-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International and Breaking Live Updates of 5th May 2026 VK
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 05 , 2026 | 06:51 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 05, 2026 07:40 IST
మహబూబ్‌నగర్ జిల్లాలో అగ్నిప్రమాదం
బైపాస్ రోడ్డు వద్ద బ్యాంక్వెట్ హాల్లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు
బ్యాంక్వెట్ హాలు పూర్తిగా దగ్ధం
సమయానికి స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది
-
May 05, 2026 07:30 IST
నేటి నుంచి తెలంగాణలో మెగా రైతు మేళా
హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఈరోజు ప్రారంభం
ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
-
May 05, 2026 07:20 IST
అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు డిన్నర్ మీట్
తూర్పుగోదావరి జిల్లా నేతలతో పలు అంశాలపై సీఎం కీలక చర్చలు
రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యేలు
ఆయా సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశం
-
May 05, 2026 07:00 IST
దుబ్బాక: బలవంతపూర్‌లో ఓ ఇంట్లోకి దూరిన జింక
జింకపై దాడికి యత్నించిన కుక్కలు.. కాపాడిన గ్రామస్థులు
జింకను సురక్షిత ప్రాంతానికి తరలించిన అటవీశాఖ అధికారులు
-
May 05, 2026 06:50 IST
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
అమెరికా-ఇరాన్ చర్చలకు దారులు మూసుకుపోయిన వేళ ఉద్రిక్తత
UAEలోని పుజైరా ఎనర్జీ సైట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి
హోర్ముజ్‌కు ప్రత్యామ్నాయ మార్గమైన ఈ ప్రాంతంపై దాడులు
గ్లోబల్ మార్కెట్లలో మొదలైన ఆందోళనలు
త్వరలో శత్రువు పునాదులు పెకలిస్తామని IRGC హెచ్చరికలు
-
May 05, 2026 06:40 IST
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్
డ్రైవర్ సుబ్రహ్మణ్య కేసులో మరో కీలక పరిణామం
ఈ కేసులో సాక్షులను బెదిరించడంతో ఒకరోజు కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు
ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కస్టడీకి న్యాయస్థానం అనుమతి
-
May 05, 2026 06:30 IST
IPL: నేడు ఢిల్లీ క్యాపిటల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్
రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
-
May 05, 2026 06:20 IST
అనకాపల్లి జిల్లాలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన
నేడు పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి పర్యటన.
రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి వరకు జరిగే బైక్ ర్యాలీలో పాల్గొననున్న హోంమంత్రి
అనంతరం నక్కపల్లి మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద అధికారులతో సమీక్షా సమావేశం
మధ్యాహ్నం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత
హోంమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారుల ఏర్పాట్లు
-
May 05, 2026 06:10 IST
కుత్బుల్లాపూర్ బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం
మంటల్లో ఆరు ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా దగ్ధం...
ఒక్కో షాపులో రూ.3 లక్షల విలువ చేసే వస్తువులు ఉన్నట్లు సమాచారం
సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన నాలుగు ఫైర్ ఇంజన్లు
అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని పోలీసుల అనుమానం