వడ్డీ పేరుతో భారీ మోసం.. వ్యాపారి ఇంటి ముందు రైతుల ధర్నా
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:07 PM
అధిక వడ్డీ పేరుతో రైతులను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. కోదాడ పట్టణం శ్రీరంగాపురం గ్రామంలో 60 మంది రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగిల్ల జితేంద్ర రెడ్డి కుచ్చుటోపి పెట్టాడు.
సూర్యాపేట, జూన్ 2: అధిక వడ్డీ పేరుతో రైతులను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. కోదాడ పట్టణం శ్రీరంగాపురం గ్రామంలో 60 మంది రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగిల్ల జితేంద్ర రెడ్డి కుచ్చుటోపి పెట్టాడు. అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి రైతుల నుంచి రూ.11 కోట్లు వడ్డీకి తీసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. అధిక వడ్డీ ఇచ్చి సకాలంలో డబ్బులు తిరిగి చెల్లిస్తానని సదరు వ్యాపారి హామీ ఇచ్చాడు. చాలా కాలంగా వడ్డీ కూడా చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు.
చివరకు ఏడాది వరకు డబ్బు ఇవ్వలేనని కోర్టు నుంచి రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారి నోటీసులు పంపించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నదాతలు.. వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వ్యాపారి ఇంటి ముందు రైతులు టెంట్ వేసి ధర్నా చేపట్టారు. అప్పు చెల్లించే వరకు ధర్నాను విరమించేది లేదని బాధిత రైతులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో నేడు పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్.. ఆసక్తికర పోస్ట్
అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News