Share News

హోతీలకు యెమెన్ ప్రభుత్వానికి మధ్య తీవ్ర ఘర్షణలు.. 81 మంది మృతి

ABN , Publish Date - Sep 04 , 2026 | 08:51 PM

హోతీలకు, యెమెన్ ప్రభుత్వ దళాలకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 81 మృతి చెందారు.

హోతీలకు యెమెన్ ప్రభుత్వానికి మధ్య తీవ్ర ఘర్షణలు.. 81 మంది మృతి
Houthis Clash

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ అండగా ఉన్న హోతీలకు, సౌదీ మద్దతున్న యెమెన్ ప్రభుత్వ దళాలకు ఈరోజు(శుక్రవారం) తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 81 మంది మృతి చెందారు. కొన్ని రోజులుగా రెడ్ సీ దక్షిణ భాగంలో ఉన్న బాబ్-అల్-మందబ్ జలసంధి ప్రాంతాన్ని హోతీలు ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు హింసాత్మకంగా మారాయి. పరస్పర దాడుల్లో తమ సైనికులు 24 మంది మరణించినట్టు ఓ మిలిటరీ అధికారి అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. యెమెన్‌లోని టైజ్ సమీపంలో మరో 15 మంది సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అలాగే 42 మంది హోతీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వాతావరణం ఇంకా చల్లబడకుండానే ఈ పరిణామం చోటుచేసుకుంది.


2010 నుంచి హోతీలకు, యెమెన్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఏళ్ల తరబడి జరిగిన అంతర్యుద్ధం కారణంగా యెమెన్ భారీ సంక్షోభానికి గురైంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తరువాత హోతీలు మళ్లీ రెడ్ సీ ప్రాంతంలో దాడులు చేయడం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు యెమెన్‌లో పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం అలుముకునే అవకాశాలున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

భారతీయులున్న నౌకపై డ్రోన్ దాడి.. పాక్‌కు వెళుతుండగా..

చమురు దొంగతనానికి యత్నం.. విషపూరిత వాయువులు పీల్చి 37 మంది మృతి!

Updated Date - Sep 04 , 2026 | 09:16 PM