Share News

ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే: కెనడా పీఎం మార్క్ కార్నీ

ABN , Publish Date - Jan 28 , 2026 | 08:16 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య ఇటీవల వాణిజ్యపరమైన ఉద్రిక్తత నడుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ హెచ్చరికలపై కార్నీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాటల్లో నిజం లేదని కెనడా ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే: కెనడా పీఎం మార్క్ కార్నీ
Trade tensions rise as Donald Trump and Canad

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Mark Carney) మధ్య మాటల యుద్దం నడుస్తోంది. దావోస్ మీటింగ్‌లో ట్రంప్.. కెనడాపై వంద శాతం దిగుమతి సుంకాల(Import duties)ను విధిస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ట్రంప్, కార్నీ మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. కార్నీ.. దావోస్ ప్రకటనలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్(Scott Bessant) ఒక న్యూస్ ఛానల్‌ ద్వారా వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కెనడా ప్రధాన మంత్రి తీవ్రంగా స్పందించారు.


జనవరి 27న ఒట్టావా(Ottawa)లో విలేకరుల సమావేశంలో కార్నీ మాట్లాడుతూ.. ‘ట్రంప్‌తో జరిగిన ఫోన్ కాల్‌లో ఉక్రెయిన్, వెనెజువెలా, ఆర్కిటిక్ భద్రత, కెనడా - చైనా వాణిజ్య ఒప్పందం వంటి అంశాల గురించి చర్చించాం. మా దేశ వ్యూహం, చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడుకున్నాం. నేను దావోస్‌లో ఏం చెప్పానో దానికే కట్టుబడి ఉన్నాను. ఇదే విషయాన్ని ఆయనకు(ట్రంప్) స్పష్టం చేశాను’ అని అన్నారు.

కాగా.. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి కార్నీ ‘ప్రధాన శక్తుల ఒత్తిడి ఎదుర్కోవడానికి ప్రపంచంలోని అన్ని శక్తులు ఏకం కావాలన్నారు. అప్పటి నుంచి ట్రంప్ - కార్నీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నేనూ భారతీయ పౌరుడినే.. ఓసీఐ కార్డును ప్రదర్శించిన ఆంటోనియో కోస్టా

భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

For More National News And Telugu News

Updated Date - Jan 28 , 2026 | 10:45 AM