Share News

రష్యా డ్రోన్‌ దాడి.. ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌ ధ్వంసం

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:36 AM

ఉక్రెయిన్‌లోని సుమీలో ఉన్న అతి పెద్ద ఫార్మా ప్లాంట్‌ రష్యా డ్రోన్‌ దాడిలో ధ్వంసం అయ్యింది. దాడిలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

రష్యా డ్రోన్‌ దాడి.. ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌ ధ్వంసం

  • ఒకరి మృతి.. రూ.400 కోట్ల ఆస్తి నష్టం

న్యూఢిల్లీ, అక్టోబరు 4 : ఉక్రెయిన్‌లోని సుమీలో ఉన్న అతి పెద్ద ఫార్మా ప్లాంట్‌ రష్యా డ్రోన్‌ దాడిలో ధ్వంసం అయ్యింది. దాడిలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఫార్మా ప్లాంట్‌లోని ప్రధాన నిర్మాణం డ్రోన్‌ దాడితో పూర్తిగా ధ్వంసమయ్యిందని, గాయపడిన వారి సంఖ్య మరింత పెరగవచ్చని ఉక్రెయిన్‌ అధికారులు చెప్పారు. ప్లాంట్‌కు రూ. 400 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. భారత్‌కు చెందిన కుసుమ్‌ గ్రూప్‌నకు చెందినది ఈ ఫార్మా ప్లాంట్‌. రాజీవ్‌ గుప్తా ఈ సంస్థను నడుపుతున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ దాడిని ఖండించారు. గత వేసవి నుంచి ఉక్రెయిన్‌పై దాడులకు రష్యా జెట్‌ ఇంజిన్‌తో నడిచే వేగవంతమైన షాహిద్‌ డ్రోన్లను ప్రయోగిస్తోంది. తక్కువ వేగంతో నడిచే ఉక్రెయిన్‌ ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్లు వీటిని అడ్డుకోలేకపోతున్నాయి.

Updated Date - Oct 05 , 2026 | 05:37 AM