Share News

చమురు దొంగతనానికి యత్నం.. విషపూరిత వాయువులు పీల్చి 37 మంది మృతి!

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:19 PM

నైజీరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. పైప్‌లైన్‌ నుంచి ముడి చమురును దొంగిలించేందుకు ప్రయత్నించిన 37 మంది విష వాయువులు పీల్చి మృతి చెందినట్లు సమాచారం.

చమురు దొంగతనానికి యత్నం.. విషపూరిత వాయువులు పీల్చి 37 మంది మృతి!
Nigeria Oil Pipeline Incident

ఇంటర్నెట్ డెస్క్: నైజీరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. పైప్‌లైన్‌ నుంచి ముడి చమురును దొంగిలించేందుకు ప్రయత్నించిన 37 మంది విష వాయువులు పీల్చి మృతి చెందినట్లు సమాచారం. ఈ మృతుల సంఖ్యను అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. రివర్స్ రాష్ట్రంలోని ఒక్రికా ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానిక పర్యావరణ సంస్థ తెలిపింది.


YEAC-నైజీరియా అనే ఓ ఎన్‌జీఓ వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు చమురు పైప్‌లైన్‌కు అక్రమంగా కనెక్షన్ ఇచ్చి ముడి చమురును తమ పడవల్లోకి మళ్లించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో విషపూరిత వాయువులు వెలువడటంతో పలువురు అస్వస్థతకు గురై మృతి చెందినట్లు సమాచారం. మరికొందరి ఆచూకీ కూడా లభించలేదని సంస్థ తెలిపింది. చమురు దొంగతనం ప్రయత్నంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎంతమంది చనిపోయారనే విషయాన్ని వెల్లడించలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని రివర్స్ రాష్ట్ర పోలీసు ప్రతినిధి బ్లెస్సింగ్ కబోర్లో అగాబే తెలిపారు.

Also Read:

అభిషేక్ శర్మ కాదు.. సంజు-వైభవ్‌ జోడీని ఓపెనింగ్‌కు పంపాలి: దీప్ దాస్‌గుప్తా

2 రోజుల పోలీస్ కస్టడీకి రిచ్‌కిడ్స్ ట్రాప్ నిందితులు.. అనుమతించిన నాంపల్లి కోర్టు

Updated Date - Sep 04 , 2026 | 06:04 PM