Share News

‘రేవంత్ అడిగారు.. నేను ఏర్పాటు చేశా’.. ఎక్స్‌లో కిషన్ రెడ్డి పోస్ట్

ABN , Publish Date - Jun 23 , 2026 | 03:10 PM

ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌తో రేవంత్ సమావేశమయ్యారు.

‘రేవంత్ అడిగారు.. నేను ఏర్పాటు చేశా’.. ఎక్స్‌లో కిషన్ రెడ్డి పోస్ట్
Union Minister Kishan Reddy

న్యూఢిల్లీ, జూన్ 23: ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి నిన్న(సోమవారం) కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో, ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌తో రేవంత్ సమావేశమయ్యారు. ప్రధానంగా హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణపైనే చర్చ జరిగింది. రేవంత్‌తో కలిసి కేంద్ర మంత్రులను కలవడంపై కిషన్‌ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.


కిషన్ రెడ్డి పోస్ట్...

‘కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు నాకు లేఖ రాశారు. 22వ తేదీన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో, 23వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయించాను. మెట్రో రైల్ విస్తరణపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా పనిచేస్తా’ అని ఎక్స్‌లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష

గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌‌పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోండి.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు తుమ్మల విజ్ఞప్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 03:34 PM