-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 6th July 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 06 , 2026 | 06:42 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 06, 2026 21:39 IST
నెల్లూరు: వెంకటగిరి కాశీతోట శివారులో విషాదం
కుటుంబ కలహాలతో నిప్పంటించుకుని తల్లి శ్రావణి(35), కుమారుడు చంద్రమౌళి(9) ఆత్మహత్య
-
Jul 06, 2026 21:39 IST
జోసెఫ్ రావణ్ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్
10 రోజుల కస్టడీ కోరుతూ గన్నవరం కోర్టులో పిటిషన్
ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో ఉన్న జోసెఫ్ రావణ్
-
Jul 06, 2026 21:02 IST
పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష
డ్రగ్స్ నిర్మూలన, శాంతిభద్రతల అంశాలపై రివ్యూ
-
Jul 06, 2026 20:54 IST
మణిపూర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య
ఉఖ్రుల్ దగ్గర జవాన్ల కాన్వాయ్‌పై దాడి
ఇద్దరు జవాన్లు మృతి, పలువురికి గాయాలు
ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న బలగాలు
-
Jul 06, 2026 20:54 IST
హైదరాబాద్: జిల్లాల కలెక్టర్లతో CEO వీడియో కాన్ఫరెన్స్
ఎల్లుండిలోపు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి: CEO
ఓటర్లకు 100% ఎన్యుమరేషన్ ఫారాలు చేరేలా చర్యలు: CEO
పూర్తయిన ఫారాల డిజిటలైజేషన్ వెంటనే ప్రారంభించాలి: CEO
ఒకే కుటుంబం ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు
BLOలు, సూపర్‌వైజర్లకు మరోసారి శిక్షణ ఇవ్వాలి: CEO
-
Jul 06, 2026 20:01 IST
కాకినాడ: చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో ట్విస్ట్
సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన కారుపై తల్లిదండ్రుల అనుమానం
జాహ్నవి అదృశ్యమైన రోజు గ్రామంలో తిరిగిన కారు
ఇటీవల నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతను ఢీకొన్న అదే కారు
కారుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న జాహ్నవి బంధువులు
సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి
-
Jul 06, 2026 20:00 IST
హైదరాబాద్: డీఎస్పీ భీమ్‌రెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు
ఇటీవల భీమ్‌రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు
సోదాల్లో 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, 23 విదేశీ మద్యం బాటిళ్లు సీజ్ చేసిన ఏసీబీ
-
Jul 06, 2026 19:39 IST
అయోధ్య రామమందిర్ ట్రస్ట్ కీలక నిర్ణయాలు
తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియామకం
చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలకు ట్రస్ట్ ఆమోదం
ఈ నెల 22న మరోసారి ట్రస్ట్ సమావేశం
సిట్ నివేదికను పరిశీలించనున్న ట్రస్ట్
నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్
రామమందిరంపై అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ట్రస్ట్ విజ్ఞప్తి
చంపత్ రాయ్ సేవలను అభినందించిన ట్రస్ట్
-
Jul 06, 2026 19:39 IST
హమాస్ కీలక నిర్ణయం
గాజా స్ట్రిప్‌లో తన పరిపాలనకు ముగింపు పలికినట్టు ప్రకటన
పగ్గాలను తటస్థ పాలస్తీనా వారికి అప్పగ్గించేందుకు సంసిద్ధత
శాంతి స్థాపన ప్రణాళికకు ఇజ్రాయెల్ కడ్డుబడి ఉండాలని డిమాండ్
-
Jul 06, 2026 19:27 IST
జగన్‌కు బీసీలు ప్రతిపక్షంలోనే గుర్తొస్తారా?: ఎంపీ చింతకాయల విజయ్
బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు: ఎంపీ చింతకాయల విజయ్
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించారు: ఎంపీ చింతకాయల విజయ్
టీడీపీకి మద్దతు ఇచ్చిన బీసీలను వేధించారు: ఎంపీ చింతకాయల విజయ్
టీడీపీ డీఎన్‌ఏలోనే బీసీలు ఉన్నారు: ఎంపీ చింతకాయల విజయ్
-
Jul 06, 2026 19:23 IST
రాజమండ్రిలో డ్వాక్రా మహిళలకు షాక్
డ్వాక్రా సభ్యులను మోసం చేసిన యానిమేటర్ శ్రీలక్ష్మి
రూ.15 లక్షల రుణంలో సభ్యుల నుంచి రూ.30 వేల చొప్పున కాజేసినట్లు ఆరోపణ
బ్యాంకు అధికారులను నిలదీసిన డ్వాక్రా మహిళలు
-
Jul 06, 2026 19:21 IST
ఢిల్లీ: వాట్సాప్‌లో యూజర్ నేమ్ ఫీచర్‌పై వివరణకు గడువు పెంపు
మరో మూడు రోజులపాటు గడువు పొడిగించిన కేంద్రం
సంప్రదింపులు పూర్తయ్యేవరకు భారత్‌లో యూజర్ నేమ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకురాం: మెటా
-
Jul 06, 2026 18:11 IST
ఇండోనేసియా చేరుకున్న ప్రధాని మోదీ
మోదీ విమానానికి ఫైటర్ జెట్‌తో ప్రత్యేక ఎస్కార్ట్
ఇండోనేసియా నుంచి ఘన స్వాగతం
మూడు దేశాల పర్యటనకు ఈ ఉదయం బయల్దేరిన ప్రధాని
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ పర్యటించనున్న ప్రధాని మోదీ
-
Jul 06, 2026 18:05 IST
ఈస్ట్ జెరూసలేంలో ఇజ్రాయెల్ పోలీసు చర్య వివాదాస్పదం
పాలస్తీనీయుల కారులో స్టన్ గ్రెనేడ్ విసిరిన పోలీసు అధికారి
కారులో ప్రయాణికులు ఉండగానే తలుపు మూసిన అధికారి
సీసీకెమెరాలో రికార్డైన ఘటన దృశ్యాలు
అధికారిని సస్పెండ్ చేసిన ఇజ్రాయెల్ పోలీసులు
-
Jul 06, 2026 17:55 IST
ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ కీలక చర్య
హఫీజ్ సయీద్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ
లష్కరే తోయిబా, టీఆర్‌ఎఫ్‌పై కూడా అభియోగాలు
2025 ఏప్రిల్ 22 పహల్గామ్ దాడిలో 26 మంది పౌరుల మృతి
ఉగ్రదాడి కుట్రపై దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్‌ఐఏ
-
Jul 06, 2026 17:31 IST
అమరావతి: సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు
అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు పరామర్శ
సాయికృష్ణ కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేసిన వైసీపీ నేతలు
న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైసీపీ నేతల హామీ
-
Jul 06, 2026 17:25 IST
ఢిల్లీ: ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ కీలక హెచ్చరిక
ప్రశ్నోత్తరాల సమాధానాలను ముందుగా వెల్లడించొద్దని స్పష్టీకరణ
మంత్రులు సభలో చెప్పే వరకు సమాధానాలు గోప్యంగా ఉంచాలని ఆదేశం
మీడియా, సోషల్ మీడియాలో ముందస్తు ప్రచారంపై ఆంక్షలు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు మార్గదర్శకాలు జారీ
-
Jul 06, 2026 17:21 IST
విజయవాడ దుర్గగుడిలో హుండీల లెక్కింపు పూర్తి
ఈఓ శీనూ నాయక్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు
16 రోజుల హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు(నగదు)
హుండీల్లో 568 గ్రాముల బంగారం, 3.33 కిలోల వెండి
వివిధ దేశాల కరెన్సీ కూడా లభ్యం
-
Jul 06, 2026 17:17 IST
గుంటూరు: ప్రత్తిపాడు నియోజకవర్గంలో ‘మీ మార్ట్’లు ప్రారంభం
ప్రత్తిపాడు నియోజకవర్గంలో 7 విలేజ్ మార్ట్‌లు ప్రారంభించాం: మంత్రి నాదెండ్ల మనోహర్
విడతల వారీగా 1,000 మినీ మార్ట్‌లను ఏర్పాటు చేస్తాం: నాదెండ్ల
ప్రస్తుతానికి 60 రకాల సరుకులతో మీ మార్ట్‌లు ప్రారంభం: నాదెండ్ల
రాబోయే రోజుల్లో 250 రకాల వస్తువులు అందుబాటులోకి తేస్తాం: నాదెండ్ల
-
Jul 06, 2026 17:09 IST
జగన్, వైసీపీ నేతలపై హిందూ సంఘాల ప్రతినిధుల ఆగ్రహం
హిందువులను, దేవతలను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోం: హిందూ సంఘాల ప్రతినిధులు
ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా అధికారంలోకి రావాలని కుట్ర: హిందూ సంఘాల ప్రతినిధుల
ప్రజాస్వామ్యబద్ధంగా హక్కులు సాధించుకోవచ్చు: హిందూ సంఘాల ప్రతినిధుల
హిందువులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదు: హిందూ సంఘాల ప్రతినిధుల
-
Jul 06, 2026 17:07 IST
పోలవరం: చింతూరు ఏజెన్సీలో డోలీ మోత కష్టాలు
పాముకాటుకు గురైన మహిళను డోలీలో తరలింపు
నాలుగు కొండలు దాటి కూటూరు PHCకి తరలింపు
అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజనుల అవస్థలు
ఆస్పత్రిలోవైద్యులు లేక స్టాఫ్ నర్సుతోనే చికిత్స
-
Jul 06, 2026 16:32 IST
హైదరాబాద్: Ai టెక్నాలజీతో మెరుగైన సేవలు: డీజీపీ సీవీ ఆనంద్
గంజాయి రవాణా అరికట్టేందుకు కార్యాచరణ: డీజీపీ
మావోయిస్టులు పూర్తిగా లేకుండా చేశాం: సీవీ ఆనంద్
డ్రగ్స్ నియంత్రణపై ప్రధాన దృష్టి: డీజీపీ సీవీ ఆనంద్
-
Jul 06, 2026 16:30 IST
హైదరాబాద్: సీఎం రేవంత్‌కు టీబీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి లేఖ
తెలంగాణలో 20 వేల పోలీస్ ఉద్యోగ ఖాళీలు ఉండగా 7,437 పోస్టులకే నోటిఫికేషన్ విడుదల అన్యాయం: ఏలేటి
నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచి ఖాళీలు భర్తీచేయాలి: ఏలేటి
ఉద్యోగాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: ఏలేటి
-
Jul 06, 2026 16:29 IST
ముంబై: పైరసీని ప్రోత్సహించొద్దని ప్రేక్షకులకు జీ5 విజ్ఞప్తి
ఓటీటీలోకి వచ్చిన రెండు రోజులకే ‘సత్లుజ్’ స్ట్రీమింగ్ నిలిపివేత
స్ట్రీమింగ్ ఆగిన తర్వాత ఆన్‌లైన్‌లో సినిమా లీక్
సినిమాను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం: జీ5
-
Jul 06, 2026 16:28 IST
బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి
సముద్రంలో మునిగి నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస్ మృతి
దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో ఘటన
ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన కోస్ట్ గార్డు సిబ్బంది
2019 నుంచి బహ్రెయిన్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్
మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
-
Jul 06, 2026 16:26 IST
లఖ్‌నవూ: అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ రాజీనామాకు ఆమోదం
కేసులో చంపత్‌రాయ్ డ్రైవర్ అరెస్ట్
నైతిక బాధ్యత వహిస్తూ ఇటీవలే చంపత్‌రాయ్ రాజీనామా
చంపత్‌రాయ్ రాజీనామాను ఆమోదించిన ట్రస్ట్
-
Jul 06, 2026 16:24 IST
అండర్-19 మ్యాచ్‌లో మెరిసిన రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్
శ్రీలంకపై 67 బంతుల్లో 87 పరుగులు చేసిన అన్వయ్
9 ఫోర్లు, ఒక సిక్స్‌తో దుమ్మురేపిన అన్వయ్
అర్జున్ రాజ్‌పుత్‌తో 145 పరుగుల కీలక భాగస్వామ్యం
భారత్ జట్టు 285 పరుగులకు ఆలౌట్
-
Jul 06, 2026 16:19 IST
మహారాష్ట్ర: భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు
పుణె జిల్లాలో ఘటన.. ముగ్గురు కుటుంబ సభ్యుల మృతి
కొండచరియల కింద పూడుకుపోయిన ఐదు ఇళ్లు
30-35 మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు అధికారుల వెల్లడి
కొనసాగుతున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలు
ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే, పాత హైవేపై రాకపోకలకు అంతరాయం
-
Jul 06, 2026 16:10 IST
హైదరాబాద్: కాళేశ్వరం అవినీతిలో దోషులు జైలుకెళ్లక తప్పదు: ఆది శ్రీనివాస్
కాళేశ్వరం తప్పులకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు క్షమాపణ చెప్పాలి: ఆది శ్రీనివాస్
వారం రోజుల్లో కాళేశ్వరం బాగుచేస్తామంటున్నారు: ఆది శ్రీనివాస్
కాళేశ్వరం కూలిపోయాక వారం రోజుల్లో ఎందుకు బాగుచేయలేదు?: ఆది శ్రీనివాస్
ప్రాజెక్టుల నిర్వహణ మా ప్రభుత్వానికి తెలుసు: ఆది శ్రీనివాస్
-
Jul 06, 2026 16:08 IST
హైదరాబాద్: బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు
బెయిల్ మంజూరు చేయొద్దని బాధితురాలి తరఫున వాదనలు
ముగిసిన ఇరుపక్షాల వాదనలు, తీర్పు రిజర్వ్
బండి భగీరథ్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ దాఖలు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు
-
Jul 06, 2026 16:07 IST
సిద్దిపేట: చేర్యాల ఎమ్మార్వో ఆఫీస్‌లో ఏసీబీ తనిఖీలు
రైతు నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తహసీల్దార్ దిలీప్ నాయక్
భూ సమస్య పరిష్కారం కోసం లంచం డిమాండ్
-
Jul 06, 2026 16:06 IST
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో గాలి దుమారం
ఈదురుగాలులకు అసెంబ్లీ ఆవరణలో కూలిన చెట్టు
MLA ప్రవేశ మార్గంలో కూలిన చెట్టు, అప్రమత్తమైన సెక్యూరిటీ
చెట్టు కూలినప్పుడు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
-
Jul 06, 2026 16:05 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
521 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
159 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Jul 06, 2026 16:05 IST
అయోధ్య రామాలయ ట్రస్ట్ అత్యవసర సమావేశం
ట్రస్ట్ అధ్యక్షుడు నృత్యగోపాల్ దాస్ అధ్యక్షతన భేటీ
5 అంశాలు ఎజెండాగా ట్రస్ట్ కీలక సమావేశం
ట్రస్ట్ సభ్యుల రాజీనామాలు, సిట్ నివేదిక, ఆలయ నిర్వహణకు CEO నియామకం
ఆర్థిక నివేదికల ఆమోదం, ఆలయ నిర్వహణపై చర్చ
-
Jul 06, 2026 16:04 IST
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింతకు లైన్‌క్లియర్
యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో నీరవ్‌కు దక్కని ఊరట
నీరవ్ మోదీ చివరి అప్పీల్‌ను తిరస్కరించిన కోర్టు
జైళ్లలో భద్రత, వసతులపై భారత్ ఇచ్చిన హామీలు సంతృప్తికరంగా ఉన్నాయన్న యూకే కోర్టు
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో 2019 మార్చి నుంచి లండన్ జైలులో ఉన్న నీరవ్ మోదీ
-
Jul 06, 2026 16:02 IST
జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్
ఆకస్మిక వరదలతో జనజీవనం అస్తవ్యస్థం
పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు
-
Jul 06, 2026 16:02 IST
ఢిల్లీ: తాజ్ మహల్ వివాదంపై అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు
కేంద్రం, ఏఎస్‌ఐకి హైకోర్టు నోటీసులు
‘తేజో మహాలయ’ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
-
Jul 06, 2026 15:47 IST
హైదరాబాద్: రక్షణ రంగంలో మరో విజయం సాధించిన స్టార్టప్ ద్విపా డిఫెన్స్
ఆర్మీ, కేంద్ర మంత్రిత్వ శాఖ ట్రయల్స్‌లో విజయవంతమైన ఉగ్రామ్ 7.62 బ్యాటిల్ రైఫిల్
DRDO–ARDE సహకారంతో 100 రోజుల్లో అభివృద్ధి చేసిన ఉగ్రామ్ రైఫిల్
భారత్ స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యానికి మరో కీలక ముందడుగుగా ఉగ్రామ్ రైఫిల్ విజయం

-
Jul 06, 2026 15:35 IST
కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
కాళేశ్వరం పేరుతో కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు: మంత్రి సీతక్క
కేటీఆర్‌కు అధికార దాహమే తప్ప ప్రజలపై ప్రేమ లేదు: మంత్రి సీతక్క
పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు: మంత్రి సీతక్క
కాళేశ్వరం కట్టింది.. కూలిపోయింది మీ హయాంలోనే..: మంత్రి సీతక్క
-
Jul 06, 2026 15:25 IST
శ్రీలంక జైలులో ఘర్షణ.. 23 మంది మృతి
మృతుల్లో నలుగురు జైలు గార్డులు
100 మందికిపైగా ఖైదీలు, జైలు సిబ్బందికి గాయాలు
రెండు డ్రగ్ గ్యాంగ్‌ల మధ్య ఘర్షణతో చెలరేగిన హింస
జైలు పైకప్పుపైకి ఎక్కి నిరసన తెలిపిన మహిళా ఖైదీలు
-
Jul 06, 2026 15:17 IST
చరిత్ర సృష్టించిన శ్రీలంక ప్లేయర్
మేజర్ క్రికెట్ లీగ్ 2026లో అరుదైన ఘటన
4 బంతుల్లో 4 వికెట్లు తీసిన డాసున్ శనక
-
Jul 06, 2026 14:55 IST
మార్కాపురం: సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
సుందరయ్య కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్
కాలనీలో పాఠశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు, స్థానికుల విజ్ఞప్తి
సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన సీపీఎం నాయకులు, కాలనీ వాసులు
-
Jul 06, 2026 14:47 IST
పురపాలక, పంచాయతీరాజ్, హోం శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
సమీక్షలో పాల్గొన్న సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు
-
Jul 06, 2026 14:46 IST
కొరియా: స్టార్టప్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్
ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి లోకేశ్
'వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్' లక్ష్యం: మంత్రి లోకేశ్
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లోకి కొరియన్ స్టార్టప్‌లకు ఆహ్వానం
భారత్‌కు Ai రాజధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్
అమరావతిలో దేశ తొలి క్వాంటం Ai వర్సిటీ ఏర్పాటు: మంత్రి లోకేశ్
2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్‌మిషన్ రోడ్‌మ్యాప్‌తో ఏపీ: మంత్రి లోకేశ్
160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం: మంత్రి లోకేశ్
-
Jul 06, 2026 13:55 IST
విజయవాడ: RTC జేఏసీతో అధికారుల సమావేశం
హాజరైన స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఎండీ బాలసుబ్రహ్మణ్యం
ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల నిర్ణయాన్ని విరమించాలి: APSRTC జేఏసీ
-
Jul 06, 2026 13:39 IST
ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్
రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో A-2 రాజ్ కసిరెడ్డి పిటిషన్
ఈనెల 13కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్ కస్టడీ పిటిషన్ వేసిన ఈడీ
వారం రోజులు కస్టడీ కోరిన ఈడీ.. తదుపరి విచారణ రేపటికి వాయిదా
-
Jul 06, 2026 13:32 IST
నేడు మ.3 గంటలకు అయోధ్య రామాలయ ట్రస్ట్ అత్యవసర భేటీ
అయోధ్యలో హై అలర్ట్, అదనపు బలగాల మోహరింపు
విరాళాల దొంగతనం ఆరోపణలపై కీలక చర్చ
భద్రతా కారణాలతో 'మణి రామ్‌దాస్ ఛావాని' నుంచి ఆలయ సముదాయానికి మార్చిన అధికారులు
ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలపై ఉత్కంఠ
-
Jul 06, 2026 13:25 IST
అమరావతి: ఏపీ ప్రజా ఉపాధిలో కీలకమైన స్థానిక కేడర్ల ఏర్పాటు
ప్రత్యక్ష నియామకాల నియంత్రణపై ఉత్తర్వులు
జిల్లా, జోన్, బహుళ-జోన్‌ల స్థానిక కేడర్ల మధ్య కేడర్ బలాన్ని నిర్ధారించడం, పంపిణీ అమలు మార్గదర్శకాల ఉత్తర్వులు
-
Jul 06, 2026 13:21 IST
కర్నూలు: రాయలసీమ ప్రాజెక్ట్‌లను నాశనం చేసిన ద్రోహి జగన్: MLA జయనాగేశ్వర రెడ్డి
వైసీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా సర్వనాశనం చేసిన ఘనుడు జగన్: MLA
అన్నమయ్య జిల్లా, తుంగభద్ర ప్రాజెక్ట్‌లలో గేట్లు కొట్టుకుపోతే పట్టించుకోకుండా జగన్ నిర్లక్ష్యం చేశారు: MLA
సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ మోసం చేశారు: నాగేశ్వరరెడ్డి
-
Jul 06, 2026 13:07 IST
ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడిచే ప్రమాణం చేయించిన CJ జస్టిస్ లిసా గిల్
-
Jul 06, 2026 13:04 IST
హైదరాబాద్: సోమాజిగూడ బ్లిస్ అపార్ట్‌మెంట్లను పరిశీలించాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఇరిగేషన్ NOC లేకుండా నిర్మాణం చేస్తున్నట్లు గుర్తించాం: రంగనాథ్
హుస్సేన్ సాగర్ FTLలో నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదు వచ్చింది: రంగనాథ్
అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలిస్తున్నాం: హైడ్రా కమిషనర్
2018లో పర్మిషన్ తీసుకున్నామని చెబుతున్నారు: కమిషనర్ రంగనాథ్
అనుమతులను పరిశీలించి చర్యలు తీసుకుంటాం: రంగనాథ్
-
Jul 06, 2026 13:03 IST
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్‌లోని శ్రీ గణేశ్ జ్యువెలరీ షాప్‌లో చోరీకి యత్నం
షాప్ గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించేందుకు దుండగుల యత్నం
అలారం మోగడంతో పరారైన దుండగులు
షాపులోని సీసీటీవీ కెమెరాల హార్డ్ డిస్క్‌లు ఎత్తుకెళ్లిన దుండగులు
సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు
-
Jul 06, 2026 13:01 IST
దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
ప్రపంచ శ్రేయస్సు పట్ల దలైలామా నిబద్ధత ప్రశంసనీయం: మోదీ
దలైలామా శాంతి సందేశం ప్రపంచ ప్రజలకు మార్గదర్శకం: మోదీ
-
Jul 06, 2026 12:55 IST
హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు విచారణ
వర్చువల్‌గా హాజరయ్యేందుకు అల్లు అర్జున్‌కు కోర్టు అనుమతి
కోర్టుకు హాజరుకాని మరికొంత మంది నిందితులు
తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
-
Jul 06, 2026 12:46 IST
ఇంగ్లండ్‌తో మూడో టీ20: రవి బిష్ణోయ్‌పై వేటు?
రెండో టీ20లో 4 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 60 పరుగులు సమర్మించుకున్న బిష్ణోయ్
బిష్ణోయ్ వల్లే గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోయిందంటూ విమర్శలు
బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ లేదా గుర్నూర్ బ్రార్‌కు అవకాశం
-
Jul 06, 2026 12:43 IST
హనుమకొండ: బీఆర్ఎస్ నేతలే భూ కబ్జాదారులు: MLA నాయిని
రూ.కోట్ల విలువైన స్థలాన్ని BRS కార్యాలయం పేరుతో కబ్జా చేశారు: MLA నాయిని
కాళేశ్వరం కట్టింది వాళ్లే.. కూలగొట్టింది వాళ్లే: MLA నాయిని
కల్వకుంట్ల కుటుంబం వరంగల్‌ను విధ్వంసం చేసింది: నాయిని
వరంగల్ అభివృద్ధిపై కేటీఆర్, కిషన్‌రెడ్డితో చర్చకు సిద్ధం: MLA నాయిని
-
Jul 06, 2026 12:40 IST
విక్రమ్-1తో అంతరిక్షంలో ముగ్గురు భారత దిగ్గజాలు
సీవీ.రామన్, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలామ్‌కు అంతరిక్షంలో నివాళి
విక్రమ్ రాకెట్‌లో సూక్ష్మ బంగారు ప్రతిరూపాలు
స్కైరూట్ ఎక్స్‌లో ఆసక్తికర ప్రకటన
తొలి కక్ష్య ప్రయోగానికి స్కైరూట్ సిద్ధం
-
Jul 06, 2026 12:38 IST
కృష్ణా జిల్లా: ఎస్పీ ఆఫీస్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పొలం వివాదంలో న్యాయం జరగడం లేదంటూ పురుగుల మందు తాగి చిక్కాల సురేశ్ బాబు ఆత్మహత్యాయత్నం
నాగాయలంక మం. పర్ర చివర గ్రామానికి చెందిన సురేశ్ బాబు
-
Jul 06, 2026 12:22 IST
అనంతపురం: నా రక్తంలోనే కాషాయం ఉంది: మంత్రి సత్యకుమార్
పేర్ని నాని అవకాశం కోసం పార్టీలు మారతారు: సత్యకుమార్
ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోను: సత్యకుమార్
రాజధాని అమరావతిపై జగన్‌కు అవగాహన లేదు: సత్యకుమార్
జగన్.. నిలకడ లేని మనిషి: మంత్రి సత్యకుమార్
ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నాం: సత్యకుమార్
-
Jul 06, 2026 12:11 IST
ఏపీలో ఆరుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ
మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా నవ్ జ్యోతి మిశ్రా
తూర్పుగోదావరి (రాజమండ్రి)అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్ దేవ్‌రాజ్ మనీష్
పోలవరం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా మండా జావలి అల్ఫోన్స్
అమరావతి ఓఎస్డీ లా అండ్ ఆర్డర్‌గా మనోజ్ రామనాధ్ హెగ్డే
పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి
నంద్యాల ఎఎస్పీగా సుస్మిత
-
Jul 06, 2026 12:03 IST
జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో మేఘ విస్పోటనం
బురద కింద చిక్కుకుపోయిన పలు వాహనాలు
-
Jul 06, 2026 11:58 IST
విజయవాడ: సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ
విజయవాడలో మళ్లీ కాల్‌మనీ మాఫియా రెచ్చిపోతోందని లేఖలో స్పష్టం
రూ.8 కోట్లకు రూ.21 కోట్లు చెల్లించినా వదలడం లేదని, దీనిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి
-
Jul 06, 2026 11:46 IST
పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
బెంగాల్ నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు
ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బారైక్ రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలు
జులై 24 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
-
Jul 06, 2026 11:35 IST
ఈ నెల 9న ఖమ్మంకు సీఎం రేవంత్‌రెడ్డి
రైతు ఆశీర్వాద సభకు హాజరుకానున్న సీఎం రేవంత్
-
Jul 06, 2026 11:20 IST
సుప్రీంకోర్టులో కరూర్ తొక్కిసలాట కేసు విచారణ
కేసును అత్యవసరంగా విచారించాలని సుప్రీంలో పిటిషన్
కేసును రేపు విచారించడానికి అంగీకరించిన సుప్రీం ధర్మాసనం
-
Jul 06, 2026 11:11 IST
పాకిస్థాన్ ప్రభుత్వానికి POK నేతల అల్టిమేటం
డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 9న తుది దశ ఉద్యమం చేపడతామంటూ హెచ్చరిక
-
Jul 06, 2026 11:09 IST
అమరావతి: ఏపీ సచివాలయంలో SIRపై అవగాహన కార్యక్రమం
సచివాలయ ఉద్యోగులకు SIR ప్రక్రియపై అవగాహన
కొత్త ఓటర్ల నమోదు, ఆన్‌లైన్ అప్లికేషన్, చిరునామా మార్పులపై అవగాహన
SIR క్యాంప్‌ను ప్రారంభించిన ఏపీ సీఈసీ వివేక్ యాదవ్
-
Jul 06, 2026 11:03 IST
అమరావతి: గల్లంతైన మత్స్యకారుల గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు మంత్రి అచ్చెన్న ఆదేశం
మత్స్యకారులు క్షేమంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచన
రెండో రోజూ ప్రత్యేక నౌక, రెస్క్యూ బోటు, హెలికాప్టర్‌తో కొనసాగుతున్న నేవీ, కోస్ట్‌గార్డ్ సంయుక్త గాలింపు
-
Jul 06, 2026 10:51 IST
దలైలామాకు 'X' వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
శాంతి, కరుణ, మానవత్వానికి ప్రతీక దలైలామా: చంద్రబాబు
దశాబ్దాలుగా ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా: సీఎం
-
Jul 06, 2026 10:45 IST
ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు
మూతపడిన పాఠశాలలు, డబ్బావాలా సేవల నిలిపివేత
ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా
భారీ వర్షాలతో విమాన సేవలకు అంతరాయం
చెరువులను తలపిస్తున్న రోడ్లు, జలమయమైన రైల్వేస్టేషన్లు
విరార్-వసాయి ప్రాంతంలో నీటమునిగిన ఇళ్లు
వెస్ట్రన్ రైల్వేలో ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు
ముంబై మాంఖుర్డ్ ప్రాంతంలో ఇల్లు కూలి ఆరుగురి మృతి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం ఫడణవీస్
-
Jul 06, 2026 10:31 IST
విశాఖ: గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఇప్పటివరకు లభించని ఆరుగురి జాడ
నేవీ, కోస్ట్‌గార్డ్, మత్స్యకార బోట్లతో కొనసాగుతున్న గాలింపు చర్యలు
-
Jul 06, 2026 10:24 IST
రాజకీయం వేరు, భక్తి వేరు: మంత్రి పొన్నం ప్రభాకర్
విరాళాల స్వాహా దేశ ప్రజలకు అవమానం: మంత్రి పొన్నం
దేవుడి పేరుపై బీజేపీ స్కాం చేసింది: మంత్రి పొన్నం
-
Jul 06, 2026 10:21 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
10 గ్రాముల 24, 22 క్యారెట్ల బంగారంపై రూ.110 పతనం
18 క్యారెట్ల బంగారంపై 80 రూపాయలు తగ్గుదల
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,46,620
-
Jul 06, 2026 10:15 IST
అమరావతి: దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రముఖ కంపెనీలతో చర్చలు
షూఆల్స్ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్‌తో లోకేశ్ సమావేశం
ఏపీలో షూఆల్స్ పాదరక్షల యూనిట్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి
-
Jul 06, 2026 10:14 IST
కామారెడ్డి: బీర్కూర్‌లోని కాలేజీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
నిన్న భోజనం తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు
విద్యార్థులను బాన్సువాడ ఆస్పత్రికి తరలింపు
20 మంది విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స
-
Jul 06, 2026 10:11 IST
మహారాష్ట్రలో ఎట్టకేలకూ చిక్కిన పులి
చోర్‌గావ్ దగ్గర పులిని బంధించిన అటవీ సిబ్బంది
ఇటీవల సంజయ్ అనే యువకుడిని చంపిన పులి
-
Jul 06, 2026 10:09 IST
మంచిర్యాల: కేటీఆర్‌పై మంత్రి వివేక్ ఫైర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్‌కు అవగాహన లేదు: మంత్రి వివేక్
కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు: మంత్రి వివేక్
రూ.లక్ష కోట్ల ప్రజా ధనం వృథా: మంత్రి వివేక్
రూ.వందల కోట్ల విద్యుత్ బిల్లుల భారం: మంత్రి వివేక్
ప్రాణహిత నిర్మిస్తే తక్కువ ఖర్చుతో ప్రయోజనం: మంత్రి వివేక్
-
Jul 06, 2026 10:07 IST
వింబుల్డన్: ఫెదరర్ రికార్డును బ్రేక్ చేసిన జకోవిచ్
రష్యా ప్లేయర్ రోమన్ సఫయిల్లీన్‌పై జకోవిచ్ విజయం
ఈ విజయంతో వింబుల్డన్‌లో 106 మ్యాచ్‌ల్లో గెలుపొందిన జకోవిచ్
టోర్నీలో అత్యధిక మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్‌గా రికార్డు
-
Jul 06, 2026 10:01 IST
లాభాల్లో దేశీయ సూచీలు
375పాయింట్ల లాభంతో సెన్సెక్స్
119 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.26.
-
Jul 06, 2026 09:09 IST
సినిమా ప్రొడ్యూసర్ వెంకట్ అనీశ్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
మరో ప్రొడ్యూసర్ రజిత్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు
కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని తనను మోసం చేసినట్టు రజిత్ రావు ఫిర్యాదు
-
Jul 06, 2026 09:01 IST
అనకాపల్లి: రేవు పోలవరం దగ్గర బోటు బోల్తా
బంగారమ్మపాలెం తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహం
మృతుడు మత్య్సకారుడు సింహాద్రి
సురక్షితంగా ఒడ్డుకు చేరిన ముగ్గురు మత్స్యకారులు
-
Jul 06, 2026 08:55 IST
హైదరాబాద్: ఘట్‌కేసర్‌లో సభ్య సమాజాన్ని కలిచివేసిన ఘటన
కన్నతల్లిపై లైంగిక దాడికి పాల్పడిన కుమారుడు
మద్యం మత్తులో నిద్రిస్తున్న తల్లిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడు
బాధితురాలి నోట్లో గుడ్డ కుక్కి అత్యాచారానికి పాల్పడిన కీచకుడు
తప్పించుకునే ప్రయత్నం చేయగా కరెంట్ వైర్లు మెడకు చుట్టి మరోసారి లైంగిక దాడి
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు
నిందితుడు విజయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
-
Jul 06, 2026 08:51 IST
హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ
వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని నిందితులకు ఆదేశం
వర్చువల్‌గా అటెండ్ అవ్వడానికి అనుమతి కోరుతూ అల్లు అర్జున్ పిటిషన్
అల్లు అర్జున్‌కు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతులివ్వొద్దని పీపీ అభ్యంతరం
నేడు నిర్ణయం తీసుకోనున్న నాంపల్లి కోర్టు
-
Jul 06, 2026 08:46 IST
కాకినాడ: కాజులూరు మం. అయితపూడిలో ఉద్రిక్తత
రొయ్యల చెరువుల అక్రమ తవ్వకాలపై వివాదం
ప్రొక్లైనర్‌ను అడ్డుకున్న అయితపూడి గ్రామస్థులు
చెరువులు తవ్విస్తున్న యజమాని అనుచరులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం
-
Jul 06, 2026 08:39 IST
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఫహద్‌బిన్ అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తి హత్య
రెహ్మాన్‌ను హత్యచేసిన గుర్తు తెలియని వ్యక్తి
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు
నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు
-
Jul 06, 2026 08:28 IST
నేడు గువాహటిలో బ్రిక్స్ యాంటీ డ్రగ్స్ మీట్
డ్రగ్స్ నియంత్రణ, దేశాల మధ్య సమన్వయంపై చర్చ
-
Jul 06, 2026 08:14 IST
భారీ వర్షాలతో ముంబై-పుణె మధ్య రైలు సేవల రద్దు
కర్జాత్-లోనావాలా మధ్య విరిగిపడిన కొండచరియలు
-
Jul 06, 2026 08:07 IST
నల్లగొండ: నకిరేకల్‌లో లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
మృతుడు చిలుకూరు మండలం నేరెళ్ల గ్రామ వాసి వేముల వెంకటేశం
-
Jul 06, 2026 08:03 IST
బ్రేకింగ్ న్యూస్: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం
నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారుల అంచనా
-
Jul 06, 2026 07:58 IST
వింబుల్డన్ ఓపెన్: ముగిసిన వరల్డ్ నంబర్‌వన్ సబలెంకా(బెలారస్) పోరు
ఉమెన్స్ ప్రీక్వార్టర్స్‌లో అనిసిమోవా(అమెరికా), నోస్కావా (చెక్)
మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్
-
Jul 06, 2026 07:49 IST
విజయవాడ: సింగ్‌నగర్‌లో రెచ్చిపోయిన యువకులు
పరస్పరం సవాళ్లతో కత్తితో ఓ యువకుడిపై దాడి
ఇద్దరి అరెస్ట్, మరో ముగ్గురి కోసం గాలింపు
-
Jul 06, 2026 07:43 IST
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చురకలు
భారత్ అండ తమకు ఉందని నెతన్యాహు వ్యాఖ్య
-
Jul 06, 2026 07:39 IST
తిరుపతి: 116 ఏళ్ల నవనీతమ్మకు ప్రత్యేక దర్శనం కల్పించిన టీటీడీ
బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్న వృద్ధురాలు
-
Jul 06, 2026 07:32 IST
ఒడిశా తీరంలో క్షేమంగా ఏపీ మత్స్యకారులు
మత్స్యకారులను స్వస్థలాలకు తరలించే యత్నం
ఇంజిన్ లోపంతో సముద్రంలో నిలిచిన బోటు
పరిస్థితిని వివరిస్తూ మత్స్యకారుల వీడియోపై అధికారుల అప్రమత్తం
మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారన్న మంత్రి అచ్చెన్నాయుడు
-
Jul 06, 2026 07:25 IST
నేటి నుంచి ఏపీ సచివాలయంలో ఓటర్ల ప్రత్యేక శిబిరం
సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగుల కోసం ప్రత్యేక సేవలు
SIR-2026 సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు
-
Jul 06, 2026 07:24 IST
నేడు అయోధ్య రామమందిరం ట్రస్ట్ కీలక సమావేశం
నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో భేటీ
రామ మందిరం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం
-
Jul 06, 2026 07:19 IST
ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ కార్యాలయం ఆక్టగాన్‌ను ప్రారంభించిన ఈజిప్టు
కైరోలో 22 వేల ఎకరాల్లో ఆక్టగాన్ కార్యాలయం
ఈజిప్టు సాయుధ దళాలకు కేంద్రీకృత సైనిక, రక్షణ ప్రధాన కార్యాలయంగా పనిచేయనున్న ఆక్టగాన్
-
Jul 06, 2026 07:16 IST
యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగిసేందుకు సాయం చేస్తానని ట్రంప్ ఆఫర్
యుద్ధానికి పొలిటికల్, డిప్లొమాటిక్ సొల్యూషన్ ఆశిస్తున్నామన్న పుతిన్
-
Jul 06, 2026 07:14 IST
కృష్ణా: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు 14 రోజుల రిమాండ్
ఈ నెల 18 వరకు జోసెఫ్ రావణ్‌కు రిమాండ్ విధించిన కోర్టు
నెల్లూరు జిల్లా జైలుకు జోసెఫ్ రావణ్ తరలింపు
-
Jul 06, 2026 07:10 IST
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మోర్(34) రిటైర్‌మెంట్ ప్రకటన
ఫిఫా వరల్డ్ కప్ నుంచి తమ జట్టు నిష్క్రమించడంతో నిర్ణయం
'చాలా ప్రయత్నించా.. కానీ అంతా ముగిసిపోయింది' అంటూ భావోద్వేగం
-
Jul 06, 2026 07:08 IST
ఇదే నా చివరి ఫిఫా వరల్డ్‌కప్: క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రకటన
-
Jul 06, 2026 07:08 IST
FIFA WC: బ్రెజిల్‌ను నాకౌట్ చేసిన నార్వే
రౌండ్ ఆఫ్ 16లో బ్రెజిల్‌ను 2-1 తేడాతో నాకౌట్ చేసిన నార్వే
స్టార్ ప్లేయర్ హాలండ్ 2 వరుస గోల్స్‌తో నార్వేకు తిరుగులేని విజయం
-
Jul 06, 2026 07:03 IST
హొర్మూజ్ జలసంధి దాటి భారత్‌కు ఎరువుల నౌకలు
15-20 నౌకలు సురక్షితంగా భారత్ వైపు ప్రయాణం
8 నౌకల్లో 3.32 లక్షల టన్నుల యూరియా రవాణా
త్వరలో మరో 5 నౌకలు రానున్నట్టు కేంద్రం వెల్లడి
-
Jul 06, 2026 07:02 IST
శ్రీలంక: నెగొంబో జైలులో ఖైదీల ఘర్షణ
పరస్పర దాడుల్లో ఇద్దరు ఖైదీల మృతి
మరో 34 మంది ఖైదీలకు గాయాలు
మాదకద్రవ్యాల వివాదమే ఘర్షణకు కారణం
-
Jul 06, 2026 06:57 IST
నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మోదీ టూర్
-
Jul 06, 2026 06:56 IST
హైదరాబాద్: నేడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి
బీజేపీ కార్యాలయంలో జయంత్యుత్సవాలు
నివాళులర్పించనున్న టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
-
Jul 06, 2026 06:56 IST
హైదరాబాద్: నేడు బండి భగీరథ్ బెయిల్‌పై హైకోర్టులో విచారణ
పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్
-
Jul 06, 2026 06:51 IST
హైదరాబాద్: నేడు మూసీ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
తొలి దశలో రూ.7,345 కోట్ల వ్యయంతో 21 కి.మీ. సుందరీకరించాలని ఇప్పటికే నిర్ణయం
-
Jul 06, 2026 06:48 IST
నేటి మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,720
22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,34,490
హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,59,900
-
Jul 06, 2026 06:48 IST
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం
ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం
వాయుగుండ ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, కోస్తాంధ్రకు వర్ష సూచన
-
Jul 06, 2026 06:46 IST
అమరావతి: నేడు అధికారులతో APSRTC జేఏసీ చర్చలు
పాల్గొననున్న ప్రత్యేక సీఎస్ కృష్ణబాబు, RTC ఎండీ బాలసుబ్రహ్మణ్యం
30 డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించాలని RTC జేఏసీ నిర్ణయం
-
Jul 06, 2026 06:44 IST
ముంబైలో కొనసాగుతున్న వరణుడి బీభత్సం
భారీవర్షాలకు మాన్‌ఖుర్ద్‌లో భవనం కూలి ఆరుగురి మృతి
మృతుల్లో నలుగురు మహిళలు, మరొకరికి తీవ్ర గాయాలు
కొనసాగుతున్న సహాయక చర్యలు
ముంబైలో పలు ప్రాంతాల్లో 20 సెం.మీ. వర్షపాతం నమోదు
వర్షాలతో ముంబై, ఠాణే, పాల్‌ఘర్‌లో నేడు విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాలతో ముంబైకి రెడ్ అలర్ట్