Share News

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను ముద్దాడిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేఖ్ హమ్దాన్

ABN , Publish Date - Oct 03 , 2026 | 08:31 PM

ఆసుపత్రిలో కోలుకుంటున్న ఫ్లైదుబాయ్ భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేఖ్ హమ్దాన్ స్వయంగా పరామర్శించారు. స్మిత్ తమ బృందంలో భాగం కావడం గర్వకారణమన్నారు.

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను ముద్దాడిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేఖ్ హమ్దాన్
sheikh hamdan visits smith machchar

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ షేఖ్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ Sheikh Hamdan Smith Machchar స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి, గాయాలతో కోలుకుంటున్న ఫ్లైదుబాయ్ భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను పరామర్శించారు. అధికారిక X ఖాతాలో స్మిత్ మచ్చార్ ధైర్యాన్ని, ప్రజల ప్రాణ రక్షణ కోసం ఆయన చూపిన నిబద్ధతను కొనియాడుతూ ఓ సందేశం షేర్ చేశారు.


'అత్యున్నత స్థాయి ధైర్యాన్ని, బాధ్యతను, మనుష్యుల ప్రాణాల పట్ల అపారమైన శ్రద్ధను చాటుకున్న ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను పరామర్శించిన సందర్భంగా... మా తరఫున, మా దేశ నాయకత్వం తరఫున ఆయనకు మా పూర్తిస్థాయి ప్రశంసలు, అభినందనలు. ఆయన మా బృందంలో ఒక భాగంగా ఉండటం, మా దేశ ప్రయాణంలో భాగస్వామి కావడం, యూఏఈ దేనికైతే ప్రతీకగా నిలుస్తుందో అంటే.. కరుణ, శాంతి, మానవత్వానికి నిదర్శనంగా ఉండటం మాకు ఎంతో గర్వకారణం.' ప్రిన్స్ తన సందేశంలో పేర్కొన్నారు.


అంతర్జాతీయ సత్కారం: మిడ్-ఎయిర్ ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చార్ వీరత్వానికి యూఏఈ అగ్రనాయకత్వం అందించిన గొప్ప గౌరవమిది.

మానవత్వానికి ప్రాధాన్యం: తమ దేశం (UAE) కరుణ, శాంతి, మానవ విలువలకు ఇచ్చే ప్రాధాన్యతను కెప్టెన్ స్మిత్ మచ్చార్ తన చర్యల ద్వారా నిరూపించారని షేఖ్ హమ్దాన్ కొనియాడారు.

ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, ఇజ్రాయెల్ ప్రధాని, అనేక మంది ప్రముఖులు కూడా స్మిత్ మచ్చార్ సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని ప్రశంసించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 08:57 PM