-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 23rd June 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 23 , 2026 | 06:47 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 23, 2026 21:27 IST
అమరావతి: సీఐ నాగరాజుకి మద్దతుగా ర్యాలీలు చేయడంపై ప్రభుత్వం సీరియస్!
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ చేయడంపై ఆరా చేస్తున్నట్లు సమాచారం
నాలుగు రోజులుగా నాగరాజు మద్దతుదారుల ఆందోళన
నాగరాజుని అరెస్టు చేసే సమయంలో పోలీసులను అడ్డుకున్న మద్దతుదారులు
మద్దతుదారుల ఆందోళన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దల ఆదేశం
వివరాలు సేకరిస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు
-
Jun 23, 2026 21:21 IST
అమరావతి: పరవాడ ఫార్మా సిటీ అగ్నిప్రమాదంపై పవన్ సమీక్ష
అగ్నిప్రమాద ఘటనకు కారణాలపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా
మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు తెలిపిన కలెక్టర్
పారిశ్రామిక వాడల్లో తరచూ అగ్నిప్రమాదాలపై నివేదిక కోరిన పవన్
-
Jun 23, 2026 21:20 IST
రాజమండ్రి: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు యువకుల మృతి
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఘటన
మృతులు ధవళేశ్వరానికి చెందిన సోదరులు హేమంత్(19), చిన్ను(16)గా గుర్తింపు
-
Jun 23, 2026 21:19 IST
తెలంగాణ నూతన CSగా సంజయ్ జాజు?
ఈ నెలాఖరుతో ముగియనున్న CS రామకృష్ణారావు పదవీకాలం
కేంద్ర సర్వీస్‌ల నుంచి సంజయ్ జాజును వెనక్కి పంపుతూ కేంద్రం నిర్ణయం
CSగా సంజయ్ జాజుకు లైన్‌క్లియర్
ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు
నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్‌ను కలిసిన సంజయ్
-
Jun 23, 2026 21:18 IST
ఢిల్లీ: రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ
దేశ రాజధానిలో ఊపందుకున్న పొలిటికల్ హీట్
కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలోనే ప్రధాని-రాష్ట్రపతి భేటీ అయినట్లు ఊహాగానాలు
కేంద్రమంత్రి పదవికి జార్జ్ కురియన్ రాజీనామా
రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము
-
Jun 23, 2026 20:54 IST
నల్లగొండ: పీఏపల్లి మండలం పెద్దగట్టు సమీపంలో ప్రమాదం
మూలమలుపు వద్ద ప్రమాదావశాత్తు ట్రాక్టర్ నుంచి ఎగిరిపడిన కూలీలు
ఐదుగురికి తీవ్ర గాయాలు, 15 మందికి స్వల్ప గాయాలు
బాణాలకుంట తండాకు చెందిన 20 మంది కూలీలు.. పనులకు వెళ్లి వస్తుండగా ఘటన
-
Jun 23, 2026 20:40 IST
సింగరేణి అత్యంత దయనీయ స్థితిలో ఉంది: మాజీ మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో సింగరేణి నిర్వీర్యం: హరీశ్ రావు
సింగరేణి టెండర్లలో అవినీతి, అక్రమాలు
సైట్ విజిట్ పేరుతో టెండర్లలో గోల్‌మాల్
లాభాల సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు
40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది: మాజీ మంత్రి హరీశ్ రావు
-
Jun 23, 2026 20:03 IST
పిడుగుపాటుకు.. 8 ఆవుల మృతి
నంద్యాల: అవుకు మండలం అన్నవరం గ్రామ పొలాల్లో విషాద ఘటన
పిడుగు పాటుకు 8 ఆవుల మృతి
-
Jun 23, 2026 19:59 IST
నంద్యాల: శ్రీశైలం క్షేత్రంలో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందడుగు
పరిపాలన భవనం నుంచి ఆస్పత్రి వరకు స్థలం పరిశీలన
రూ.125 కోట్ల అంచనాలతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు
15 వేల మంది భక్తులు వేచిఉండేలా క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రణాళికలు
-
Jun 23, 2026 19:58 IST
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
ఎల్లుండి ఉద్యోగులు, పెన్షనర్ల ఉచిత బీమా పథకం ప్రారంభం
పథకాన్ని రవీంద్రభారతిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్
ఉద్యోగులకు రూ.1.20 కోట్ల ఉచిత జీవిత బీమా పథకం
సహజ, ప్రమాద మరణాలకు బీమా రక్షణ
బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం
-
Jun 23, 2026 19:51 IST
ఎల్లుండి తుంగభద్ర కొత్తగేట్లు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
2024లో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన 19వ గేటు
నిపుణుల సూచనతో 6 నెలల్లో రూ.51 కోట్లతో 33 కొత్తగేట్ల అమరిక
-
Jun 23, 2026 19:50 IST
ఢిల్లీ: కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ను కలిసిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల
వ్యవసాయశాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ
తెలంగాణకు పూర్తిస్థాయిలో ఎరువులు ఇవ్వాలి: మంత్రులు
నిరంతరాయంగా ఎరువుల సరఫరా చేయాలి: మంత్రులు
పంటలను MSP కింద కొనుగోలు చేయాలి: మంత్రులు
-
Jun 23, 2026 19:49 IST
మంత్రి లోకేశ్.. దక్షిణ కొరియా పర్యటనకు ప్రభుత్వం అనుమతి
జులై 5 నుంచి 11 వరకు రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో పర్యటన
కొరియా మంత్రిత్వ శాఖలతో భేటీకానున్న మంత్రి లోకేశ్
ఏపీ–కొరియా సంబంధాల బలోపేతం లక్ష్యంగా పర్యటన
పర్యటన ఖర్చులను భరించనున్న రిపబ్లిక్ ఆఫ్ కొరియా సర్కార్
-
Jun 23, 2026 19:08 IST
ములుగు: ములుగు జిల్లాలో పలుచోట్ల వర్షం
కొండాయి - మల్యాల గ్రామాల మధ్య తెగిన అప్రోచ్ రోడ్డు
నిలిచిపోయిన రాకపోకలు.. ఇబ్బందుల్లో వాహనదారులు
-
Jun 23, 2026 19:07 IST
తూ.గో.జిల్లా: కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై ప్రమాదం
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
నిడదవోలు గ్రామానికి చెందిన అయినపర్తి జస్వంత్ (20) గా గుర్తింపు
రాజమండ్రిలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతూ ఇంటికి వెళ్తున్న సమయంలో దుర్ఘటన
-
Jun 23, 2026 18:58 IST
అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం
మర్రిపాలెం చెక్‌పోస్ట్ దగ్గర NCB సోదాలు
కంటైనర్‌లో తరలిస్తున్న 1300 కేజీల గంజాయి సీజ్
ఒడిశా రాయగడ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా గంజాయి పట్టివేత
-
Jun 23, 2026 18:57 IST
రాకేష్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థపై ఈడీ దాడులు
బెంగళూరు, ముంబైలోని 9 చోట్ల ఏకకాలంలో సోదాలు
విదేశాలకు రూ.165 కోట్లకు పైగా నిధులు తరలింపు
రికార్డుల ప్రకారం బంగారం నిల్వలు 40 శాతం తక్కువ ఉన్నట్లు ఈడీ గుర్తింపు
రూ.3 వేల కోట్ల ట్రేడ్ రిసీవబుల్స్‌పై ఈడీ దర్యాప్తు
ఆఫ్రికన్ గోల్డ్ మైన్స్ పెట్టుబడులపై అనుమానాలు
బోగస్ కంపెనీలతో భారీ లావాదేవీలు జరిగినట్టు ఆరోపణ
-
Jun 23, 2026 18:57 IST
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ
సస్పెండైన సీఐ నాగరాజును 3 గంటలుగా విచారిస్తున్న అధికారులు
సాయికృష్ణ అరెస్ట్ అయిన తేదీ, వివరాలపై ఆరా
టాస్క్‌ఫోర్స్ పాత్రపై సిట్ కీలక ప్రశ్నలు
పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్‌పై సిట్ ఆరా
-
Jun 23, 2026 18:53 IST
ఆరు దేవాలయాల పునర్నిర్మాణం, అభివృద్ధికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు
సికింద్రాబాద్ శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.50 లక్షలు
సిద్దయ్యగుట్ట ధర్మవరం శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రూ.50.85 లక్షలు
సిద్దిపేట జిల్లా దొమ్మాట శ్రీమహాకాళేశ్వర ఆలయానికి రూ.4.60 కోట్లు
అనకాపల్లి జిల్లా మునగపాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.1.75 కోట్లు
సంగారెడ్డి జిల్లా కించన్‌పల్లి శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.1.09 కోట్లు
కర్నూలు జిల్లా హుస్సేనాపురం శ్రీసుంకులమ్మ, మారెమ్మ ఆలయానికి రూ.1.10 కోట్లు
-
Jun 23, 2026 18:09 IST
టూరిస్ట్ బస్సుల పన్ను తగ్గింపునకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ప్రతి సీటుపై త్రైమాసిక పన్ను రూ.4 వేల నుంచి రూ.2,500కు తగ్గింపు
ఇతర రాష్ట్రాలకు వెళ్లిన బస్సుల రిజిస్ట్రేషన్లు ఏపీకి వచ్చే అవకాశం
రవాణా రంగ అభివృద్ధికి దోహదపడనున్న ప్రభుత్వ నిర్ణయం
-
Jun 23, 2026 18:00 IST
హైదరాబాద్: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు సూచించండి.. రూ.1 లక్ష గెలుచుకోండి
ప్రజల నుంచే పథకానికి పేరు సూచించాలని హౌసింగ్ బోర్డు ఆహ్వానం
ఉత్తమ పేరు సూచించిన వ్యక్తికి రూ.1 లక్ష నగదు బహుమతి
ఈ నెల 28 వరకు సోషల్ మీడియా వేదికగా పోటీ నిర్వహణ
tghd.official ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఎంట్రీలకు అవకాశం
-
Jun 23, 2026 17:26 IST
రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానం
66 మందికి పద్మ పురస్కారాలు
పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి
నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్
నోరి దత్తాత్రేయుడుకి పద్మభూషణ్
నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, మాధవన్‌కు పద్మశ్రీ
క్రికెటర్ రోహిత్ శర్మకు పద్మశ్రీ
-
Jun 23, 2026 16:57 IST
మహిళల టీ20ఐ బౌలింగ్ ర్యాంకింగ్స్ విడుదల
సత్తాచాటిన భారత స్పిన్నర్ శ్రీ చరణి
నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న శ్రీచరణి.
ఇటీవల సౌతాఫ్రికాపై అదిరిపోయే బౌలింగ్ చేసిన శ్రీచరణి(3/24)
-
Jun 23, 2026 16:50 IST
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
కొమ్మూరి మల్లారెడ్డిపై ACB అక్రమాస్తుల కేసు నమోదు
ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్లు ACB గుర్తింపు
-
Jun 23, 2026 16:50 IST
రంగారెడ్డి: నందిగామలో దారుణం
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఇద్దరు పిల్లలను తీవ్రంగా కొట్టిన తల్లి
ప్రియుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 23, 2026 16:02 IST
సంగారెడ్డి: జోగిపేటలో కాంగ్రెస్ BLAల శిక్షణ శిబిరం
హాజరైన మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్, మంత్రి రాజనర్సింహ
SIR పేరుతో BJP ఓట్ల రాజకీయం చేస్తోంది: మీనాక్షి నటరాజన్
ECతో కుమ్మక్కై సీట్ చోరీ చేస్తున్నారు: మీనాక్షి నటరాజన్
నా నామినేషన్ తిరస్కరించి, సీట్ చోరీ చేశారు: మీనాక్షి నటరాజన్
బెంగాల్‌లో 30 లక్షల ఓట్లు తొలగించారు: మీనాక్షి నటరాజన్
బీజేపీ వల్లే బెంగాల్‌లో TMC ఓటమి: మీనాక్షి నటరాజన్
-
Jun 23, 2026 15:47 IST
కులాల మధ్య చిచ్చుకు వైసీపీ తెరలేపింది: మంత్రి కందుల దుర్గేష్
కూటమి కలిసి ఉంటే అధికారంలోకి రాలేమని వైసీపీకి భయం: కందుల దుర్గేష్
రాజకీయ భవిష్యత్తు లేదనే కుల సంఘాల సమావేశాలు: కందుల
ఇప్పటికైనా వైసీపీ నేతలు కుల రాజకీయాలు వీడాలి: కందుల
కాపులకు తీరని ద్రోహం చేసిందే జగన్: మంత్రి కందుల దుర్గేష్
-
Jun 23, 2026 15:45 IST
వడ్డెరలకు క్వారీల్లో 33 శాతం వాటాను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశా: మంత్రి నారా లోకేశ్
యువగళంలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు
ఇచ్చిన హామీ మేరకు క్వారీల్లో 33 శాతం వాటాను కేటాయించాం: లోకేశ్
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోంది: మంత్రి నారా లోకేశ్
-
Jun 23, 2026 15:11 IST
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ కేబినెట్ తీపికబురు
ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం
-
Jun 23, 2026 15:06 IST
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
850 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
250 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ
-
Jun 23, 2026 14:46 IST
మెట్రో పేరుతో రేవంత్, కిషన్‌రెడ్డి డ్రామాలు: కేటీఆర్
మెట్రో రైల్ ఆస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి కన్ను: కేటీఆర్
ఎయిర్‌పోర్ట్ వరకూ మెట్రోను రేవంత్ రద్దు చేశారు: కేటీఆర్
మెట్రో విస్తరణకు కేంద్రాన్ని కిషన్‌రెడ్డి ఒప్పించాలి: కేటీఆర్
-
Jun 23, 2026 14:42 IST
దోచుకుని, దాచుకున్న డబ్బుతో కేటీఆర్, హరీశ్ సమావేశాలు: అద్దంకి దయాకర్
అధికారం పోవడంతో పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు: అద్దంకి దయాకర్
మమ్మల్ని రెచ్చగొడితే తగిన మూల్యం చెల్లించుకుంటారు
సంస్కారం లేకుండా కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడుతున్నారు
కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడే కాదు: అద్దంకి దయాకర్
-
Jun 23, 2026 14:41 IST
మేడ్చల్: కైలాష్ హిల్స్‌లో అత్తింటి ఎదుట కోడలి ధర్నా
అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆందోళన
-
Jun 23, 2026 14:40 IST
రంగారెడ్డి: బాలాపూర్‌లో డాక్టర్ ఖాసిం ఆత్మహత్య
ఆస్పత్రిలో ఇంజక్షన్ తీసుకుని డాక్టర్ ఖాసిం సూసైడ్
ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి వల్లే ఖాసిం ఆత్మహత్య చేసుకున్నాడంటూ బంధువుల ఆరోపణ
-
Jun 23, 2026 14:39 IST
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం
హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్పు
BNS 103(1), 127(4), 127(6), 238 సెక్షన్ల కింద కేసు నమోదు
-
Jun 23, 2026 13:52 IST
మెట్రో విస్తరణ, స్వాధీనంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ఫలప్రదం
కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశాలు సక్సెస్
మెట్రో ఫేజ్-1 వాల్యూయేషన్, ఫేజ్-2 విస్తరణకు కన్సల్టెంట్‌గా 'SBICAPS' ఎంపిక
ఏకాభిప్రాయానికి వచ్చిన సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి
మెట్రో భవిష్యత్ కార్యాచరణకు సమన్వయ అధికారుల నియామకం

-
Jun 23, 2026 13:25 IST
స్టాలిన్‌ను గుర్తుకు తెస్తూ చేతితో సైగలు.. సీఎం విజయ్ వీడియో వైరల్
అంతా సెటిలైనట్టే అనేలా సీఎం విజయ్ సైగలు
స్టాలిన్ గతంలో చేసిన సైగలు రిపీట్ చేసిన సీఎం
నెట్టింట వీడియో వైరల్
-
Jun 23, 2026 13:21 IST
యూపీ: అయోధ్య రామమందిరం విరాళాల కేసులో సిట్ నివేదిక
యూపీ హోంశాఖ కార్యదర్శి సంజయ్ ప్రసాద్‌కు నివేదిక అందజేత
నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్న యూపీ సర్కార్
-
Jun 23, 2026 13:20 IST
పిల్లల కస్టడీ కేసులో పుణె కోర్టు కీలక తీర్పు
భర్త పట్ల బాధ్యతలు విస్మరించిన తల్లి.. పిల్లల సంరక్షణకు అనర్హురాలన్న కోర్టు
తల్లి వద్ద ఉంటే పిల్లలు భవిష్యత్తు సురక్షితం కాదన్న కోర్టు
ఓ కేసులో కుమారుడి కస్టడీని తండ్రికి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు
పిల్లల సంరక్షణ విషయంలో కేవలం 'తల్లి' అనే హోదా ఒక్కటే సరిపోదు: కోర్టు
భర్త, అత్తమామల పట్ల క్రూరంగా ప్రవర్తించే తల్లికి పిల్లల కస్టడీ ఇవ్వలేం: కోర్టు
-
Jun 23, 2026 13:19 IST
నంద్యాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
భారీ వర్షానికి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నేలకొరిగిన భారీ వృక్షం
పార్క్ చేసి ఉన్న రెండు కార్లపై కూలిన చెట్టు
ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న వాహనాలు
వర్షం, ఈదురు గాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
-
Jun 23, 2026 13:11 IST
బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య
అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్ (55), ముత్తులక్ష్మీ (48), సుప్రియ (20) హత్య
హత్యల వెనుక పెద్ద కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడి హస్తం ఉన్నట్లు పోలీసుల అనుమానం
ప్రేమ వ్యవహారమే హత్యలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు
-
Jun 23, 2026 12:59 IST
అమరావతి: సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దూకుడు
సీఐ నాగరాజు నివాసానికి సిట్ అధికారులు
ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్న మద్దతుదారులు
మద్దతుదారులను చెదరగొట్టి లోపలికి వెళ్లిన అధికారులు
నాగరాజు ఇంటి దగ్గర భారీగా పోలీసు బలగాలు
-
Jun 23, 2026 12:33 IST
అమరావతి: పరవాడ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదం బాధాకరం: మంత్రి లోకేశ్
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేశ్
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం: లోకేశ్
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి లోకేశ్
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రి లోకేశ్
-
Jun 23, 2026 12:29 IST
హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం కాదు.. హిట్లర్ రాజ్యం: హరీశ్‌రావు
ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లు కాంగ్రెస్ కూలగొడుతోంది: హరీశ్‌రావు
హిట్లర్‌ను చూసి హైడ్రా ఏర్పాటు చేశామని అంటున్నారు: హరీశ్‌రావు
గతంలో ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ జరిగేది: హరీశ్‌రావు
రేవంత్ పాలన అంతా బ్లాక్ మెయిల్ పాలన: హరీశ్‌రావు
-
Jun 23, 2026 11:51 IST
మెదక్: రామాయంపేట వృద్ధురాలి మృతి కేసును ఛేదించిన పోలీసులు
బంగారు నగలు, డబ్బుల కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు విశాల్
కల్లులో నిద్రమాత్రలు కలిపి సాయమ్మ(65)ను చంపినట్లు వెల్లడి
గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను నమ్మించిన విశాల్
అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమారుడు శ్యామ్
స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్న విశాల్
ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
-
Jun 23, 2026 11:47 IST
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ వ్యాఖ్యలు
మేం అధికారంలోకి వచ్చి కొన్ని రోజులే అవుతోంది: విజయ్
అప్పుడే మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు: సీఎం విజయ్
మాకు సమయం ఇవ్వాలి: సీఎం విజయ్
కచ్చితంగా మా మార్పు చూపిస్తాం: సీఎం విజయ్
కేంద్రంతో సయోధ్యగానే ఉంటాం: సీఎం విజయ్
సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకిస్తాం: సీఎం విజయ్
-
Jun 23, 2026 11:45 IST
తమిళనాడు అసెంబ్లీలో వివాదం
సీఎం విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్
అవినీతికి పాల్పడినవారిని వదిలేది లేదన్న సీఎం విజయ్
సీఎం విజయ్ ప్రసంగాన్ని అడ్డుకున్న డీఎంకే సభ్యులు
ఆధారాలు బయటపెట్టాలన్న డీఎంకే
-
Jun 23, 2026 11:43 IST
ఢిల్లీ: కొలీజియం ఎంపిక ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యాయమూర్తుల ఎంపిక విధానం న్యాయ సమీక్షకు అతీతమన్న సుప్రీంకోర్టు
జడ్జీల నియామక ప్రక్రియ సమాచార హక్కు చట్టం కిందకు రాదన్న సుప్రీంకోర్టు
హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సీనియర్ జుడీషియల్ అధికారి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకుని కొత్త సమస్యలను కొనితెచ్చుకోలేమన్న సుప్రీంకోర్టు
-
Jun 23, 2026 11:34 IST
టీమిండియా జెర్సీ అందుకున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ
వీడియోను విడుదల చేసిన బీసీసీఐ
జెర్సీ నెంబర్-3తో బరిలోకి దిగనున్న వైభవ్
‘యూనివర్స్ బేబీ బాస్’గా అభిమానుల ప్రశంసలు
త్రోడౌన్ స్పెషలిస్టు రఘు చేతుల మీదుగా జెర్సీ స్వీకరణ
భారత జట్టు తరఫున ఆడాలన్న కలను నిజం చేసుకున్న యువ ఆటగాడు
-
Jun 23, 2026 11:33 IST
హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు ఇవీ
రూ.2,070 మేర తగ్గిన మేలిమి బంగారం ధర
24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,45,910
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,33,750
-
Jun 23, 2026 11:32 IST
మరింత ఖరీదవనున్న అమెరికా పౌరసత్వం
దరఖాస్తుదారులే ప్రాసెసింగ్, వెట్టింగ్ ఖర్చులు భరించేలా కొత్త నిబంధనలు
ఇమిగ్రేషన్ ఇతర లబ్ధి పథకాలు వర్తించవని ప్రతిపాదన తెచ్చిన ట్రంప్ సర్కార్
కొత్త నిబంధనలకు రూపకల్పన చేసిన ట్రంప్ కార్యవర్గం
వలసదారులపై మరింత పెరగనున్న ఆర్థిక భారం
-
Jun 23, 2026 10:25 IST
హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాలు
ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో తనిఖీలు
ఇల్లు, కార్యాలయాలతో పాటు 10 చోట్ల సోదాలు
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు
-
Jun 23, 2026 10:23 IST
అమరావతి: గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక సీసీటీవీ ఫుటేజ్ మాయం
మే 1 నుంచి జూన్ 1 మధ్య ఫుటేజ్ తొలగించినట్లు గుర్తింపు
నెలరోజుల రికార్డులో కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉన్నట్లు సిట్ గుర్తింపు
ఫుటేజ్ మాయంపై దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ అధికారులు
-
Jun 23, 2026 10:21 IST
హైదరాబాద్: గుడిమల్కాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం
ఫర్నిచర్ తయారీ కార్ఖానాలో చెలరేగిన మంటలు
మరో రెండు ఫర్నిచర్ దుకాణాలకు వ్యాపించిన మంటలు
నాలుగు ఫైరింజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
ఘటనాస్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షించిన ఏసీపీ తిరుపతి
-
Jun 23, 2026 10:09 IST
తిరుపతి జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం
ఉస్తికాయలపెంట అటవీ ప్రాంతంలో 13 ఏనుగుల గుంపు సంచారం
హెచ్చరికలు జారీ చేసిన అటవీ శాఖ
పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
-
Jun 23, 2026 10:07 IST
పాక్ ఉగ్ర చరిత్రపై అమెరికా సెనెటర్ల తీవ్ర వ్యాఖ్యలు
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిందని పాక్‌పై ఆరోపణలు
పాక్‌పై జేడీ వాన్స్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సెనెటర్లు
అమెరికా నిజమైన మిత్రులు ఎవరో గుర్తించాల్సిందని వ్యాఖ్య
వాన్స్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సెనెటర్లు రిక్ స్కాట్, టిమ్ షిహీ
-
Jun 23, 2026 10:03 IST
అణ్వాయుధాల్లో ప్రపంచాన్ని మించిపోవాలి: కిమ్ జోంగ్ ఉన్
అణుశక్తిని గణనీయంగా పెంచాలని ఆదేశాలు
వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్లీనరీలో కిమ్ కీలక వ్యాఖ్యలు
దేశ సార్వభౌమత్వ రక్షణకు అణ్వాయుధాలు కీలకమని కిమ్ వ్యాఖ్య
-
Jun 23, 2026 10:02 IST
కేంద్రమంత్రి జార్జి కురియన్ రాజీనామా
రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన విడుదల
-
Jun 23, 2026 09:58 IST
టెలిగ్రామ్ సేవలు మళ్లీ అందుబాటులోకి
నీట్ యూజీ రీ-టెస్ట్ సందర్భంగా తాత్కాలికంగా ఆంక్షలు
కేంద్రం విధించిన తాత్కాలిక బ్యాన్ ఎత్తివేత
మళ్లీ అందుబాటులోకి వచ్చిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్
-
Jun 23, 2026 09:55 IST
విశాఖ: భీమిలి మండలం చిట్టివలస కొత్తపేటలో ఆలయంలో చోరీ
కొత్తమ్మతల్లి ఆలయంలో చోరీ
అమ్మవారి ఆభరణాలు అపహరించిన దుండగులు
దర్యాప్తు చేపట్టిన భీమిలి పోలీసులు
-
Jun 23, 2026 09:54 IST
అమరావతి: పరవాడ కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా
ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం విచారం
జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం
ఇద్దరి మృతి, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారుల వెల్లడి
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్షించాలని పవన్ సూచన
విశాఖ పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఆదేశం
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
-
Jun 23, 2026 09:48 IST
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పరారీలో వ్యభిచార గృహం నిర్వాహకురాలు
బెడ్‌రూమ్‌లో స్పై కెమెరా గుర్తించిన పోలీసులు
రహస్య చిత్రీకరణపై అనుమానాలు
బ్లాక్‌మెయిల్, డబ్బు వసూళ్ల కోణంలోనూ విచారణ
ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం
మరింత నెట్‌వర్క్ ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 23, 2026 09:38 IST
ఏఐ వల్లే లేఆఫ్స్.. ఒరాకిల్ ధ్రువీకరణ
వార్షిక నివేదికలో సంస్థ వెల్లడి
2026 ఆర్థిక సంవత్సరంలో 21 వేల మందికి ఉద్వాసన
భవిష్యత్తులో మరిన్ని లేఆఫ్స్ తప్పవన్న సంస్థ
-
Jun 23, 2026 09:36 IST
నా మీద నాకే కోపం వచ్చింది: మెస్సి
ఆస్ట్రియాపై 2-0తో అర్జెంటీనా విజయం
ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్(18) కొట్టిన ఆటగాడిగా మెస్సి రికార్డు
ఆస్ట్రియాతో మ్యాచ్‌లో పెనాల్టీని వృథా చేసుకున్నా: మెస్సి
అప్పుడు నా మీద నాకే తీవ్రంగా కోపం వచ్చింది: మెస్సి
-
Jun 23, 2026 08:54 IST
నంద్యాల: కోవెలకుంట్ల గాంధీనగర్ సత్యనారాయణ స్వామి ఆలయంలో చోరీ
హుండీని దొంగిలించిన దుండగుడు
తలపై పెట్టుకుని హుండీ తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదు
సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 23, 2026 08:44 IST
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
సూర్యమణి, అదిల్ ఖాన్ అనే అంతర్‌రాష్ట్ర నిందితుల అరెస్ట్
దోపిడీ సమయంలో కాల్పులు జరిపిన సూర్యమణి
నిందితుల నుంచి పిస్తోల్, మ్యాగజైన్, బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం
కేసులో ఇప్పటివరకు మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
-
Jun 23, 2026 08:42 IST
మెదక్ జిల్లాలో పాత కక్షలతో వరుస హత్యలు
రెండు రోజుల్లో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు హత్య
సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ హత్య
ఆటోతో ఢీకొట్టి వెంబడించి దాడి చేసిన ప్రభాకర్, అతని స్నేహితులు
శ్రీధర్ హత్యకు ప్రతీకారంగా ప్రభాకర్ తండ్రి యాదగిరిని చంపిన శ్రీధర్ బంధువులు
యాదగిరి మృతదేహానికి బండరాయి కట్టి హల్దీ వాగులో పడేసిన శ్రీధర్ బంధువులు
మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
సూరారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు
తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు
-
Jun 23, 2026 08:12 IST
పల్నాడు జిల్లాలో వ్యక్తిపై కత్తితో దాడి
ముప్పాళ్ల మండలం ఎన్‌ఎస్‌పీ కాలువ వద్ద ఘటన
బైక్‌పై వెళ్తున్న రవికుమార్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగుల దాడి
తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు
నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వస్తుండగా ఘటన
డబ్బులు డిమాండ్ చేసిన దుండగులు
-
Jun 23, 2026 08:10 IST
అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం
నక్కపల్లి ఎంఆర్వో కార్యాలయం సమీపంలో ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు
కారులో నలుగురు ప్రయాణికులు
ఒక మహిళకు తీవ్ర గాయాలు, ముగ్గురికి స్వల్ప గాయాలు
క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఘటన
-
Jun 23, 2026 08:08 IST
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు
ఒప్పందం ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వార్నింగ్
ఆంక్షల సడలింపుతో నిధులు విడుదల చేసిన అమెరికా
ఆహార కొనుగోళ్లకే నిధులు వినియోగించాలని షరతు
-
Jun 23, 2026 08:07 IST
SIRకు వ్యతిరేకంగా నేడు హైదరాబాద్‌లో భారీ ర్యాలీ
ఉదయం 11 గంటలకు ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రదర్శన
ర్యాలీలో పాల్గొననున్న కాంగ్రెస్, టీజేఎస్, లెఫ్ట్ పార్టీల నేతలు
ర్యాలీగా BRK భవన్‌కు వెళ్లనున్న నేతలు
ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం అందజేయనున్న నేతలు
SIR పేరుతో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుట్ర చేస్తున్నాయని ఆరోపణ
ఓటు చోరీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపు
-
Jun 23, 2026 08:04 IST
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
ఉదయం 10:30 గంటలకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ
సమావేశంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణపై చర్చ
మెట్రో ఫేజ్-1 టేకోవర్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణ విడుదలపై చర్చించే అవకాశం
-
Jun 23, 2026 08:02 IST
సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దంచికొట్టిన వాన
ఆర్సీపురంలో 12.1 సెం.మీ భారీ వర్షపాతం నమోదు
బీహెచ్‌ఈఎల్‌లో 10.3 సెం.మీ వర్షపాతం
అమీన్‌పూర్‌లో 7.7 సెం.మీ వర్షం
పటాన్‌చెరులో 7.6 సెం.మీ వర్షపాతం నమోదు
-
Jun 23, 2026 08:00 IST
ఢిల్లీకి బయలుదేరిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న మంత్రులు
మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ
రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కోరనున్న మంత్రులు
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో చర్చలు నిర్వహించనున్న ఉత్తమ్, తుమ్మల
-
Jun 23, 2026 07:58 IST
ఫిఫా ప్రపంచ కప్: ఇరాక్‌ను చిత్తు చేసిన ఫ్రాన్స్
ఇరాక్‌పై 3-0 తేడాతో ఫ్రాన్స్ ఘన విజయం
రెండు గోల్స్‌తో అదరగొట్టిన ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె
దీంతో నాకౌట్‌కు చేరుకున్న ఫ్రాన్స్
-
Jun 23, 2026 07:57 IST
బాసర ఆలయ చోరీ ఘటనపై స్పందించిన ఈవో అంజనా దేవి
అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో ఇద్దరు దొంగలు ఆలయంలోకి ప్రవేశించినట్లు వెల్లడి
అమ్మవారి వెండి కిరీటం, హుండీ అపహరించారని వెల్లడి
బంగారు ముక్కుపుడక, పుస్తెలను ముట్టుకోలేదన్న ఈవో
అపహరణకు గురైన వెండి కిరీటం బరువు కిలో 22 గ్రాములు ఉంటుందని తెలిపిన ఈవో
-
Jun 23, 2026 07:54 IST
నిర్మల్: బాసర ఆలయానికి చేరుకున్న ఎస్పీ జానకి షర్మిల
ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ
చోరీ ఘటనపై ఆరా
ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతున్నట్లు వెల్లడి
-
Jun 23, 2026 07:52 IST
మహబూబాబాద్ జిల్లాలో మొసలి కలకలం
కేసముద్రం మండలం అర్పణపల్లిలో వ్యవసాయ బావిలో మొసలి గుర్తింపు
అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు
వలల సాయంతో మొసలిని బంధించిన స్థానికులు
గ్రామంలో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది
-
Jun 23, 2026 07:50 IST
కర్నూలులో నిండు గర్భిణి ఆత్మహత్యాయత్నం
భర్త వేధింపులతో మనస్తాపానికి గురైన మహిళ
చెరువులో దూకేందుకు ప్రయత్నించిన గర్భిణి
100కు కాల్ చేయడంతో అప్రమత్తమైన పోలీసులు
రాంజల చెరువు వద్దకు చేరుకుని మహిళను రక్షించిన కానిస్టేబుల్ పరశురాం
వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలింపు
తక్షణ స్పందనతో గర్భిణి ప్రాణాలు కాపాడిన త్రీ టౌన్ పోలీసులు
-
Jun 23, 2026 07:23 IST
అనకాపల్లి: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
నేడు తెల్లవారుజామున దక్షిణ్ ఎనర్జీలో చెలరేగిన మంటలు
ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన కార్మికులు
ఇద్దరు కార్మికులు మృతిచెందినట్టు సమాచారం
-
Jun 23, 2026 07:21 IST
తెలంగాణకు వారం రోజులపాటు వర్ష సూచన
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ
నిజామాబాద్ మినహా రాష్ట్రమంతటా రుతుపవనాల విస్తరణ
జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు
-
Jun 23, 2026 07:01 IST
నేడు ఉదయం 10:30కు ఏపీ కేబినెట్ సమావేశం
SIPB, CRDA నిర్ణయాలకు అమోదం తెలపనున్న కేబినెట్
పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ
రుషికొండ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం
-
Jun 23, 2026 07:00 IST
ఢిల్లీ: నేడు కేంద్ర మంత్రి ఖట్టర్‌తో తెలంగాణ సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ
ఉ.10:30కు ఖట్టర్‌తో సమావేశం కానున్న రేవంత్, కిషన్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 సహా పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్‌లపై చర్చించనున్న రేవంత్
-
Jun 23, 2026 07:00 IST
నేడు భద్రాద్రి జిల్లాలో BRS సింగరేణి పరిరక్షణ సభ
సాయంత్రం 6:00 గంటలకు కొత్తగూడెంలో సభ
పరిరక్షణ సభలో పాల్గొననున్న హరీశ్ రావు
బొగ్గు స్కామ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
-
Jun 23, 2026 06:58 IST
హైదరాబాద్: నేడు మియాపూర్‌లో కేటీఆర్ పర్యటన
శేరిలింగంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం
ఉదయం 11:00 గంటలకు కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్
-
Jun 23, 2026 06:57 IST
నేడు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్
పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం బంద్‌కు పిలుపు
23 వేల ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు కుట్ర: ఏబీవీపీ
-
Jun 23, 2026 06:55 IST
అమరావతి: నేడు CRDA రైతు పరిరక్షణ కమిటీ సమావేశం
కమిటీ నేతలు, రైతులతో సమావేశంకానున్న సజ్జల
ఉదయం 11:00 గంటలకు సమావేశం ప్రారంభం
భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం
-
Jun 23, 2026 06:54 IST
వన్డే ప్రపంచ కప్‌లో రో-కో ఆడతారు: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కైఫ్
రోహిత్ శర్మ, కోహ్లీ ఫిట్‌నెస్‌పై చర్చల నేపథ్యంలో మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
యువ ప్లేయర్లకూ గాయాలు అవుతాయి: కైఫ్
క్రికెట్‌పై ఉన్న తపన, నిబద్ధత రో-కోను ముందుకు నడిపిస్తాయి: కైఫ్
-
Jun 23, 2026 06:51 IST
ఢిల్లీ: నేడు 2026 పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం
మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌కు జ్ఞాపికలతో మంత్రి లోకేశ్ సత్కారం
ఇద్దరు సీనియర్ నటులకు పద్మశ్రీ అవార్డులు రావడం రాష్ట్రానికే గర్వకారణం: లోకేశ్
-
Jun 23, 2026 06:48 IST
తూ.గో.: రంగంపేట వద్ద రోడ్డు ప్రమాదం
టైరు పగలడంతో టాటాఏస్ బోల్తా, ముగ్గురి మృతి
ఎనిమిది మందికి గాయాలు, పెద్దాపురం ఆసుపత్రికి తరలింపు
బాపట్ల జిల్లా కొల్లూరుకు వెళ్లి వస్తుండగా ఘటన
మృతదేహాలను రాజమండ్రి జీజీహెచ్‌కు తరలింపు
-
Jun 23, 2026 06:47 IST
నిర్మల్ జిల్లా: బాసర జ్ఞానసరస్వతీ ఆలయంలో భారీ చోరీ
మహంకాళి ఆలయ తాళాలు పగులగొట్టిన దొంగలు
అమ్మవారి వెండి కిరీటం, హుండీ ఆపహరణ
అభిషేకం కోసం వెళ్లిన సమయంలో గుర్తించిన పూజారులు
పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆలయ అధికారులు