Share News

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే

ABN , Publish Date - Jul 25 , 2026 | 04:16 PM

హరారే వేదికగా భారత జట్టు జింబాబ్వేతో రెండో టీ20లో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన జింబాబ్వే.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే
India vs Zimbabwe 2nd T20

ఇంటర్నెట్ డెస్క్: హరారే వేదికగా భారత జట్టు జింబాబ్వేతో రెండో టీ20లో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన జింబాబ్వే.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో యువ పేసర్ యశ్ ఠాకూర్ భారత్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన యశ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి టీ20లో గెలిచి జోష్ మీదున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ పట్టేయాలని చూస్తోంది.


జింబాబ్వే తుది జట్టు:

సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెనెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, వెస్లీ మద్వీర, మారుమని, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, ముజారబాని

భారత్ తుది జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్.


ఇవి కూడా చదవండి:

షమీని ఎవ్వరూ పట్టించుకోని స్థితికి తీసుకొచ్చారు: క్రిస్ శ్రీకాంత్

కామన్వెల్త్ గేమ్స్: భారత్‌కు తొలి పతకం.. ఝండూ కుమార్‌కు మోదీ అభినందనలు

Updated Date - Jul 25 , 2026 | 04:16 PM