ఆసియా క్రీడలకు ఘనమైన ముగింపు.. భారత్‌కు 85 పతకాలు..
ABN , Publish Date - Oct 03 , 2026 | 06:30 PM
జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 85 పతకాలతో తన ప్రస్థానాన్ని ముగించింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 85 పతకాలతో తన ప్రస్థానాన్ని ముగించింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. అక్టోబర్ 3న పురుషుల హాకీ జట్టు స్వర్ణం గెలవడంతో భారత్ పతకాల సంఖ్య 85కు చేరింది. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1తో మలేషియాను ఓడించింది. ఈ విజయంతో భారత్‌కు 21వ స్వర్ణం దక్కింది (Asian Games 2026 India medals).
2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో భారత్ 106 పతకాలు సాధించింది. ఈసారి మొత్తం పతకాల సంఖ్య 21 తగ్గింది. సెప్టెంబర్ 30 నాటికి భారత్ కేవలం 10 స్వర్ణాలతో తొలి పది స్థానాల్లో కూడా లేదు. అయితే చివరి రెండు రోజుల్లో భారత క్రీడాకారులు వరుసగా పతకాలు సాధించారు. హాకీ, క్రికెట్, ఆర్చరీ, బాక్సింగ్, రెజ్లింగ్‌లో భారత్‌కు కీలక విజయాలు లభించాయి. చివరి రెండు రోజుల్లోనే భారత్ 11 స్వర్ణాలు సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ తొలి ఐదు స్థానాల్లోకి చేరింది (India medal tally 2026).
ఈ క్రీడల్లో భారత్ 21 స్వర్ణ పతకాలు, 27 రజత పతకాలు, 37 కాంస్య పతకాలు సాధించింది (Asian Games India medal winners). దీంతో ఐచి-నగోయా ఆసియా క్రీడల్లో భారత్ నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. తొలి మూడు స్థానాల్లో చైనా (340), జపాన్ (266), దక్షిణ కొరియా (149) ఉన్నాయి. 70 పతకాలతో ఉజ్బెకిస్థాన్ ఐదో స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ
కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..