విద్యుత్‌ కోత ఉక్కబోత

ABN , First Publish Date - 2023-05-14T00:21:30+05:30 IST

విద్యుత్‌ కోతలతో పల్లె ఉక్కిరి బిక్కిరవుతోంది. పల్లెవాసులు కంటి మీద కనుకు లేని రాత్రుళ్లు గడుపుతున్నారు.

	విద్యుత్‌ కోత ఉక్కబోత

కంటి మీద కునుకు లేని పల్లెజనం

కరెంటుకు లోటు లేదు..

లోడ్‌తోనే సమస్యన్న అధికారులు

మౌలిక వసతులతోనే పరిష్కారం

ఆ దిశగా కదలని ప్రభుత్వం

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

విద్యుత్‌ కోతలతో పల్లె ఉక్కిరి బిక్కిరవుతోంది. పల్లెవాసులు కంటి మీద కనుకు లేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ప్రతి రోజు రాత్రి వేళల్లో కనీసంగా నాలుగు గంటలపాటు విద్యుత్‌ కోతలు అమలు జరుగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు అంచనా లేకపోవడం వల్లే సంక్షోభం ఏర్పడింది. విద్యుత్‌ లోడ్‌ అధికమైంది. ఫలితంగా కోతలు ప్రారంభమయ్యాయి. ఓ వైపు విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతోంది. మరోవైపు సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయలేక చేతులెత్తోస్తోంది. పల్లెలకు కోత విధిస్తోంది. డెల్టా పరిధిలో భీమవరం, ఉండి, ఆకివీడు, నరసాపురం తదితర ప్రాంతాల్లో ఇటువంటి సమస్య అధికంగా ఉంది. పెంటపాడు, తణుకు, ఆకివీడు తదితర మండలాల్లో కోతలు అమలు చేస్తున్నారు. గడచిన నాలుగు రోజుల నుంచి సమస్య ఉత్పన్నమైంది. ఒక్కసారి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో విద్యుత్‌ వినియోగం అధికమైంది. దానికి తగ్గట్టుగా సబ్‌స్టేషన్‌లు సిద్ధంగా లేకపోవడంతో కోతలు తప్పని సరి అవుతోంది. వాస్తవానికి విద్యుత్‌ కోటా జిల్లాకు అధికంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకేసారి వినియోగం పెరగడం వల్లే ఫీడర్‌లకు మరమ్మతులు ఎదురవుతున్నాయి. దీనివల్ల కోతలు తప్పడం లేదంటూ అధికారులు వివరిస్తున్నారు. గతంలో ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఏమీ ఉండేవి కాదు. ప్రస్తు త ప్రభుత్వ హయాంలోనే కోతలు అమలు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గృహ వినియోగానికి ఎనిమి ది మిలియన్‌ యూనిట్లు కేటాయిస్తున్నారు. అదే ఆక్వా రంగా నికి ఐదు మిలియన్‌ యూనిట్‌లు, వ్యవసాయ రంగానికి ఐదు మిలియన్‌ యూనిట్‌ల వంతున సరఫరా చేస్తున్నారు. మిగిలిన మూడు యూనిట్లు పారిశ్రామిక రంగానికి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కోటా ప్రకారం 23 మిలియన్‌ యూనిట్లు సరఫ రా కావాలి. అంత మొత్తం అవసరం లేదని జిల్లా విద్యుత్‌ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఒకేసారి లోడ్‌ అధికమైతే విద్యుత్‌ శాఖలో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులపై భారం పడి సరఫ రాకు అంతరాయం ఏర్పడుతోంది. ఫీడర్‌లు దెబ్బ తింటున్నాయి. ఫలితంగా సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నారు.

వర్షాలతో ధీమా

ఇటీవల కురిసిన వర్షాలకు అధికారుల్లోనూ ధీమా ఏర్పడింది. వేసవిలో విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని ముందస్తు అంచనాతో ఉంటారు. అందుకు తగ్గట్టుగానే విద్యుత్‌ సరఫరా, వినియోగంపై అంచనా వేస్తున్నారు. లోటు ఉన్నట్టయితే కోత లు విధిస్తారు. లేదంటే విద్యుత్‌ కోటా పెంచి సరఫరా చేస్తుం టారు. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణం చల్లబడి, విద్యు త్‌ వినియోగం తగ్గింది. మరోవైపు వ్యవసాయ అవసరాలు తీరి పోయాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు మిలియన్‌ యూనిట్‌లు వినియోగం అవుతుండేది. వ్యవసాయ అవసరాలు తీరిపోవడంతో మూడు మిలియిన్‌ యూనిట్లు మాత్రమే విని యోగిస్తున్నారు. అయినా సరే కోతలేంటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ సరఫరా ఉంది. లోటంటూ లేదు. అయినా సరఫరాలో అంతరాయం తప్పడం లేదు. నాలుగు రోజుల నుంచి ఉష్ణోగ్రతల పెరిగాయి. ఒకేసారి విద్యుత్‌ భారం పెరగడంతో ఫీడర్లు దెబ్బ తింటున్నా యి. సబ్‌స్టేషన్‌లలో మరమ్మతులు చేపట్టాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే జనం మాత్రం వేసవిలో ఇటువంటి ఇబ్బందులు కొనసాగుతాయని ఆందోళన చెందుతున్నారు.

అదనపు భారం

విద్యుత్‌ కోతలతో జనంపై అదనపు భారం పడుతోంది. ఇన్వేటర్‌లపై పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కోతలంటూ లేవు. నిత్యం సరఫరా ఉండేది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ తొలి రోజుల్లో విద్యుత్‌ సమస్య ఉండేది కాదు. ఇటీవల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఇన్వర్టర్ల వ్యాపారం జోరందుకుంది. మూడు రోజుల నుంచి విపరీతంగా అమ్ముడుపోయాయి. ఒక్కో ఇన్వటర్‌ రూ.17 వేలవుతోంది. ఇది కూడా అదనపు భారంగానే జనం పరిగణిస్తున్నారు. విద్యుత్‌ శాఖలో లోడింగ్‌ను తట్టుకోవాలంటే అదనంగా సబ్‌ స్టేషన్‌లు నిర్మించాలి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇటువంటి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో అదనంగా సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి విద్యుత్‌ శాఖ ప్రణాళిక చేసింది. ప్రభు త్వం అనుమతితో కేటాయిస్తారు. వాటిని నిర్మించినప్పుడే లోడ్‌ పెరిగినా ఇబ్బందులు ఉండవు. సక్రమంగా సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేక పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అమ్మో.. ఎండ

45 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత

భీమవరం, మే 13 : ఎండ పెళ్లుమన్నది.. ఒక్కసారిగా నాలుగు డిగ్రీలకు పెరిగిపోయి 45 డిగ్రీలకు చేరుకుంది. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు మబ్బులు వానలతో వాతావరణం కొనసాగింది. తరువాత కాస్త మార్పు చెందింది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పెరిగింది. ఉక్కబోతతో ఇబ్బందికర వాతావ రణం ఏర్పడింది. మొన్నటి వరకు 30–36 డిగ్రీలు కొనసాగిన వాతావరణం ఒక్కసారిగా 10 డిగ్రీలకు అదనంగా నమోదైం ది. దీంతో తేమ శాతం పెరిగి.. ఉక్కబోతగా మారింది. జనం ఉక్కిరి బిక్కిరయ్యారు. అధిక ఉష్ణోగ్రత వాతావరణంతో ఉద యం 10 గంటలకే వేడకలు వేయటం మొదలు పెట్టాయి. బయట తిరిగే వారు ఉక్కిరిబిక్కిరవటం ప్రారంభించారు. తొలుత 40 డిగ్రీలు నమోదై మధ్యాహ్నానికి 45 డిగ్రీలకు చేరింది. సాయత్రం ఆరు గంటలకు కూడా 42 డిగ్రీలు కొన సాగటం గమనార్హం. ఉష్ణోగ్రతలకు అత్యవసర పనులుంటే తప్ప జనాలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు. నిమ్మ సోడా, జ్యూస్‌లు, మజ్జిగ, కొబ్బరి బొండాలతోపాటు ఇతర శీతల పానీయాలు సేవిస్తూ ఉపశమనం పొందారు. రాను న్న రెండు రోజుల్లో మరో ఒక డిగ్రీ పెరిగి 46కు చేరుతుం దని వాతావరణ శాఖ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

నిర్మానుష్యంగా రహదారులు

మొగల్తూరు, మే 13 : ఉదయం ఎనిమిది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపడంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చేందుకు భయపడిపోతున్నారు. శనివారం ఉదయం పది గంటలకే మొగల్తూరులోని జాతీయ రహదారితోపాటు నిత్యం రద్దీగా ఉండే స్థానిక గాంధీ బొమ్మల సెంటర్‌ నిర్మానుష్యంగా మారింది. వ్యాపారాలు లేక వ్యాపారస్తులు దుకాణాలు మూసివేశారు. ఎండలతోపాటు వేడి గాలులు బలంగా వీశాయి. సాయంత్రం ఐదు గంటలు తర్వాత జనం రోడ్డుపైకి వచ్చారు. ఈ నెల 25 నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానుండడంతో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-05-14T00:21:30+05:30 IST