ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:55 PM
తమ ఆందోళనను విరమిస్తున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ పేర్కొంది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తొలి విజయం దక్కిందని అన్నారు. విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ల ఎత్తివేతకు కూడా కేంద్రం ఒప్పుకుందని అన్నారు. నీట్ పేపర్ లీక్ బాధితులకు పరిహారంపై కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో తాజా సమావేశం అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు తమ ఆందోళనను విరమిస్తున్నామని ప్రకటించారు. జంతర్‌మంతర్ నుంచి విద్యార్థులు, యువత తిరిగి వెళ్లాలని కోరారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమకు తొలి విజయం దక్కిందని అన్నారు. నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను ఎత్తేసేందుకు కేంద్రం అంగీకరించిందని అన్నారు. నీట్ పేపర్ లీక్ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిమారం ఇవ్వాలన్న డిమాండ్‌కు కేంద్రం సానుకూలంగా స్పందించిందని అన్నారు. తాము ఆశించిన చర్యలను కేంద్రం త్వరిత గతిన తీసుకుంటుందన్న విశ్వాసంతో ఆందోళనను విరమిస్తున్నామని అన్నారు.
సీజేపీ ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా వారితో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. నీట్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తేస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నిబంధనలకు లోబడి పరిహారం ఇస్తామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
బొద్దింకలతో పెట్టుకోవద్దు: అభిజీత్ దీప్కే