Share News

‘ఆనాటి కరెంట్ కోతల రోజులను తిరిగితెచ్చారు’.. హరీశ్ రావు తీవ్ర విమర్శలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 07:26 PM

రాష్ట్రంలో ఉచిత, నాణ్యమైన కరెంట్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘ఆనాటి కరెంట్ కోతల రోజులను తిరిగితెచ్చారు’.. హరీశ్ రావు తీవ్ర విమర్శలు
Harish Rao

హైదరాబాద్, అక్టోబర్ 03: రాష్ట్రంలో ఉచిత, నాణ్యమైన కరెంట్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'ఆనాటి మంచి రోజులను తిరిగితెస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజంగానే ఆనాటి చీకటి రోజులను, విద్యుత్ కోతలను పునరావృతం చేశారు' అని 'ఎక్స్' (X) వేదికగా ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా పక్కన పెడితే, కనీసం రోజుకు 6 గంటల నాణ్యమైన విద్యుత్ కూడా ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన విమర్శించారు.


వర్షాభావం లేదా ఎల్‌నినో పరిస్థితులను సాకుగా చూపి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందని, కానీ నీళ్లు, కరెంట్ లేక పొలాల్లో పంటలు ఎండిపోతుంటే రైతుల వేదనను ఎవరు పట్టించుకుంటారని హరీశ్ రావు ప్రశ్నించారు. విద్యుత్ కోతలకు నిరసనగా మెదక్ జిల్లా రామాయంపేట సబ్‌స్టేషన్ ముందు రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగాల్సిన దుస్థితి వచ్చిందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 'రేవంత్ రెడ్డి గారూ..! పరిపాలన అంటే కేవలం మైకుల ముందు నిలబడి ఉపన్యాసాలు దంచడం కాదు, కష్టాల్లో ఉన్న అన్నదాతకు అండగా నిలవడం' అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడలకు ఘనమైన ముగింపు.. భారత్‌కు 85 పతకాలు..

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

Updated Date - Oct 03 , 2026 | 07:26 PM