Share News

రెండో టీ20: భారత్ భారీ స్కోర్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Jul 25 , 2026 | 06:17 PM

హరారే వేదికగా జింబాబ్వే, భారత జట్లు రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. జింబాబ్వేకు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

రెండో టీ20: భారత్ భారీ స్కోర్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
India vs Zimbabwe 2nd T20

ఇంటర్నెట్ డెస్క్: హరారే వేదికగా జింబాబ్వే, భారత జట్లు రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. జింబాబ్వేకు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇషాన్ కిషన్(81; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ(60*; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.


వైభవ్ సూర్యవంశీ(20; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నంత సేపు చెలరేగాడు. అభిషేక్ శర్మ(8) మరోసారి విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్(25) పర్వాలేదనిపించాడు. రింకు సింగ్(12) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. తిలక్ వర్మ, శివమ్ దూబె(6*) నాటౌట్‌గా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, నగరవా, బ్రాడ్ ఎవాన్స్, బ్రియాన్, న్యూమాన్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే

వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 25 , 2026 | 06:17 PM