Share News

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు.. వైసీపీపై ఎంపీ సతీశ్ ఫైర్

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:19 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ సానా సతీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పెట్టిన సభ.. కాపు ఆత్మీయ సభ కాదని.. రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని విమర్శించారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు.. వైసీపీపై ఎంపీ సతీశ్ ఫైర్
MP Sana Satish

అమరావతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఎంపీ సానా సతీశ్ (MP Sana Satish) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పెట్టిన సభ.. కాపు ఆత్మీయ సభ కాదని.. రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని విమర్శించారు. ఈరోజు (మంగళవారం) వెలగపూడిలోని సచివాలయంలో ఎంపీ సానా సతీశ్ మీడియాతో మాట్లాడారు. నేరస్థులకు కులం రంగుపులమొద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారని అన్నారు. ఈ విషయాన్ని వక్రీకరించి జగన్ అండ్ కో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.


కాపులకు చంద్రబాబు ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఇచ్చారని.. జగన్ రెడ్డి తీసేశారని.. ఇప్పుడు వైసీపీ నేతలు ఈ విషయంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎంపీ సతీశ్ ఎద్దేవా చేశారు. కాపులపై జగన్‌కి నిజమైన ప్రేమ ఉందా..? అని ప్రశ్నించారు. కాకినాడ నడిబొడ్డులో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ రెడ్డి చెప్పలేదా..? అని నిలదీశారు. ప్రతి చిన్న విషయాన్ని జగన్ అండ్ కో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శవం వద్దకు వెళ్తే ఏ కులమని అడిగి మరీ రాజకీయం చేస్తారని వ్యంగ్యంగా అన్నారు. జగన్ హయాంలో కోనసీమలో కాపులను అరెస్ట్ చేస్తే తోట త్రిమూర్తులు ఎక్కడ ఉన్నారని ఎంపీ సానా సతీశ్ ప్రశ్నల వర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ABN ఎఫెక్ట్.. ఇంద్రకీలాద్రి నకిలీ టికెట్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం

నెల్లూరు ఏఎస్‌పేట దర్గా వివాదం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. వక్ఫ్‌కు లేఖ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 11:31 AM