Share News

అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని మహిళ ధర్నా

ABN , Publish Date - Jun 23 , 2026 | 03:14 PM

అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ మహిళ అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని ధర్నాకు దిగింది. మేడ్చల్ జిల్లా కైలాష్ హిల్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని మహిళ ధర్నా
Medchal Dowry Harassment Case

మేడ్చల్ జిల్లా: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్ హిల్స్‌లో ఓ మహిళ తన అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని ధర్నాకు దిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జయశ్రీ (25) అనే మహిళ తన భర్త, అత్తమామల వేధింపులు భరించలేక ఈ నిరసనకు దిగినట్లు తెలిపింది.


బాధితురాలి కథనం ప్రకారం, వివాహ సమయంలో రూ.10 లక్షల కట్నంతో పాటు ఐదు కిలోల వెండి, బంగారు ఆభరణాలు ఇచ్చినప్పటికీ, అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు నిరంతరం వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. అదనపు డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేయడమే కాకుండా, ఎదురు తిరిగి మాట్లాడితే మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.


అంతేకాకుండా, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ వ్యభిచారం చేస్తోందంటూ ముద్రవేసి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంది. ఈ విషయమై ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం శూన్యం అంటూ భర్త ఇంటిముందు బంధువులతో కలిసి ధర్నా దిగింది.


Also Read:

చికెన్‌ రెసిపీలకు వెల్లుల్లి పేస్ట్ మంచిదా.. తరిగిన వెల్లుల్లి మంచిదా?

భర్త బయటకు వెళ్లాక ఈ పనులు చేయకూడదట!

Updated Date - Jun 23 , 2026 | 03:14 PM