-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 25th July 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 25 , 2026 | 07:49 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 25, 2026 21:38 IST
ఏపీలో PM సూర్యఘర్ బిజ్లీ యోజనలో మరో మైలురాయి
50,114 సౌర విద్యుత్ కనెక్షన్ల పూర్తి
180 మెగావాట్ల గ్రిడ్‌కు అనుసంధానం
-
Jul 25, 2026 21:38 IST
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల దగ్గర ప్రమాదం
బైక్‌ను ఢీకొన్న కారు.. సీతారామయ్య (58)అనే వ్యక్తి మృతి
కారు నడిపిన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు
-
Jul 25, 2026 20:40 IST
నంద్యాల: డోన్‌లో మద్యం మత్తులో యువకుల వీరంగం
ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి దాడి
రాళ్లతో బైకును పగులగొట్టి, కింద పడేసి వెళ్లిన యువకులు
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న దాడి దృశ్యాలు
-
Jul 25, 2026 20:32 IST
రాజమండ్రి: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
మిషన్ శక్తిశాట్‌కు ఎంపికైన విద్యార్థిని కందుల జెస్సీ
కందుల జెస్సీకి ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలంటూ ABN ప్రసారం
ABN కథనంపై స్పందిస్తున్న పలువురు దాతలు
-
Jul 25, 2026 20:24 IST
ఢిల్లి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషికి అదనంగా కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు
-
Jul 25, 2026 20:21 IST
హైదరాబాద్: నీట్ ఉద్యమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు: సీఎం రేవంత్
చెప్పన్ ఇంచ్ ఛాతీ.. యువత ముందు తలొగ్గింది: సీఎం రేవంత్‌రెడ్డి
యువత ముఖంలో విజయదరహాసం చూస్తున్నా: రేవంత్
విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకోవాలి: రేవంత్
సోమవారంలోగా కేసులన్నీ ఉపసంహరించుకోవాలి: రేవంత్
చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
-
Jul 25, 2026 20:04 IST
రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే..
220 లక్ష్య ఛేదనలో తడబడిన జింబాబ్వే
17.5 ఓవర్లలో 129 పరుగులకు జింబాబ్వే ఆలౌట్
జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్(32) టాప్ స్కోరర్
మూడు వికెట్లతో చెలరేగిన అభిషేక్ శర్మ
యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్‌లకు చెరో 2 వికెట్లు
-
Jul 25, 2026 20:02 IST
హైదరాబాద్: విద్యార్థుల పోరాటానికి కేంద్రం దిగివచ్చింది: TPCC చీఫ్ మహేశ్ గౌడ్
కేంద్రం మెడలు వంచినందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: మహేశ్ గౌడ్
జెన్ జీ చట్ట సభలోకి వెళ్లబోతున్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
-
Jul 25, 2026 19:51 IST
హైదరాబాద్: నీట్ పేపర్ లీక్‌పై నెక్లెస్ రోడ్ నుంచి మొదలైన కాంగ్రెస్ ర్యాలీ
నెక్లెస్ రోడ్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు మొదలైన కాంగ్రెస్ ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు
ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ ర్యాలీ
-
Jul 25, 2026 19:48 IST
వరంగల్ : నీట్ పేపర్ లీక్‌పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ
పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
హనుమకొండ కాంగ్రెస్ భవన్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ
-
Jul 25, 2026 19:42 IST
గుంటూరు: అమృత్ 2.0 పైలాన్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని
గుంటూరులో శాశ్వత తాగునీటి సరఫరా లక్ష్యం: కేంద్ర మంత్రి పెమ్మసాని
రూ.577 కోట్లతో రింగ్ రోడ్డు పైప్‌లైన్ పనులు: పెమ్మసాని
వైసీపీ పాలనలో రూ.160 కోట్ల నిధులు వినియోగించలేదు: పెమ్మసాని
రోడ్లు, నీరు ఇస్తేనే ఓట్లు పడతాయి: కేంద్ర మంత్రి పెమ్మసాని
-
Jul 25, 2026 18:34 IST
భూపాలపల్లి: కాటారం మాజీ ఉపసర్పంచ్ ఆత్మహత్యాయత్నం
పురుగులమందు తాగి నాయిని శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం
గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని ఆవేదన
నాయిని శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలించిన స్థానికులు
-
Jul 25, 2026 18:24 IST
అవినీతికి ప్రతీక ధర్మేంద్ర ప్రధాన్: రాహుల్ గాంధీ
విద్యా వ్యవస్థను ధర్మేంద్ర నాశనం చేశారు: రాహుల్ గాంధీ
దేశ విద్యా వ్యవస్థను RSS ఆక్రమించింది: రాహుల్
ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి: రాహుల్
దేశ భవిష్యత్‌ను విద్యార్థులే నిర్ణయిస్తారు: రాహుల్
విద్యార్థుల డిమాండ్లలో ఒక్కటే నెరవేరింది: రాహుల్
ఇంకా 2 డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయి: రాహుల్
ఢిల్లీలో హింసకు అమిత్ షాదే బాధ్యత: రాహుల్ గాంధీ
-
Jul 25, 2026 17:54 IST
CJP ఆందోళన విరమణతో ఢిల్లీలో సాధారణ పరిస్థితులు
సెంట్రల్ ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లు
తిరిగి ఇంటిబాట పట్టిన ఆందోళనకారులు
జంతర్‌మంతర్‌ను ఖాళీ చేసిన విద్యార్థులు
-
Jul 25, 2026 17:34 IST
CJP ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించాం: జేపీ నడ్డా
నీట్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తాం
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనలకు లోబడి ఎక్స్‌గ్రేషియా: జేపీ నడ్డా
-
Jul 25, 2026 17:34 IST
ఢిల్లి: మూడు డిమాండ్లపై కేంద్రంతో చర్చలు జరిపాం: CJP
మా ప్రధాన డిమాండ్ నెరవేరింది: CJP
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మా తొలి గెలుపు: CJP
విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు అంగీకరించారు: CJP
ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలి
జంతర్ మంతర్‌లో ఆందోళన విరమిస్తున్నాం: CJP
-
Jul 25, 2026 17:32 IST
ఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి అమిత్ షా
ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశంసించిన అమిత్ షా
దేశ విద్యా వ్యవస్థలో ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నో సంస్కరణలు తెచ్చారు: అమిత్ షా
విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు: అమిత్ షా
-
Jul 25, 2026 17:20 IST
నా సలహా మేరకే ధర్మేంద్ర రాజీనామా: శరద్ పవార్
నా సలహాను మోదీ స్వీకరించారు: శరద్ పవార్
పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నా సలహా కోరారు
-
Jul 25, 2026 17:19 IST
101 కిలోల గంజాయి స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం: కూనవరం రోడ్‌లో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు
101 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్టు
-
Jul 25, 2026 16:49 IST
ఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: అఖిలేష్ యాదవ్
డిమాండ్లతో ముందుకు వచ్చి.. కొత్త తరం సాధించిన విజయం ఇది
విద్యార్థుల డిమాండ్లకు ప్రభుత్వం తలవంచక తప్పలేదు: అఖిలేష్ యాదవ్
-
Jul 25, 2026 16:41 IST
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ స్పందన
విద్యార్థులకు హ్యాట్సాఫ్.. వారే నిజమైన దేశభక్తులు: రాహుల్ గాంధీ
విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది: రాహుల్ గాంధీ
విద్యావ్యవస్థలో సంస్కరణలు వస్తాయని ఆశిస్తున్నా: రాహుల్ గాంధీ
-
Jul 25, 2026 16:34 IST
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విరుచుకుపడ్డ నిరసనకారులు
జంతర్ మంతర్ వద్ద పోలీసులపై రాళ్లదాడికి దిగిన నిరసనకారులు
రాళ్లదాడిలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
భాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
అదనపు బలగాలు మోహరింపు.. ప్రస్తుతం అదుపులోనే పరిస్థితి
-
Jul 25, 2026 16:28 IST
శివసేన UBT వర్గం నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
ఫడ్నవీస్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కాబోతున్నారు
మహారాష్ట్రలో సీఎం మార్పు ఖాయం: సంజయ్ రౌత్
-
Jul 25, 2026 16:20 IST
కేంద్రంతో మరోసారి CJP ప్రతినిధుల భేటీ
చర్చల్లో పాల్గొన్న జేపీ నడ్డా, జితేంద్ర సింగ్
CJP నుంచి హాజరైన సౌరవ్ దాస్, అశుతోష్
-
Jul 25, 2026 16:05 IST
భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే
టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా
తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
-
Jul 25, 2026 16:02 IST
ఆందోళనలు విరమిస్తున్నాం: CJP
మా డిమాండ్లు నెరవేరాయి: CJP
-
Jul 25, 2026 15:58 IST
ఇది కోట్ల మంది విద్యార్థుల విజయం: ఖర్గే
విద్యా వ్యవస్థల ప్రక్షాళనకు విద్యార్థులు కదంతొక్కారు: ఖర్గే
-
Jul 25, 2026 15:58 IST
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై హర్షం వ్యక్తంచేసిన వాంగ్‌చుక్
యువత పట్టుదలతో సాధించిన విజయమిది: వాంగ్‌చుక్
Gen-Z, CJP ప్రతినిధులకు అభినందనలు: వాంగ్‌చుక్
-
Jul 25, 2026 15:52 IST
ప్రధాని మోదీతో అమిత్ షా కీలక సమావేశం
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతర పరిణామాలపై చర్చ
-
Jul 25, 2026 15:50 IST
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు
ఢిల్లీ రావాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు అధిష్టానం నుంచి పిలుపు
డిప్యూటీ సీఎం షిండేకు ఢిల్లీ పెద్దల పిలుపు
కీలక నేతలకు హైకమాండ్ పిలుపుతో రాజకీయాల్లో ఉత్కంఠ
-
Jul 25, 2026 15:50 IST
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రియాంక హర్షం
ఇది దేశ యువత సాధించిన విజయం: ప్రియాంక
కేంద్రానికి యువత గుణపాఠం చెప్పింది: ప్రియాంక
-
Jul 25, 2026 15:49 IST
హైదరాబాద్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన హరీశ్ రావు
ఇది దేశ యువత సాధించిన ఘన విజయం: హరీశ్ రావు
దేశ రాజకీయాల్లో యువత తీసుకొచ్చిన పెనుమార్పు: హరీశ్ రావు
-
Jul 25, 2026 15:48 IST
ఢిల్లీ: జంతర్‌మంతర్ దగ్గర కోలాహలం
ఆత్మహత్య చేసుకున్న వారి కోసం మౌనం పాటించిన విద్యార్థులు
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఆత్మలకు శాంతి చేకూరింది: దీప్కే
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి
లాఠీచార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: అభిజీత్ దీప్కే
-
Jul 25, 2026 15:14 IST
బొద్దింకలతో పెట్టుకోవద్దు: అభిజీత్ దీప్కే
ఇది యువత సాధించిన విజయమన్న సీజేపీ ఫౌండర్
ఇంకా రెండు డిమాండ్స్ మిగిలే ఉన్నాయని వ్యాఖ్య
అప్పటివరకూ తమ పోరాటం ఆగదని స్పష్టీకరణ
-
Jul 25, 2026 15:14 IST
విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం: ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగం
నీట్ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా
ప్రధాని మోదీకి రాజీనామా లేఖ పంపిన ధర్మేంద్ర ప్రధాన్
దేశ వ్యతిరేక శక్తులకు అవకాశం ఇవ్వనని 'ఎక్స్' వేదికగా పేర్కొన్న ధర్మేంద్ర ప్రధాన్
విద్యార్థులు లీగల్ చిక్కుల్లో పడకూడదనే తప్పుకొన్నానని వివరణ
విద్యార్థి పోరాటానికి లభించిన విజయంగా పేర్కొన్న విద్యాశాఖ మంత్రి
-
Jul 25, 2026 15:10 IST
హైదరాబాద్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: TPCC చీఫ్ మహేష్‌గౌడ్
కాంగ్రెస్‌తో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాల పోరాట ఫలితమే రాజీనామా: మహేష్‌గౌడ్
-
Jul 25, 2026 15:09 IST
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: మంత్రి పొన్నం
ఈ రోజు దిగివచ్చిన ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు: మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం వచ్చింది: పొన్నం ప్రభాకర్
ఇది కేంద్ర ప్రభుత్వం దిగిపోవడానికి తొలిమెట్టు: మంత్రి పొన్నం ప్రభాకర్
-
Jul 25, 2026 15:00 IST
షమీని ఎవ్వరూ పట్టించుకోని స్థితికి తీసుకొచ్చారు: క్రిస్ శ్రీకాంత్
భారత యాజమాన్యంపై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ఫైర్
భారత బౌలింగ్ దళానికి ప్రధాన అస్త్రం షమీ: శ్రీకాంత్
అతడిని పూర్తిగా పక్కన పెట్టడం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది: శ్రీకాంత్
-
Jul 25, 2026 14:26 IST
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
CJP డిమాండ్‌తో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పేపర్ లీకేజీతో కేంద్రంపై CJP ఒత్తిడి
నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామా
-
Jul 25, 2026 14:21 IST
రేపు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీకి CJP పిలుపు
రేపు సాయంత్రం 6 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ
-
Jul 25, 2026 14:14 IST
గుంటూరు: ముద్రగడ సంతాపసభలో అసక్తికర సన్నివేశం
ఒకే వేదికపై బోండా ఉమ, అంబటి రాంబాబు
ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్న అంబటి రాంబాబు, బోండా ఉమ
-
Jul 25, 2026 14:08 IST
అమరావతి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బుద్ధా వెంకన్న నియామకం
అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు నియామకం
సీఎం చంద్రబాబు ఆదేశాలతో నియామకాలు చేపట్టిన పార్టీ నాయకత్వం
-
Jul 25, 2026 13:57 IST
పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలను అరికట్టేలా చట్టంలో కీలక సవరణలు
సాధారణ అక్రమాలకు పాల్పడితే జైలు శిక్ష 5 నుంచి 10 ఏళ్లకు పెంపు
సాధారణ అక్రమాలకు పాల్పడితే జరిమానా రూ.50 లక్షల వరకు విధింపు
ఆర్గనైజ్డ్ ముఠాలు, పేపర్ లీక్ గ్యాంగ్‌లకు రూ.10 కోట్ల వరకు జరిమానా
పరీక్షలు నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్లకు రూ.5 కోట్ల జరిమానా సహా 8 ఏళ్లపాటు బ్లాక్‌లిస్ట్
కేసు నమోదైన 2 నెలల్లోపే విచారణ పూర్తిచేసేలా చట్టంలో సవరణలు
-
Jul 25, 2026 13:56 IST
బిహార్: పాట్నాలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం
నీట్ పేపర్ లీక్ వివాదం, పోలీసుల వైఖరికి నిరసనగా ఆందోళన
పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ
పోలీసుల వాహనాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులు
-
Jul 25, 2026 13:54 IST
జనగామ: ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య ఫైర్
నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని కడియంకు సవాల్
అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధమన్న రాజయ్య
కడియం శ్రీహరికి నైతిక విలువలు లేవని మండిపడ్డ రాజయ్య
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి గెలవాలని డిమాండ్
బీఆర్ఎస్ నేతలపై మాట్లాడే అర్హత కడియంకు లేదని ఫైర్ అయిన రాజయ్య
-
Jul 25, 2026 13:50 IST
ఢిల్లీ: సీజేపీ ఆందోళనకు ప్రొఫెసర్ కోదండరామ్ మద్దతు
సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకాను కలిసిన కోదండరామ్
విద్యార్థుల ఆందోళన తీరును ప్రశంసించిన కోదండరామ్
నీట్ పేపర్ లీక్ కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: కోదండరామ్
వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఆందోళన చేస్తున్నారు: కోదండరామ్
-
Jul 25, 2026 13:17 IST
హైదరాబాద్: ధాన్యం సేకరణపై టీజీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
హాజరైన భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు
ధాన్యం సేకరణ పురోగతి, తదుపరి కార్యాచరణపై చర్చ
-
Jul 25, 2026 13:08 IST
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వీకెండ్‌లో మద్యం దుకాణాల వేళల్లో మార్పు
శని, ఆదివారాల్లో రాత్రి 8 గంటలకే వైన్ షాపుల మూసివేత
జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో నిర్ణయం
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఢిల్లీ పోలీసుల ముందస్తు చర్యలు
వచ్చే వారం నుంచి సాధారణంగా రాత్రి 10 గంటల వరకు తెరుచుకోనున్న వైన్ షాపులు
-
Jul 25, 2026 12:44 IST
నల్లగొండ: మరోసారి హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే మందుల సామెలు
కోమట్టిరెడ్డి రాజగోపాల్ పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చారు
రాజగోపాల్ కంటే నేనే కాంగ్రెస్‌లోకి ముందు వచ్చాను
మునుగోడులో నా క్యాడర్ కూడా ఉంది
మునుగోడులో రాజగోపాల్‌ను గెలిపించినందుకు నా క్యాడర్ బాధపడుతోంది
కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చేది అధిష్ఠానం
-
Jul 25, 2026 12:40 IST
ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు ఉండొచ్చు: రాహుల్ గాంధీ
ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్న రాహుల్
విద్యార్థులు ఈ చర్యను ఆమోదించబోరన్న రాహుల్
-
Jul 25, 2026 12:27 IST
ఢిల్లీ: ఇటీవల చేసిన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వివరణ
నకిలీ/గుర్తింపులేని లా డిగ్రీలతో న్యాయ వృత్తిలోకి వచ్చిన లాయర్ల గురించి చర్చ సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేశా: సీజేఐ
దేశంలో సుమారు 48 వేల మంది నకిలీ డిగ్రీలతో న్యాయవాదులుగా చలామణి అవుతున్నారు: సీజేఐ
అలాంటివారిని ఉద్దేశించి బొద్దింకల వంటివారన్నాను: సీజేఐ
అంతేకానీ విద్యార్థులు, యువత గురించి అలా అనలేదు: సీజేఐ
నా వ్యాఖ్యలను వక్రీకరించారు: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
-
Jul 25, 2026 12:24 IST
హైదరాబాద్: కాసేపట్లో కాంగ్రెస్ దళిత నేతల సమావేశం
ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో భేటీ
హాజరుకానున్న ఎస్సీ మంత్రులు, MP, MLA, MLCలు
-
Jul 25, 2026 12:17 IST
ఢిల్లీ: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకి టైఫాయిడ్
నీట్ పేపర్ లీక్‌పై ఢిల్లీలో నెల రోజులుగా నిరసన చేపట్టిన దీప్కే
దీంతో అనారోగ్యానికి గురైన దీప్కే, పలువురు మద్దతుదారులు
తనకు టైఫాయిడ్ వచ్చిందని ఎక్స్ వేదికగా వెల్లడించిన దీప్కే
-
Jul 25, 2026 11:53 IST
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
గువాహటిలో నిరసనల్లో పాల్గొన్న అస్సాం మంత్రి కేశవ్ మహంత కుమార్తె దిబిశా మహంత
పేపర్ లీక్‌కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
కేంద్రానికి వ్యతిరేకంగా మంత్రి కుమార్తె నిరసనపై సోషల్ మీడియాలో చర్చ
విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందన్న సీఎం హిమంత బిశ్వశర్మ
-
Jul 25, 2026 11:38 IST
కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్‌కు తొలి పతకం అందించిన ఝండూ కుమార్
పారా పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించిన ఝండూ కుమార్
ఝండూ కుమార్‌ను అభినందించిన ప్రధాని మోదీ
ఝండూ విజయం దేశానికి గర్వకారణమని ప్రధాని ప్రశంస
-
Jul 25, 2026 11:25 IST
ఢిల్లీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: సీజేపీ
లేదంటే ప్రధాని మోదీ రాజీనామా చేయాలి: సీజేపీ
-
Jul 25, 2026 11:25 IST
ఢిల్లీ: ప్రధాని, కేంద్రమంత్రులు, అధికారుల పేరుతో వైరల్ అవుతోన్న వీడియోలు
అవన్నీ ఫేక్ వీడియోలని తేల్చిన పీఐబీ
ప్రధాని, కేంద్రమంత్రులు, అధికారులు ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న పీఐబీ
పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న పీఐబీ
-
Jul 25, 2026 11:12 IST
నెల్లూరు: దుత్తలూరు మండలం నర్రవాడ బీసీ కాలనీలోని ఓ ఇంట్లో చోరి
రూ.6 లక్షల నగదు, బంగారం నగలు చోరి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jul 25, 2026 11:10 IST
కర్నూలు: ఆదోని మట్కావాడి వీధిలో క్షుద్రపూజల కలకలం
ఉస్మాన్ వాలి ఇంట్లో క్షుద్రపూజలు చేస్తుండగా పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
నిమ్మకాయలు, గుడ్లు, తేలుతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గుర్తింపు
ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Jul 25, 2026 11:08 IST
కడప: ప్రొద్దుటూరులోని వసంత పేటలో సుసాన్ రాణి అనే మహిళ దారుణ హత్య
ఆమె నివాసంలోనే రెండు మూడు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు గుర్తింపు
ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇంటి యజమాని
ఘటన స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్న పోలీసులు
కొన్ని రోజులుగా అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వివాహిత
-
Jul 25, 2026 11:06 IST
యాదాద్రి: డ్యూటీల విషయంలో నా బిడ్డను టార్చర్ పెట్టారు
రాత్రి పూట సీనియర్లు, హెచ్‌వొడీ ఇబ్బందులు పెడుతున్నారని నా బిడ్డ బాధ పడింది
డ్యూటీ చేసుకోవాలని సర్ది చెప్పాను.. ఇలా జరుగుతుందని అనుకోలేదు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో దీక్షిత తండ్రి వడ్లకొండ ఆనంద్
-
Jul 25, 2026 11:05 IST
అమెరికా సెనేట్‌లో H-1B బిల్లు
'ఎండ్ H-1B అబ్యూజ్ యాక్ట్' పేరిట నూతన బిల్లు
బిల్లు ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సెనేటర్ టిమ్
-
Jul 25, 2026 10:43 IST
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన రాహుల్ గాంధీ..
మెట్రోలు బంద్ చేయండి.. దారులు మూసివేయండి: రాహుల్
దుకాణాలు మూసివేయండి, ఇంటర్నెట్ బంద్ చేయండి: రాహుల్
అన్నం పెట్టడం ఆపేయండి: రాహుల్
తమ హక్కులను అడుగుతున్న విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ క్రూరమైన చర్యలు తీసుకుంది: రాహుల్
కానీ.. ఒక్క విషయాన్ని మాత్రం బంద్ చేయలేకపోయారు: రాహుల్
అదే.. మోదీ గారు.. పేపర్ లీక్: రాహుల్
-
Jul 25, 2026 10:39 IST
కామన్వెల్త్ గేమ్స్‌లో చాడ్ లె క్లోస్ అరుదైన రికార్డు
4×100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో కాంస్య పతకం
ఈ గేమ్స్‌లో మొత్తం 19 పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన లె క్లోస్
ఆస్ట్రేలియా షూటర్ ఫిల్ ఆడమ్స్, ఇంగ్లాండ్ షూటర్ మిక్ గాల్ట్‌ల రికార్డులను అధిగమించిన దక్షిణాఫ్రికా స్టార్
7 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్యాలతో మొత్తం 19 పతకాలు సాధించిన లె క్లోస్
-
Jul 25, 2026 10:29 IST
హైదరాబాద్: సా. 6:30 గంటలకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడి, కేంద్రం తీరుకు నిరసనగా ర్యాలీ
నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ
పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
-
Jul 25, 2026 10:18 IST
పెరిగిన బంగారం ధరలు
రూ.600 పెరిగి రూ.1,44,930కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం
రూ.550 పెరిగి రూ.1,32,850కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం
రూ.2,40,000కి చేరిన కిలో వెండి ధర
-
Jul 25, 2026 10:16 IST
మేడ్చల్: జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీ కొన్న స్కూల్ బస్
ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు
ఆసుపత్రికి తరలింపు
-
Jul 25, 2026 09:33 IST
అన్నమయ్య: మదనపల్లి పట్టణంలో అర్థరాత్రి ఎస్‌బిఐ ఏటీఎం మిషన్ చోరీ
బొలెరో వాహనంలో ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిన దొంగలు
చోరీకి గురైన ఏటీఎం మిషన్‌లో రూ.13 లక్షలు ఉన్నట్లు సమాచారం
-
Jul 25, 2026 09:32 IST
హైదరాబాద్: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
కీసర పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
మేనమామతో పాటు వరుసకు సోదరులైన ఇద్దరిపై ఆరోపణలు
గంజాయి మత్తులో దారుణానికి పాల్పడినట్లు సమాచారం
బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
-
Jul 25, 2026 09:13 IST
కర్నూలు: కల్లూరు ఎస్టేట్‌లో అగరబత్తి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
ఎగిసిపడుతున్న మంటలు
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
భారీగా ఆస్తి నష్టం
-
Jul 25, 2026 09:09 IST
అమరావతి: తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
శ్రీమహావిష్ణువు దివ్య అనుగ్రహంతో సుఖశాంతులు కలగాలని ప్రార్థిస్తున్నా: సీఎం
-
Jul 25, 2026 09:06 IST
జగిత్యాల: పొరండ్ల గ్రామంలో విషజ్వరాల కలకలం
చికిత్స పొందుతూ హరిస్మిత (6), వరుణ్ తేజ (6) మృతి
విషజ్వరంతోనే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యుల ప్రాథమిక నిర్ధారణ
గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు
-
Jul 25, 2026 08:32 IST
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో మెడల్ గెలిచిన భారత్
బిహార్‌కు చెందిన పారా పవర్ లిఫ్టర్ ఝండూ కుమార్‌కు కాంస్య పతకం
72 కిలోల హెవీవెయిట్ కేటగిరీలో మూడో స్థానంలో నిలిచిన ఝండూ
రిలువన్(నైజీరియన్)కు గోల్డ్, మాథ్యూ(ఇంగ్లండ్)కు సిల్వర్ పతకాలు
-
Jul 25, 2026 08:28 IST
మేడ్చల్: మెడికో విద్యార్థిని దీక్షిత సూసైడ్ కేసులో పోలీసుల దర్యాప్తు
బెంగుళూరులో సిద్ధార్థ కళాశాలలో పీజీ చేస్తున్న దీక్షిత
పీజీ చేస్తూనే అదే ఆస్పత్రిలో పని చేస్తున్న దీక్షిత
మూడు నెలల నుంచి సెలవులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్టు సమాచారం
గత వారం నాగారంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చిన దీక్షిత
సాయంత్రం అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి దీక్షిత ఆత్మహత్య
-
Jul 25, 2026 08:15 IST
తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన సోమన్ వాంగ్‌చుక్
కేంద్రంతో డీల్ చేసుకుని నిరాహార దీక్ష విరమించారంటూ విమర్శలు
ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేసిన వాంగ్‌చుక్
ఇలా నీచంగా మాట్లాడటం బాధాకరం: సోనమ్ వాంగ్‌చుక్
డీల్ చేసుకోవాలంటే 26 రోజులు ఢిల్లీ వేడిలో రోడ్డుపై దీక్ష చేయాలా?: వాంగ్‌చుక్
నా దీక్ష పవిత్రమైనది, 11 కిలోల శరీరాన్ని కోల్పోయాను: వాంగ్‌చుక్
ఇంత చేసినా నేను ఇంకా నిజాయతీ నిరూపించుకోవాలా?: వాంగ్‌చుక్
-
Jul 25, 2026 08:13 IST
నల్ల సముద్రంలో ఎంవీ ఒమోర్ఫీ నౌకపై దాడి
దాడిలో నౌకలోని భారతీయుడి మృతి
దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
-
Jul 25, 2026 08:12 IST
పాకిస్థాన్: జైల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు తీవ్ర అనారోగ్యం
ఇమ్రాన్ అనారోగ్యంపై కుమారుడు ఆందోళన
తన తండ్రిని చూసేందుకు అనుమతి ఇవ్వడం లేదని ఖాసిం ఆవేదన
ఇమ్రాన్‌ఖాన్‌కు వెంటనే వైద్యం అందించాలని విన్నపం
యూకేలో ఉంటున్న ఇమ్రాన్ కుమారులు ఖాసిం, సులేమాన్
-
Jul 25, 2026 08:11 IST
వరంగల్: భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు
తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు
భద్రకాళి ఆలయానికి భారీగా భక్తులు
-
Jul 25, 2026 08:10 IST
సౌదీ అరేబియా-యెమెన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
సౌదీపై డ్రోన్స్, మిస్సైల్స్ ప్రయోగించిన హౌతీలు
హౌతీల ఆధీనంలో ఉన్న పోర్ట్‌పై సౌదీ అరేబియా దాడి
-
Jul 25, 2026 07:55 IST
అమరావతి: హోంమంత్రి అనిత ఎక్స్ అకౌంట్ హ్యాక్
గుర్తుతెలియని వ్యక్తులు తన ఖాతా హ్యాక్ చేశారంటూ అనిత ఫిర్యాదు
సైబర్ క్రైమ్ IGతోనూ ఇదే విషయం మాట్లాడిన హోంమంత్రి
-
Jul 25, 2026 07:53 IST
గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం
అమెరికా స్థావరాలకు ప్రజలు దూరంగా ఉండాలని IRGC హెచ్చరిక
ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా దాడులు
వరుసగా 13వ రోజు ఇరాన్‌పై అమెరికా దాడులు
అమెరికా దాడుల్లో 55 మంది మృతి, 600 మందికిపైగా గాయాలు
-
Jul 25, 2026 07:52 IST
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
హోర్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన వందలాది నౌకలు
హోర్ముజ్‌లో చిక్కుకుపోయిన 6 వేల మంది నావికులు
ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వెల్లడి
-
Jul 25, 2026 07:51 IST
నేడు భారత్-జింబాబ్వే రెండో టీ20
హరారే వేదికగా సా.4:30 గంటలకు మ్యాచ్
మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా
-
Jul 25, 2026 07:49 IST
నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం
జమ్మూలోని భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి ప్రారంభం
తొలి విడతగా జమ్ము నుంచి బాల్తాల్ బేస్ క్యాంప్‌కు వెళ్తున్న భక్తులు