Share News

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

ABN , Publish Date - Jul 25 , 2026 | 02:28 PM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్‌, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
Dharmendra Pradhan Resigns as Union Education Minister Amid Paper Leak Controversy

ఢిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్‌, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.


నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరసనలు చేపట్టి, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026 ముసాయిదాను విడుదల చేసి, పేపర్ లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కాలపరిమితిలో విచారణ వంటి కీలక నిబంధనలను ప్రతిపాదించింది.


మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ బాధ్యతలను ఎవరు చేపడతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించే అవకాశం ఉంది. అయితే రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, రాష్ట్రపతి ఆమోదం, తదుపరి బాధ్యతల కేటాయింపుపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, విద్యార్థి సంఘాలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు, దీర్ఘకాలిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.


దీంతో.. నీట్‌ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన తీవ్ర ఆందోళనలు, తెచ్చిన ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చినట్లైంది. లీకేజీ వివాదంపై నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాల తరఫున CJP పట్టుబట్టడంతో, ఈ ఉదంతానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. CJP సుదీర్ఘ పోరాటం, డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం తలొగ్గక తప్పలేదని, విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఇది కీలక పరిణామంగా కనిపిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు

‘వందనం’తో తల్లికి ఆనందం

Updated Date - Jul 25 , 2026 | 03:03 PM