Share News

బ్రిటన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్ నుంచి బి-1 బాంబర్లు వెనక్కి.. భద్రతా ముప్పుతో కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 05 , 2026 | 10:29 AM

బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్ ఫేర్‌ఫోర్డ్ వైమానిక స్థావరం నుంచి అమెరికా తన బి-1 బాంబర్లను వెనక్కి రప్పించింది. స్థావరంపై ఉగ్రదాడి కుట్ర ఆరోపణలు, సరికొత్త భద్రతా ముప్పు నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

బ్రిటన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్ నుంచి బి-1 బాంబర్లు వెనక్కి.. భద్రతా ముప్పుతో కీలక నిర్ణయం
US B1 Bombers

US B1 Bombers RAF Fairford బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్ ఫేర్‌ఫోర్డ్ (RAF Fairford) వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కుట్ర పన్నుతున్నారనే అనుమానాల నేపథ్యంలో అమెరికా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ మోహరించిన తన దూర శ్రేణి బి-1 బాంబర్లన్నింటినీ అమెరికాలోని తమ స్వంత మిలిటరీ బేస్‌లకు ఉపసంహరించుకున్నట్లు యూఎస్ సైనిక అధికారులు ధ్రువీకరించారు.


ఈ వైమానిక స్థావరంపై ఇరాన్ మద్దతు ఉన్న ముఠా దాడికి యత్నించిందనే కోణంలో విచారణ జరుగుతున్న వేళ, సరికొత్త భద్రతా ముప్పు తలెత్తడంతో ఈ తరలింపు చేపట్టినట్లు సమాచారం. ఆర్‌ఏఎఫ్ ఫేర్‌ఫోర్డ్‌లో ఉన్న బి-1 బాంబర్లను రీజియన్‌లోని ఇతర స్థావరాలకు కాకుండా నేరుగా అమెరికాకే తరలించడం చాలా అరుదైన చర్యగా రక్షణ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.