూర నర్సయ్య గౌడ్
గాంధీభవన్‌లో జెండా ఎగురవేయనున్న మహేశ్ గౌడ్