-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy andhrapradesh Telangana National International breaking Live Updates of 10th August 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 10 , 2026 | 06:40 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Aug 10, 2026 21:23 IST
12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్
పార్లమెంట్‌కు డేటా సమర్పించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి
2018-19 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.48 లక్షల కోట్ల విలువైన రుణాలు రైటాఫ్
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.20,485 కోట్ల రుణాలు రైటాఫ్
ఇది బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను సరిచేసే అకౌంటింగ్ ప్రక్రియ మాత్రమే..
రైటాఫ్ చేసినా అప్పు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రుణగ్రహీతపై ఉంటుందన్న కేంద్ర మంత్రి
-
Aug 10, 2026 20:56 IST
మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు
విశాఖ, హైదరాబాద్ సహా 5 ప్రాంతాల్లో సోదాలు
వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ఆఫీస్ సహా..
డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ED తనిఖీలు
సోదాల్లో రూ.1.01 కోట్లు స్వాధీనం చేసుకున్న ED
ఆస్తి పత్రాలు, కీలక డిజిటల్ పరికరాలు సీజ్
సంస్థకు చెందిన 182 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
6 ఖరీదైన లగ్జరీ వాహనాలపై ఫ్రీజింగ్ ఆర్డర్లు
రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో..
రూ.2 వేల కోట్లకు పైగా సమీకరించినట్లు గుర్తింపు
పలు FIRలు, చార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ సోదాలు
-
Aug 10, 2026 20:54 IST
కేసీఆర్ కంటే రేవంత్ ప్రమాదకర ముఖ్యమంత్రి: ఎంపీ అర్వింద్
తమ్ముడి కోసం రేవంత్ అధికార దుర్వినియోగం చేస్తున్నారు
రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెస్రెట్ ఒక షెల్ కంపెనీ
ఈ కంపెనీకి రావిర్యాలలో భూములు కట్టబెట్టారు: అర్వింద్
రూ.202 కోట్ల భూమిని రూ.7 కోట్లకే ఇచ్చేశారు..
తక్షణమే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి: అర్వింద్
-
Aug 10, 2026 20:46 IST
సంగారెడ్డి: TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
2014లో ఓటమి తర్వాత హరీశ్‌రావు నాపై కుట్రలు చేశారు..
రాహుల్ సభ విజయంతో నాపై హరీశ్‌రావు కక్షగట్టారు: జగ్గారెడ్డి
నాపై కేసులు పెట్టించే కుట్రలు చేశారు..
నాపై కేసులు సాధ్యంకాదని పోలీసులు చెప్పారు..
చివరికి పాస్‌పోర్ట్ కేసులో ఇరికించి అరెస్టు చేశారు: జగ్గారెడ్డి
హరీశ్‌రావును నేను నిందించడం లేదు..
నేను ప్రతీకార రాజకీయాలు చేయను..
సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ కోసం మూడేళ్లు పోరాడా: జగ్గారెడ్డి
-
Aug 10, 2026 20:43 IST
ABN డిబేట్‌లో CJP(కాక్రోచ్ జనతా పార్టీ) ప్రతినిధి విజయ్ మల్లంగి
ఢిల్లీలో 40 రోజులపాటు ఉద్యమం చేశాం..
ప్రభుత్వ వైఖరి నిరంకుశంలా కనిపించింది..
చివరి వరకు మమ్మల్ని అణచివేయాలని చూశారు..
ఢిల్లీలో పోలీసులు గూండాల్లా వ్యవహరించారు: CJP ప్రతినిధి విజయ్
40 రోజులపాటు తీవ్ర ఇబ్బంది పెట్టారు..
ఉద్యమం తీవ్రరూపం దాల్చాక ప్రభుత్వం దిగొచ్చింది..
ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకోవాలి: CJP ప్రతినిధి విజయ్
-
Aug 10, 2026 20:41 IST
గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు విచారణ
గ్రూప్-1 విషయంలో ఏపీ హైకోర్టుకు సిట్ తుది నివేదిక
736 మంది అభ్యర్థుల జవాబు పత్రాల ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి: సిట్
9 మంది జవాబు పత్రాలను సెకండ్ ఒపీనియన్ కోసం పంపించాం..
ఇద్దరి నివేదికలు వచ్చాయి.. మరో ఏడుగురివి రావాల్సి ఉంది: సిట్
తదుపరి విచారణ సెప్టెంబర్ 1కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
-
Aug 10, 2026 20:38 IST
ముగిసిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి రంగం
మాతంగి అనురాధ భవిష్యవాణి
మీరు చేస్తున్న పూజలకు సంతోషమే: మాతంగి అనురాధ
ఎంత శాంతంగా ఉంటున్నానో అంత ఉగ్రరూపానికి తెస్తున్నారు..
అయినా నేను శాంతంగా ఉంటూ అందరినీ కాపాడుతున్నా
కడుపులో పెట్టుకుని మిమ్మల్ని కాపాడుతున్నా: మాతంగి అనురాధ
వర్షాలు రాకపోవడానికి మీరే కారణం..
ఒకచోట మునిగిపోతోంది మరొకచోట తేలిపోతోంది..
పాపాలు ఎక్కువైపోతున్నాయి: మాతంగి అనురాధ
కలికాలంలో జరగరానివి జరుగుతున్నాయి..
మంచి వాళ్ళకి మంచి.. చెడ్డవాళ్ళకి చెడు చేస్తున్నా..
పిల్లల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి: మాతంగి అనురాధ
-
Aug 10, 2026 20:35 IST
మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు ప్రభుత్వ అండ
బ్యాంకాక్ ఉద్యోగాల పేరుతో మయన్మార్‌లో చిక్కుకున్న యువత
యువకులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు: మంత్రి లోకేష్
బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు..
అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ భవన్ అధికారులకు ఆదేశం
-
Aug 10, 2026 19:51 IST
హైడ్రాపై టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
కోర్టు చెప్పినా హైడ్రా కమిషనర్ మారలేదన్న రాంచందర్‌రావు
కోర్టును తప్పుదోవపట్టిస్తూ కాలయాపన..
నాదర్‌గుల్‌లో ప్రభుత్వ భూమిని ఎందుకు పరిరక్షించడంలేదని ప్రశ్న
నాదర్‌గుల్ భూమిలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి..
హైడ్రాకు మజ్లిస్‌పై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: రాంచందర్‌రావు
-
Aug 10, 2026 19:47 IST
హరీశ్, కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్
గోదావరి నదీజలాల విషయంలో BRS తప్పుడు ప్రచారం..
కేంద్రంపై బురదజల్లాలని చూస్తున్నారు: ఎంపీ రఘునందన్
తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ..
కేటీఆర్, హరీశ్‌రావు అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు..
వచ్చే ఎన్నికల్లో BRSకు ప్రజలే బుద్ధి చెబుతారు..
ఓట్లు, సీట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టొద్దు: ఎంపీ రఘునందన్
-
Aug 10, 2026 19:44 IST
హనుమకొండ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో రసాభాస
కమలాపూర్ మండలం గూడూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ
BRS హయాంలో చేసిన అప్పులతోనే ఇబ్బందులు: పొంగులేటి
గత BRS ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన..
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు నిధులిచ్చి పూర్తిచేశామన్న పొంగులేటి
కేసీఆర్ హయాంలోనే పూర్తిచేశామని వాదించిన MLA కౌశిక్‌రెడ్డి
వేదికపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల పరస్పర నినాదాలు
-
Aug 10, 2026 19:40 IST
జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు
నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్..
పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో మీనాక్షి జూమ్ సమావేశం
ఒక్క కరీంనగర్‌లోనే లక్ష ఓట్ల తొలగింపు కుట్ర: మీనాక్షి
నేతలంతా అప్రమత్తంగా ఉండాలి: మీనాక్షి నటరాజన్
ఓటరు జాబితా వచ్చేవరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలి
అర్హులైనవారి ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి
పనిచేయని BLAలను తొలగించండి: మీనాక్షి నటరాజన్
ప్రతి ఎన్నికల్లో BLAల పాత్ర కీలకం: మీనాక్షి నటరాజన్
-
Aug 10, 2026 19:39 IST
మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా
4.21 లక్షలకుపైగా నమోదిత మత్స్యకారులకు ప్రమాద బీమా
18–70 ఏళ్ల మత్స్యకారులకు బీమా రక్షణ
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం
శాశ్వత సంపూర్ణ వైకల్యానికి రూ.5 లక్షలు బీమా
శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షల బీమా
మత్స్యకారులపై ప్రీమియం భారం లేకుండా..
60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెల్లింపు
-
Aug 10, 2026 19:36 IST
పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత
పోలవరం ఫేజ్-1 పూర్తికి మరో ఏడాది గడువు పెంపు
2021-26 మధ్య మొత్తం రూ.12,620.53 కోట్లు విడుదల
పోలవరం ఫేజ్-1కు సవరించిన అంచనా రూ.30,436.95 కోట్లు
సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపిన కేంద్రం
-
Aug 10, 2026 19:34 IST
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయహోదా లేదన్న కేంద్రం
ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో లేదన్న జల్‌శక్తి శాఖ
డీపీఆర్‌ను తెలంగాణకు తిప్పిపంపిన కేంద్రం
కృష్ణా జలాల వివాదం దృష్ట్యా అప్రైజల్ సాధ్యం కాదన్న కేంద్రం
రాజ్యసభలో కేంద్రమంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం
-
Aug 10, 2026 19:30 IST
మార్కాపురంలో మెగా DSC-2025 టీచర్ల ర్యాలీ
గడియార స్తంభం నుంచి దోర్నాల బస్టాండ్ వరకు ర్యాలీ
DSCపై వైసీపీ తప్పుడు ప్రచారం, రాజకీయం చేయడం..
మంచి పద్ధతి కాదంటూ ఉపాధ్యాయుల నినాదాలు.
కష్టపడి చదువుకుని DSCలో ఉద్యోగాలు సాధించాం: టీచర్లు
-
Aug 10, 2026 19:28 IST
విజయవాడ: యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్‌పై విచారణ
15 రోజులు కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్, ఈనెల 14న తీర్పు
-
Aug 10, 2026 19:27 IST
శ్రీకాకుళం: సీదిరి అప్పలరాజు కస్టడీ కోరుతూ పిటిషన్
4 రోజుల కస్టడీ కోరుతూ పలాస కోర్టులో పిటిషన్ వేసిన పోలీసులు
-
Aug 10, 2026 19:25 IST
కరెంట్, వాటర్, గ్యాస్, కొరియర్, లాజిస్టిక్స్ సంస్థలకు 1601 నెంబర్ సిరీస్
1601 నెంబర్ల నుంచి సర్వీస్ కాల్స్ మాత్రమే అనుమతి
1601 నెంబర్లతో ప్రమోషనల్ కాల్స్‌కు అనుమతి నిరాకరణ
మోసపూరిత కాల్స్‌ను అరికట్టడమే 1601 సిరీస్ లక్ష్యం
90 రోజుల్లో 1601 సిరీస్‌కు మారాలని ట్రాయ్ ఆదేశం
-
Aug 10, 2026 19:23 IST
తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ
తెలంగాణలో 73,95,954 ఓట్లు ఔట్
తెలంగాణలో 3,38,26,448 మంది ఓటర్లు
2,64,30,494 ఓటర్ల ఎన్యూమరేషన్ పూర్తి
తెలంగాణలో 78.14% డిజిటలైజేషన్
డిజిటలైజేషన్ చివరి స్థానంలో హైదరాబాద్(58.58%)
డిజిటలైజేషన్ టాప్‌లో యాదాద్రి భువనగిరి(94.3%)
ఎల్లుండి అధికారిక ప్రకటన విడుదల చేయనున్న CEO
ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా
నెల రోజులపాటు అభ్యంతరాలు స్వీకరణ
అక్టోబర్ 19న ఓటర్ల తుది జాబితా విడుదల
-
Aug 10, 2026 18:26 IST
హైదరాబాద్: నకిలీ కాల్ సెంటర్ల నెట్‌వర్క్‌ను ఛేదించిన TG CSB
ఢిల్లీలో మూడు కాల్ సెంటర్ల ద్వారా ముఠా సైబర్ మోసాలు
21 మంది మహిళా టెలికాలర్లు, బ్యాంక్ ఖాతాదారుల అరెస్టు
అరెస్టయిన టెలికాలర్లంతా తెలంగాణ వాసులుగా గుర్తింపు
బజాజ్ ఫైనాన్స్ సంస్థ పేరిట ఆకర్షణీయ రుణాల మంజూరు ఆఫర్లతో మోసాలు
లోన్ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్ ఫీజులు..
బీమా ప్రీమియం పేరుతో డబ్బు వసూళ్లు
ఢిల్లీలోని శివ మార్కెట్‌లో 3 కాల్ సెంటర్లు ఏర్పాటు
పరారీలో నిర్వాహకులు లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్
-
Aug 10, 2026 18:17 IST
పోలీసుల నిఘా వైఫల్యంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానన్న ఏపీ మంత్రి టీజీ భరత్
కర్నూలులో రౌడీలు రెచ్చిపోతుంటే పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని వ్యాఖ్య
వైసీపీ నాయకులు రౌడీషీటర్లతో టీడీపీ కార్యకర్తలను హత్య చేయిస్తున్నారన్న భరత్
టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యకు పోలీసుల నిఘా వైఫల్యమే కారణమని మండిపాటు
త్వరలోనే సీఎం చంద్రబాబును కలసి ఫిర్యాదు చేస్తానని వెల్లడి.
-
Aug 10, 2026 17:51 IST
గోవింద నామాలతో వైసీపీ పేరడీ.. పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం
నెల్లూరులో వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమ తీరును ఖండించిన పవన్
ఈ వ్యవహారంపై చట్టప్రకారం ముందుకెళ్లాలని పార్టీ నేతలకు పవన్ దిశానిర్దేశం
వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉందన్న పవన్
దైవ నామాలు, కీర్తనలను అపహాస్యం కోసం వాడే విధానాన్ని విడిచిపెట్టాలని పవన్ సూచన
-
Aug 10, 2026 17:43 IST
దిగుమతి సుంకం పెంచడంతో బంగారం, వెండి, ప్లాటినం ద్వారా రూ.10వేల కోట్ల ఆదాయం
మే 13 - ఆగస్టు 2 మధ్య కస్టమ్స్ డ్యూటీ రూపంలో రూ.10,463 కోట్లు వసూలైనట్లు చెప్పిన కేంద్రం
పార్లమెంట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖిత పూర్వక సమాధానం
ఇటీవల 6 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి సవరించిన కేంద్రం
-
Aug 10, 2026 17:01 IST
విశాఖ: వచ్చే 3 గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు వర్షాలు, పిడుగుపాటు హెచ్చరికలు
విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందన్న ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ
శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి
-
Aug 10, 2026 16:15 IST
మధ్యప్రదేశ్ వరదల్లో కొట్టుకుపోయిన వ్యాను, ఏడుగురి మృతి
రాజ్‌గఢ్ జిల్లా సారంగపూర్ దగ్గర వంతెన దాటుతుండగా ఘటన
మృతుల్లో మహిళ సహా ఇద్దరు చిన్నారులు
ప్రమాదంలో మరో ఇద్దరు గల్లంతు, ఇద్దరు సురక్షితం
మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోన్న భారీ వర్షాలు
-
Aug 10, 2026 16:07 IST
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎల్.ఖియాంగ్టే అరెస్ట్
ఎల్.ఖియాంగ్టేను నేడు అరెస్టు చేసిన జార్ఖండ్ సీఐడీ అధికారులు
జేపీఎస్‌సీ 14వ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన కేసులో అరెస్టు
జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సీఐడీ అధికారులు
-
Aug 10, 2026 16:06 IST
ఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
విద్యార్థులపై పోలీసు చర్యలపైనా మాట్లాడతాం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు: కేంద్ర మంత్రి
-
Aug 10, 2026 15:32 IST
నాగార్జునసాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల మహా వరుణయాగం
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, పాడిపంటలతో విలసిల్లాలని కాంక్షిస్తూ యాగం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయ్‌విహార్ ప్రాంగణంలో యాగ క్రతువు
మధ్యాహ్నం పూర్ణాహుతి హోమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
తెల్లవారుజామున ఆదిపూజతో యాగ క్రతువును ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ దంపతులు
యాగ క్రతువులో మంత్రులు కోమటిరెడ్డి, సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు
-
Aug 10, 2026 15:10 IST
చైనాను వణికిస్తున్న 'డాల్ఫిన్' తుపాను.. సురక్షిత ప్రాంతాలకు 10లక్షల మంది తరలింపు
చైనాలో భారీ వర్షాలు, ఈదురు గాలుల బీభత్సం
జెజియాంగ్ ప్రావిన్స్‌లో 1,500కు పైగా తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు
షాంఘైలో గత 24 గంటల వ్యవధిలో 313 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
150 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారుల వెల్లడి
వందకు పైగా వీధులు జలమయం.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచన
-
Aug 10, 2026 15:03 IST
ఫేక్ వెబ్‌సైట్లతో జాగ్రత్త! చందాదారులకు EPFO సూచన
సమాచారాన్ని తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు నకిలీ లింక్‌లను సృష్టిస్తున్నారని హెచ్చరిక
నకిలీ లింకులు, ఈ-మెయిల్స్‌ను క్లిక్ చేయొద్దని వినతి
అకౌంట్ లాగిన్ అయ్యే ముందు సైట్ యూఆర్‌ఎల్ స్పెల్లింగ్ లేదా డొమైన్ పేర్లను తనిఖీ చేయాలని సూచన
ఈపీఎఫ్‌ఓ ఇటీవల సిస్టమ్ అప్‌గ్రెడేషన్ చేపట్టిన క్రమంలో పెరిగిన ఆన్‌లైన్ ఈపీఎఫ్‌ఓ సేవల వినియోగం
-
Aug 10, 2026 14:56 IST
హోర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి
నౌకలో పెద్ద ఎత్తున మంటలు
దాడికి గురైంది ఏ దేశానికి చెందిన నౌక, సిబ్బంది భద్రతపై వివరాలు తెలియాల్సి ఉంది.
హోర్మూజ్‌లోని జల మార్గాలపై ఒమన్‌తో అమెరికా చర్చలు జరుపుతున్న వేళ దాడులు
-
Aug 10, 2026 14:44 IST
జార్ఖండ్: రాంచీలో అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత
అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల యత్నం
విద్యార్థులను అడ్డుకుని పోలీసులు లాఠీచార్జి
లాఠీచార్జ్‌లో పలువురు విద్యార్థులకు గాయాలు
పోటీ పరీక్షల్లో అక్రమాలకు నిరసనగా విద్యార్థుల మార్చ్
-
Aug 10, 2026 14:23 IST
లోక్‌సభ: ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు ఆమోదం
మూజువాణి ఓటుతో బిల్లుకు లోక్‌సభ ఆమోదం
విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లుకు ఆమోదం
లోక్‌సభ రేపటికి వాయిదా
-
Aug 10, 2026 14:17 IST
వైసీపీ మన రాష్ట్రానికి దౌర్భాగ్యం: సీఎం చంద్రబాబు
జగన్ పర్యటనలో ఆ పార్టీ కేడర్ స్వైరవిహారం చేస్తున్నారు: చంద్రబాబు
రోడ్లపైకి వచ్చి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు
రౌడీలకు సింహస్వప్నంగా ఉంటా: సీఎం చంద్రబాబు
మెగా డీఎస్సీపై రాద్ధాంతం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు
టీచర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా?: చంద్రబాబు
-
Aug 10, 2026 14:11 IST
ఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలపై చర్చకు అమిత్ షా సిద్ధం: కిరణ్ రిజిజు
ఆందోళనలపై లోక్‌సభలో ప్రకటన చేయనున్న అమిత్ షా
విద్యార్థుల నిరసనలపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న అమిత్ షా
అమిత్ షా మాట్లాడేందుకు సమయం కేటాయించిన స్పీకర్
-
Aug 10, 2026 13:58 IST
ఏలూరు: కలిదిండిలో సీఎం చంద్రబాబు పర్యటన
మీ భూమి-మీ హక్కులో పాల్గొన్న చంద్రబాబు
తహశీల్దార్ ఆఫీస్‌లో రైతులతో చంద్రబాబు ముఖాముఖి
సుపరిపాలనే మా మొదటి ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు
-
Aug 10, 2026 13:39 IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం
రెండేళ్లపాటు వడ్డీ లేకుండా రూ.50 వేల లోన్
క్వింటా పొగాకుకు రూ.1000 ప్రోత్సాహం
పొగాకు కొనుగోలు చేసిన 9 రోజుల్లో రైతు ఖాతాల్లో జమ
-
Aug 10, 2026 13:35 IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన టీడీపీ ఎంపీలు
అమరావతి నిర్మాణ పురోగతిపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ అమిత్ షాకు అందజేసిన ఎంపీలు
-
Aug 10, 2026 13:35 IST
జార్ఖండ్: రాంచీలో అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత
అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల యత్నం
విద్యార్థులను అడ్డుకుని పోలీసుల లాఠీఛార్జి
లాఠీఛార్జిలో పలువురు విద్యార్థులకు గాయాలు
-
Aug 10, 2026 13:14 IST
రంగారెడ్డి: గుప్త నిధుల పేరుతో భారీ మోసం
గుప్త నిధుల ముఠా గుట్టురట్టు చేసిన శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్
నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులకు వంచన
ముందుగానే గుంతల్లో బొగ్గు, నకిలీ బంగారు నాణేలు పెట్టిన నిందితులు
11 మందిని మోసం చేసి రూ.కోటి వరకు వసూలు చేసిన ముఠా
-
Aug 10, 2026 13:11 IST
ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధం పొడిగింపు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో కీలక నిర్ణయం
కీలక ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగులపై నిషేధం అక్టోబర్ 3 వరకు పొడిగింపు
SIR పూర్తయ్యే వరకు కీలక అధికారుల బదిలీలకు బ్రేక్
-
Aug 10, 2026 13:04 IST
ఏపీలో ఎస్పీల బదిలీ, పోస్టింగ్
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(NC)గా ఎన్.వి.రామాంజనేయులు
తక్షణమే అమల్లోకి బదిలీ, పోస్టింగ్ ఉత్తర్వులు
ప్రస్తుతం SP(NC), వెయిటింగ్‌లో ఉన్న ఎన్.వి.రామాంజనేయులు
విజిలెన్స్ విభాగంలో SP (NC)/RV&EOగా రామాంజనేయులు నియామకం
ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులో రామాంజనేయులుకు పోస్టింగ్
-
Aug 10, 2026 12:56 IST
ఏపీ PPP పాలసీ–2026ను విడుదల చేసిన ప్రభుత్వం
స్వర్ణాంధ్ర విజన్–2047కు అనుగుణంగా భారీ పెట్టుబడులే లక్ష్యం
పలు రంగాల్లో PPP ప్రాజెక్టులకు ప్రాధాన్యం
ప్రస్తుతం ఏపీలో రూ.1.23 లక్షల కోట్ల PPP ప్రాజెక్టుల పైప్‌లైన్
2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల స్టేట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) కేటాయింపు
-
Aug 10, 2026 12:41 IST
కర్నూలు: YCP రాజకీయ హత్యలకు పాల్పడుతోంది: మంత్రి టీజీ భరత్
ఇంతియాజ్ వైసీపీ భూ కబ్జాలను బయటపెట్టారు: మంత్రి భరత్
పథకం ప్రకారమే ఇంతియాజ్‌ను హత్య చేశారు: టీజీ భరత్
-
Aug 10, 2026 12:37 IST
లాఠీఛార్జిపై హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలి: కాంగ్రెస్
ప్రకటన వచ్చేవరకు పార్లమెంట్‌లో డెడ్‌లాక్ కొనసాగుతుంది: ప్రియాంక గాంధీ
ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును ప్రవేశపెట్టొద్దన్న ప్రియాంక
ప్రజా వ్యతిరేక బిల్లులపై ఆందోళనలు తప్పవని ప్రియాంక గాంధీ హెచ్చరిక
-
Aug 10, 2026 12:33 IST
ఢిల్లీ ఘటనపై పార్లమెంట్‌కు అమిత్ షా రావాలి: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
కాల్పులపై సుప్రీం పర్యవేక్షణలో విచారణ చేయాలి: రాహుల్
యువతులు, మైనర్లు గాయపడ్డారు: రాహుల్
అమిత్ షా సమాధానం చెప్పాల్సిందే: రాహుల్
-
Aug 10, 2026 12:32 IST
జార్ఖండ్: రాంచీలో ఉద్రిక్తత
అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల యత్నం
రాంచీలో అసెంబ్లీ దగ్గర బారికేడ్ల ఏర్పాటు
బారికేడ్లు తొలగించేందుకు విద్యార్థుల యత్నం
భారీగా పోలీసుల మోహరింపు
-
Aug 10, 2026 12:31 IST
ఇప్పటికీ అక్కడే 20 యుద్ధనౌకలు.. యూఎస్ వార్నింగ్
హోర్ముజ్ దిగ్బంధనాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్న యూఎస్
తమ నావికులు పహారా కాస్తున్నారని వెల్లడి
-
Aug 10, 2026 12:31 IST
పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
విపక్షాల ఆందోళనతో సభ వాయిదా
-
Aug 10, 2026 12:30 IST
హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షం
పలు జిల్లాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం
-
Aug 10, 2026 12:27 IST
రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ CEO పోస్టుకు 18 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్
ట్రస్ట్ సీఈవో నియామకం కోసం రేపు, ఎల్లుండి అయోధ్యలోనే ఇంటర్వ్యూలు
జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్, సురేశ్ హావారేల ప్యానెల్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక
-
Aug 10, 2026 12:15 IST
గాంధీనగర్: గుజరాత్ సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం
సెక్రటేరియట్ బేస్‌మెంట్‌లో ప్రమాదం, రికార్డు రూంలో ఫైల్స్ దగ్ధం
-
Aug 10, 2026 12:14 IST
ఏలూరు: కలిదిండి చేరుకున్న సీఎం చంద్రబాబు
మీ భూమి-మీ హక్కులో పాల్గొననున్న చంద్రబాబు
తహశీల్దార్ ఆఫీస్‌లో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
-
Aug 10, 2026 12:08 IST
హైదరాబాద్: గాంధీ మార్చురీలో ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
ప్రియాంక మృతదేహం కుటుంబసభ్యులకు అప్పగించనున్న పోలీసులు
గద్వాల జిల్లా అయిజ మండలంలో ప్రియాంక అంత్యక్రియలు
ప్రియాంక అంత్యక్రియల్లో పాల్గొననున్న మంత్రులు వాకిటి శ్రీహరి, టీజీ భరత్
-
Aug 10, 2026 12:03 IST
గుంటూరు: టొబాకో బోర్డు కార్యాలయంలో పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
టొబాకో బోర్డు అధికారులు, పొగాకు పండించే ప్రాంతాల ఎమ్మెల్యేలతో మంత్రి అచ్చెన్న సమావేశం
ప్రస్తుతం కొనసాగుతున్న పొగాకు కొనుగోళ్లు, మార్కెట్ పరిస్థితులపై సమగ్ర సమీక్ష
-
Aug 10, 2026 11:56 IST
ఢిల్లీ: కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
షరియా చట్టం పరిధిలోనే ముస్లిం వివాహాలు: కర్ణాటక హైకోర్టు
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నా ముస్లిం వివాహాలకు షరియా చట్టమే వర్తిస్తుంది: హైకోర్టు
-
Aug 10, 2026 11:50 IST
మాతృ భాష పవిత్రమైంది: తమిళనాడు సీఎం విజయ్
తమిళం భాష మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం: విజయ్
తమిళ్ తాయి వాళ్తును తప్పనిసరి చేస్తూ తీర్మానం
-
Aug 10, 2026 11:48 IST
ఢిల్లీ: పార్లమెంట్ బయట విపక్షాల ఎంపీల ఆందోళన
మకర ద్వారం దగ్గర ఇండియా కూటమి ఎంపీల నిరసన
నిరసనలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్
అమిత్ షా సమాధానం చెప్పాలని ఎంపీలు ప్లకార్డుల ప్రదర్శన
-
Aug 10, 2026 11:31 IST
లోక్‌సభ సమావేశాలు ప్రారంభం
లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా
-
Aug 10, 2026 11:29 IST
నేడు సుప్రీంకోర్టులో రామ మందిరం విరాళాల కేసు విచారణ
విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై CBI విచారణ జరిపించాలని పిటిషన్
పిటిషన్‌పై CJI జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ
యూపీ ప్రభుత్వం సిట్ ఫోరెన్సిక్ నివేదికను చేర్చాలని గత విచారణలో సుప్రీంకోర్టు ఆదేశం
-
Aug 10, 2026 11:23 IST
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు
ఉత్తరాఖండ్‌లో 4.2 తీవ్రతతో కంపించిన భూమి
ఉత్తరకాశీలో 1:21 గంటలకు కంపించిన భూమి
పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
-
Aug 10, 2026 11:20 IST
లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ
భారత్ మ్యాప్‌పై లవ్లీనా అభ్యంతరం తెలపడంపై ప్రశంసలు
లవ్లీనా చర్యను కొనియాడిన ప్రధాని మోదీ
దేశం గుర్తుంచుకునే విషయమన్న మోదీ
గ్లాస్గో ఘటనపై లవ్లీనా స్పందనకు ప్రశంస
లవ్లీనా ధైర్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ
-
Aug 10, 2026 11:08 IST
షమీకి మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కీలక సూచన
భారత సెలెక్టర్ల ఆలోచనల్లో షమీకి చోటు లేదు: జహీర్ ఖాన్
అయినా షమీ ప్రయత్నాలు ఆపకుండా అత్యుత్తమ ప్రదర్శన కొనసాగించాలి: జహీర్
ఎప్పుడైనా జాతీయ జట్టు నుంచి పిలుపు అందొచ్చు: జహీర్
-
Aug 10, 2026 10:57 IST
జార్ఖండ్‌లో కీలక దశకు చేరుకున్న విద్యార్థుల నిరసన
పేపర్ లీక్ ఉదంతంపై చర్యలకు విద్యార్థుల డిమాండ్
అసెంబ్లీ వరకూ విద్యార్థుల ర్యాలీ ప్రారంభం
వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు
తమ డిమాండ్స్‌పై ప్రభుత్వం స్పందించాలని తేల్చి చెప్పిన స్టూడెంట్స్
-
Aug 10, 2026 10:49 IST
ప్రధాని మోదీని కలిసిన కామన్‌వెల్త్ పతక విజేతలు
పతకాలు సాధించిన క్రీడాకారులతో ప్రధాని ముఖాముఖి
మెరుగ్గా ఆడిన వాళ్లే రాణిస్తారు: ప్రధాని మోదీ
-
Aug 10, 2026 10:29 IST
గాయాలు ఆటలో భాగమే: వీవీఎస్ లక్ష్మణ్
యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై స్పందించిన వీవీఎస్ లక్ష్మణ్
జట్టు విరామ సమయాల్లోనూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి: లక్ష్మణ్
-
Aug 10, 2026 10:21 IST
పొలంలో రూ.5 లక్షలు పాతిపెట్టిన రైతుకు షాక్
కుటుంబ సభ్యులకు దొరక్కుండా దాచేందుకు ప్రయత్నం
పాతిపెట్టిన నోట్లకు పురుగులు పట్టడంతో భారీగా నష్టం
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో వెలుగు చూసిన ఘటన
-
Aug 10, 2026 10:03 IST
మేడ్చల్: శ్రీ చైతన్య హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ
కామారెడ్డికి చెందిన విద్యార్థి అభిషేక్‌పై 10 మంది విద్యార్థుల దాడి
దాడి తర్వాత మెట్ల పైనుంచి కిందపడిన అభిషేక్
తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన స్కూల్ మేనేజ్‌మెంట్
కామారెడ్డి ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం
-
Aug 10, 2026 10:03 IST
వరంగల్: నర్సంపేటలో ఉద్రిక్తత
మెడికల్ కాలేజీ దగ్గర పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు BRS నేతల యత్నం
అనుమతి లేదని విగ్రహం తొలగించిన అధికారులు
-
Aug 10, 2026 10:02 IST
ఢిల్లీ: JPSC ఎగ్జామ్‌లో అవకతవకలపై ED కేసు నమోదు
మనీలాండరింగ్ యాక్ట్ కింద ED కేసు
JPSC సభ్యుడు అజిత్ భట్టాచార్యను నేడు ప్రశ్నించనున్న ED
నిన్న పదవికి రాజీనామా చేసిన అజిత్ భట్టాచార్య
-
Aug 10, 2026 09:55 IST
చెన్నై: గిండి ప్రాంతంలో ప్రమాదానికి గురైన సంగీత దర్శకుడు AR రెహ్మాన్ కుమారుడు అమీన్ కారు
అమీన్‌కు స్వల్ప గాయాలు
-
Aug 10, 2026 09:52 IST
లండన్ పర్యటనలో మంత్రి నారాయణ
అమరావతిలో నిర్మించే ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చ
-
Aug 10, 2026 09:47 IST
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన డీసీపీ కుమార్తెకు సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఎంతో భవిష్యత్తు ఉన్న అఫిఫా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం: సీఎం
ఎండీ అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా: సీఎం చంద్రబాబు
-
Aug 10, 2026 09:16 IST
నేడు పార్లమెంట్‌లో 4 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, 'కేరళ' రాష్ట్ర పేరు మార్పు బిల్లు, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
-
Aug 10, 2026 09:09 IST
కర్నూలు జిల్లా: తుంగభద్ర జలాశయంలో కొనసాగుతున్న వరద
పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 1625.82 అడుగులు
ఇన్ ఫ్లో 43,022 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,757 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు, ప్రస్తుతం 79.201 టీఎంసీలు
-
Aug 10, 2026 09:08 IST
నంద్యాల: శ్రీశైలం జలాశయానికి కొసాగుతున్న వరద నీరు
ఇన్ ఫ్లో 43,580 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 9,200 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 878.60 అడుగులు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
-
Aug 10, 2026 08:52 IST
తెలంగాణలో 73 లక్షల 95 వేల 954 ఓట్లు ఔట్?
తెలంగాణలో నేటితో ముగియనున్న SIR ప్రక్రియ
ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,38,26,448
రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదు
-
Aug 10, 2026 08:51 IST
సూర్యాపేట: నూతనకల్ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన దిమ్మెను ఢీకొన్న కారు
మంటలు వ్యాపించండంతో కారు దగ్ధం
ప్రయాణికులకు తప్పినముప్పు
హైదరాబాద్ నుంచి మరిపెడ బంగ్లా వైపు వెళ్తండగా ఘటన
-
Aug 10, 2026 08:40 IST
టీమ్ఇండియా బంగ్లాదేశ్ టూర్‌కు కేంద్రం అనుమతి కోరనున్న BCCI
గతేడాది బిజీ షెడ్యూల్ కారణంగా బంగ్లాదేశ్ టూర్ వాయిదా
ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 15 వరకు టీమ్ఇండియా పర్యటన
బంగ్లా టూర్‌లో భాగంగా 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న భారత్
-
Aug 10, 2026 08:28 IST
మంచిర్యాల: శ్రీరాంపూర్‌లో గ్యాంగ్‌వార్
పాత కక్షలతో రెండు వర్గాల మధ్య ఘర్షణ
కత్తులు, కర్రలతో ఇరువర్గాల మధ్య దాడులు
8 మంది యువకులకు తీవ్ర గాయాలు
పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు
-
Aug 10, 2026 08:24 IST
నేడు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో DGP సీవీ ఆనంద్ పర్యటన
కర్రెగుట్టల్లో 29 కి.మీ. రోడ్డు నిర్మాణం పూర్తి
రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ పామునూరు నుంచి డోలీ వరకు రోడ్డు నిర్మాణం
కర్రెగుట్టలను పరిశీలించనున్న DGP సీవీ ఆనంద్
-
Aug 10, 2026 08:12 IST
DGP సీవీ ఆనంద్‌కు CBI మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఈ-మెయిల్
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు CBCIDకి బదిలీ చేయాలి: మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
కేసును CBCID లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలి: నాగేశ్వరరావు
ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్‌పై కీలక ప్రశ్నలు లేవనెత్తిన నాగేశ్వరరావు
పోష్ చట్టం కింద అంతర్గత విచారణ పూర్తికాకముందే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్న
-
Aug 10, 2026 08:00 IST
నెల్లూరు: చేజర్ల మండలం చిత్తలూరు వద్ద రోడ్డు ప్రమాదం
ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ రహంతుల్లా (46) మృతి
-
Aug 10, 2026 07:48 IST
హైదరాబాద్: కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు
శంషాబాద్‌కు చెందిన వాహనంగా గుర్తింపు
మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం
కేసు నమోదు చేపట్టిన దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు
-
Aug 10, 2026 07:34 IST
హైదరాబాద్: హైదర్‌షాకోట్‌లో హిట్ అండ్ రన్
మితిమీరిన వేగంతో వచ్చి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ఢీకొట్టిన కారు
కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి
ఆ తర్వాత బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టిన కారు, ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రమాదం తర్వాత కారును వదిలి పరారైన నలుగురు యువకులు
-
Aug 10, 2026 07:26 IST
అస్సాం వరదల్లో 100కు చేరిన మృతుల సంఖ్య
వరదలతో 1.4 లక్షల మంది ప్రజలకు కష్టాలు
-
Aug 10, 2026 07:11 IST
సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ప్రియాంక మృతదేహం
మార్చురీలో ప్రియాంక మృతదేహాన్ని భద్రపరచిన కిమ్స్ వైద్యులు
ఇప్పటికే రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రాజమండ్రి పోలీసులు
కిమ్స్ హాస్పిటల్లో శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించనున్న పోలీసులు
-
Aug 10, 2026 07:06 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం పసిడి ధరలు ఇవీ
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,640
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,250
-
Aug 10, 2026 07:03 IST
తెలంగాణలో నేటితో ముగియనున్న SIR ప్రక్రియ
రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు
ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్
-
Aug 10, 2026 07:00 IST
నేడు నాగార్జునసాగర్‌లో సీఎం రేవంత్ 'వరుణ యాగం'
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ప్రత్యేక యాగం
ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై ఉండకూడదని ఆకాంక్ష
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగం నిర్వహణ
108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో మహాయాగం
-
Aug 10, 2026 06:59 IST
సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు
సౌదీలోని జజాన్‌లో అరామ్‌కో చమురు కేంద్రంపై హూతీల దాడులు
తమ గగనతలంలోకి సౌదీ డ్రోన్లు చొరబడినందుకే ప్రతీకార దాడులున్న హూతీలు
యెమెన్‌లోని మోఖా పోర్టుపై హూతీ రెబెల్స్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు
-
Aug 10, 2026 06:57 IST
ఇరాన్ యుద్ధం నుంచి తప్పుకునేందుకు ట్రంప్ యత్నం
అణు ఒప్పందం లేకున్నా హోర్ముజ్‌ను తెరిస్తే చాలనుకుంటున్న ట్రంప్
అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ చర్యలు
యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి నౌకా దిగ్బంధం ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్
అమెరికా సైన్యాన్ని గల్ఫ్ నుంచి ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్
ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికాపై ఇజ్రాయెల్ ఒత్తిడి
-
Aug 10, 2026 06:57 IST
నేడు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్‌లో ట్రయల్ రన్
విజయవంతమైన తర్వాత గ్రిడ్‌కు అనుసంధానం
ఆరేళ్ల తర్వాత ఎడమగట్టు నాలుగో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి
-
Aug 10, 2026 06:56 IST
విజయవాడ: స్రబ్బర్స్ మార్కెటింగ్ మోసం కేసుపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేసిన విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు
క్రైమ్ DCP తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో సిట్ దర్యాప్తు
స్రబ్బర్స్ మార్కెటింగ్ పేరుతో వేలాదిమంది నుంచి కోట్ల రూపాయల వసూళ్లు
-
Aug 10, 2026 06:49 IST
హైదరాబాద్: బాలాపూర్ RCI రోడ్డులో కారు బీభత్సం
పలువురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికుల ఆరోపణ
కారులోని మద్యం బాటిళ్లు స్వాధీనం
డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Aug 10, 2026 06:48 IST
ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం
కోస్తా, రాయలసీమలో వారం రోజులు వర్షాలు
-
Aug 10, 2026 06:48 IST
నేడు విద్యార్థుల జార్ఖండ్ విధానసభ మార్చ్
పోటీ పరీక్షల్లో అక్రమాలకు నిరసనగా మార్చ్ నిర్వహణ
-
Aug 10, 2026 06:47 IST
నేడు మెడికో ప్రియాంక అంత్యక్రియలు
గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాన్‌పూర్‌లో అంత్యక్రియలు
-
Aug 10, 2026 06:47 IST
నేడు లోక్‌సభ ముందుకు ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు
జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో బిల్లు
-
Aug 10, 2026 06:46 IST
నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
కలిదిండిలో రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్న చంద్రబాబు
-
Aug 10, 2026 06:46 IST
నేడు మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభ
సంస్మరణ సభకు హాజరుకానున్న కేటీఆర్, హరీశ్ రావు
మెడికల్ కాలేజీ దగ్గర విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు
-
Aug 10, 2026 06:45 IST
నేటి నుంచి SIRపై మీనాక్షి నటరాజన్ సమీక్షలు
నాలుగు రోజుల పాటు సమీక్షలు జరపనున్న మీనాక్షి
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహణ
SIR పురోగతిపై కీలక అంశాలను పరిశీలించనున్న మీనాక్షి
నేడు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష