Share News

రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే..

ABN , Publish Date - Jul 25 , 2026 | 08:07 PM

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో సొంతం చేసుకుంది.

రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే..
India vs Zimbabwe

ఇంటర్నెట్ డెస్క్: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల పరాజయాల తర్వాత శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత టీ20 జట్టు తొలిసారిగా సిరీస్‌ను పట్టేసింది. 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే పూర్తిగా తడబడింది. 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది.


జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్(32) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లంతా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లతో చెలరేగాడు. అరంగేట్ర బౌలర్ యశ్ ఠాకూర్ 2, ప్రిన్స్ యాదవ్ 2, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, తిలక్ వర్మ తలొక వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(81), తిలక్ వర్మ(60*) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కాగా ఈ సిరీస్‌లో నామమాత్రపు ఆఖరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే

వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 25 , 2026 | 08:08 PM