జనసేన హౌస్‌మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:41 PM
జనసేన హౌస్‌మోషన్ పిటిషన్ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించింది.
హైదరాబాద్, జూన్ 2: జనసేన హౌస్‌మోషన్ పిటిషన్ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ఇప్పటికిప్పుడు పిటిషన్‌ను విచారణ చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘వెకేషన్ బెంచ్‌లో మీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు’ అని చీఫ్ జస్టిస్ బెంచ్ పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు(మంగళవారం) గచ్చిబౌలిలో 'తెలంగాణ నవ నిర్మాణ సభ' పేరుతో జనసేనాని పవన్ కల్యాణ్ ఓ సభ పెట్టాలని నిర్ణయించారు. జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ విషయంపై జనసేన పార్టీ.. హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే జనసేన పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది.
పవన్ పోస్ట్...
జనసేన సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జూబ్లీహిల్స్ మాదాపూర్‌లోని తన నివాసంలో పవన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా ఎక్స్‌లో జనసేనాని చేసిన పోస్ట్.. సంచలనంగా మారింది. ‘ఈరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని నా ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహిస్తాను. మా నాయకులతో కలిసి నిర్వహించే ఈ ప్రెస్‌మీట్‌కు తెలంగాణ పోలీసు శాఖ అనుమతి ఇస్తుందా.. చూద్దాం’ అంటూ పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
హైదరాబాద్‌లో నేడు పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్.. ఆసక్తికర పోస్ట్
Read Latest Telangana News And Telugu News