బొద్దింకలతో పెట్టుకోవద్దు: అభిజీత్ దీప్కే
ABN , Publish Date - Jul 25 , 2026 | 03:08 PM
కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై చేయడంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. జంతర్ మంతర్ వేదికగా ఆయన మాట్లాడుతూ బొద్దింకల సత్తా అందరికీ తెలిసొచ్చిందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై చేయడంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. జంతర్ మంతర్ వేదికగా ఆయన మాట్లాడుతూ బొద్దింకల సత్తా అందరికీ తెలిసొచ్చిందని అన్నారు. నీట్ పేపర్ లీక్ బాధితులకు న్యాయం దక్కిందని వ్యాఖ్యానించారు. బొద్దింకలు ఒకసారి వస్తే వెళ్లగొట్టడం సాధ్యం కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది విద్యార్థుల విజయమని అన్నారు. తమని తాము బాద్షాలుగా భావిస్తున్న వారిని దారిలోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. యువత ఓట్లతోనే వారు నేడు అధికారంలో ఉన్నారని అన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పాలకులను అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని కూడా ఉన్నారు.
తాము పెట్టిన రెండు డిమాండ్స్ ఇంకా మిగిలే ఉన్నాయని దీప్కే అన్నారు. అవి సాధించేవరకూ ముందుకు సాగుతూనే ఉంటామని అన్నారు. మరికొద్ది సేపట్లో సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రాధాన్యం ఏర్పడింది. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ తాను తప్పుకుంటున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
పోలీసులతో వాంగ్‌చుక్ వాగ్వివాదం.. వైరల్‌గా మారిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వీడియో..