మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు
ABN , Publish Date - Jul 25 , 2026 | 08:38 PM
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మరో మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది.
ఇంటర్నెట్ డెస్క్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మరో మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది. ప్రస్తుతం కన్జ్యూమర్ ఎఫైర్స్ శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా రాష్ట్రపతి ఆమోదించారు.
కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రహ్లాద్ జోషి.. ఆహార, ప్రజాసరఫరా వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధన శాఖ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. భారత్ చొరవతో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. 30 ఏళ్ల నాటి హిస్టరీ రిపీట్!
కేంద్రానికి యువత గుణపాఠం చెప్పింది: ప్రియాంక గాంధీ