Share News

మత్స్య సంపదకు అపార నష్టం

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:41 AM

మండలంలోని రాజయ్యపేట, బోయపాడు తీరాల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవున వందల సంఖ్యలో అనేక రకాల చేపలు మృత్యువాత పడి శనివారం కనిపించాయి. తీరం పొడవునా గుట్టలుగా చేపలు చనిపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు హెటెరో, అటు డెక్కన్‌ రసాయన పరిశ్రమలు శుద్ధి చేయని రసాయన వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలేయడం వల్లే తరచూ మత్స్యసంపద నాశనమవుతోందని ఆరోపిస్తున్నారు. సంధువాలు, కాకిపరిగలు, కానాగడతలు, గుమ్మడిపారలు, తదితర రకాల చేపలు మృతి చెందాయి. విషయం తెలిసి సీఐ జె.మురళి, ఎస్‌ఐ సాహిబా అంజుమా ఈ తీర ప్రాంతాల్లో పర్యటించి మృత్యువాత పడిన మత్స్య సంపదను పరిశీలించారు.

	మత్స్య సంపదకు అపార నష్టం
బోయపాడు తీరం ఒడ్డున మృత్యువాత పడిన వందలాది చేపలు

- రాజయ్యపేట, బోయపాడు తీరాల్లో వందలాది చేపల మృత్యువాత

- రసాయన పరిశ్రమల కాలుష్యం వల్లేనని మత్స్యకారుల ఆరోపణ

- సమగ్ర విచారణ జరపాలని అధికారులకు హోం మంత్రి అనిత ఆదేశం

నక్కపల్లి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజయ్యపేట, బోయపాడు తీరాల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవున వందల సంఖ్యలో అనేక రకాల చేపలు మృత్యువాత పడి శనివారం కనిపించాయి. తీరం పొడవునా గుట్టలుగా చేపలు చనిపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు హెటెరో, అటు డెక్కన్‌ రసాయన పరిశ్రమలు శుద్ధి చేయని రసాయన వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలేయడం వల్లే తరచూ మత్స్యసంపద నాశనమవుతోందని ఆరోపిస్తున్నారు. సంధువాలు, కాకిపరిగలు, కానాగడతలు, గుమ్మడిపారలు, తదితర రకాల చేపలు మృతి చెందాయి. విషయం తెలిసి సీఐ జె.మురళి, ఎస్‌ఐ సాహిబా అంజుమా ఈ తీర ప్రాంతాల్లో పర్యటించి మృత్యువాత పడిన మత్స్య సంపదను పరిశీలించారు.

సమగ్ర విచారణకు హోం మంత్రి ఆదేశం

స్థానిక మత్స్యకారులు ,టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి కొప్పిశెట్టి వెంకటేశ్‌ ఈ విషయాన్ని హోం మంత్రి అనిత దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిని ఆమె సీరియస్‌గా తీసుకుని సమగ్ర విచారణ జరపాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని, ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని హోం మంత్రి తెలిపారు.

ఆర్డీవో పరిశీలన

కలెక్టర్‌ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఆర్డీవో వీవీ రమణ రాజయ్యపేట, బోయపాడు తీరాల్లో పర్యటించారు. మృత్యువాత పడిన చేపలను పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో చర్చించారు. కాగా కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ అధికారులు సముద్ర జలాల శాంపిల్స్‌ సేకరించారు.

Updated Date - Jun 21 , 2026 | 12:41 AM