కొత్త పథకానికి పేరు సూచించండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:55 PM
హైదరాబాద్ నగరంలో క్యూర్ (ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతం) పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కొత్త పథకానికి మంచి పేరు సూచించిన వారికి రూ.లక్ష బహుమతి అందజేస్తామని బోర్డు ప్రకటించింది.
హైదరాబాద్: నగరంలో క్యూర్ (ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతం) పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త పథకానికి పేరు సూచించాలంటూ బోర్డు కోరుతోంది. మంచి పేరు సూచించిన వారికి రూ.1 లక్ష బహుమతి అందజేస్తామని ప్రకటించింది. ఈ పథకానికి ప్రజల నుంచే పేరు తీసుకోవాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 28 వరకూ సోషల్ మీడియా వేదికగా పోటీ నిర్వహించనున్నారు. tghd.official ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆసక్తి ఉన్న వారు లక్ష ఇళ్ల పథకానికి మంచి పేరు సూచించి బహుమతిని సొంతం చేసుకోండి మరి.
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో లక్ష ఇళ్ల ప్రాజెక్ట్..
క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఇళ్ల కేటాయింపును లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో పూర్తి మార్గదర్శకాలను కూడా సూచించనున్నారు. ఇందులో ప్రజలను భాగస్వాములుగా చేసేందుకు హౌసింగ్ బోర్డు.. ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇవి కూడా చదవండి...
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోండి.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు తుమ్మల విజ్ఞప్తి
Read Latest Telangana News And Telugu News