కర్నూలులో హైకోర్టు బెంచ్.. మాట నిలబెట్టుకుంటామన్న మంత్రి భరత్
ABN , Publish Date - Sep 04 , 2026 | 08:33 PM
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయమై మంత్రి టీజీ భరత్ స్పందించారు. ఈ నిర్ణయానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని త్వరలోనే ఈ హామీని నెరవేరుస్తామన్నారు.
కర్నూలు, సెప్టెంబరు 04: జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న మాటకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడుతో తాను వ్యక్తిగతంగానూ మాట్లాడానని ఆయన చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఈ సందర్భంగా మంత్రి భరత్ విమర్శించారు. కానీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తాము ఎప్పటికీ మరచిపోమన్నారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన న్యాయవాదులకు సూచించారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే కర్నూలులో బెంచ్ ఏర్పాటు జరుగుతుందని, ఈ విషయమై మంత్రి నారా లోకేశ్ కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు.
సేఫ్టీ కిట్ల పంపిణీ
నేడు జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీకిట్లను పంపిణీ చేశారు మంత్రి భరత్. అనంతరం 10, 11 వార్డుల్లో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
కెన్యాలో టాటా కెమికల్స్‌కు షట్‌డౌన్ ఆదేశం.. టాటా స్పందనిదే..
10 రోజులపాటు ఇరుకైన సొరంగంలో.. రక్షించిన ఆర్మీ సిబ్బంది