ఇది ఎవరికీ ఓటమి కాదు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ కామెంట్
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:45 PM
కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం రాహుల్ గాంధీ స్పందించారు. ఇది ఎవరికీ ఓటమి కాదని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం రాహుల్ గాంధీ స్పందించారు. ఇది ఎవరికీ ఓటమి కాదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా లభించిన విజయమని అన్నారు. విద్యారంగంలో సంస్కరణలు, బాధ్యతాయుత వైఖరిని వారు పట్టుబట్టి సాధించుకున్నారని అన్నారు. అయితే, ప్రభుత్వంపై తమ పోరాటం మాత్రం కొనసాగుతుందని అన్నారు.
‘భారత విద్యారంగం మనందరికీ గర్వకారణంగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కేవి. కానీ ఏళ్ల కొన్నేళ్లుగా ప్రైవేటీకరణ చొచ్చుకొచ్చింది. ఇందుకు ప్రతిస్పందనగానే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇకపై గట్టి చర్యలు తీసుకోవాలి’ అని రాహుల్ గాంధీ అన్నారు.
వ్యవస్థలో లోపాలకు ధర్మేంద్ర ప్రధాన్ ఒక చిహ్నం మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. ఏ ఒక్క మంత్రినో టార్గెట్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టలేదని అన్నారు. వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి కోసమే ఆందోళనకు దిగారని అన్నారు.
ఇక నిరసనల సందర్భంగా కట్టుతప్పిన పోలీసులపై అందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. విద్యార్థులకు ప్రధాని కూడా క్షమాపణ చెప్పాలని అన్నారు. హోం మంత్రి అమిత్ షాపై కూడా రాహుల్ గాంధీ మండిపడ్డారు. నిరసనల్లో హింసాత్మక ఘటనలకు అమిత్ షానే కారణమని ఆరోపించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు