Share News

2 రోజుల పోలీస్ కస్టడీకి రిచ్‌కిడ్స్ ట్రాప్ నిందితులు.. అనుమతించిన నాంపల్లి కోర్టు

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:34 PM

రిచ్‌కిడ్స్‌ను ట్రాప్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న కేసులో ప్రధాన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణలో కీలక అంశాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2 రోజుల పోలీస్ కస్టడీకి రిచ్‌కిడ్స్ ట్రాప్ నిందితులు.. అనుమతించిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్, సెప్టెంబర్ 4: రిచ్‌కిడ్స్‌ను ట్రాప్ చేసిన కేసులో ప్రధాన నిందితులను 2 రోజులపాటు విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిందితులు కోడూరి మీనా కుమారి, వినీల్ చౌదరిలను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. సంపన్నవర్గాల పిల్లలే లక్ష్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్లను ట్రాప్ చేసే ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు ఇటీవలే రట్టుచేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ అలియాస్ కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ముందుగా సంపన్న వర్గానికి చెందిన మైనర్లతో పరిచయం పెంచుకునేవాడు. మాయమాటలు చెప్పి నెమ్మదిగా వారిని ప్రేమలో దింపేవాడు. అనంతరం బాలికలను బలవంతంగా లోబరుచుకుని ప్రైవేటు వీడియోలు తీసుకునేవాడు. వీటిని అడ్డుపెట్టుకుని ఆ మైనర్లను, వారి కుటుంబ సభ్యులను బెదిరించి భారీ మొత్తంలో డబ్బును వసూలు చేసేవాడు. ఈ లావాదేవీలన్నీ నిందితుని తల్లి మీనాకుమారి అకౌంట్ ద్వారా జరిగేవి.

ఈ కేసులో ప్రధాన నిందితులైన మీనాకుమారి, వినీల్ చౌదరిని జూబ్లీహిల్స్ పోలీసులు ఆగస్టు 11న రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. తాజాగా నిందితులను 2 రోజులపాటు విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పోలీసులు అర్జున్ తల్లి మీనాకుమారి, వినీల్ చౌదరిలను తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో వీరిద్దరి నుంచి మరిన్ని కీలక వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.


Also Read:

కెన్యాలో టాటా కెమికల్స్‌కు షట్‌డౌన్ ఆదేశం.. టాటా స్పందనిదే..

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి

ముగ్గురు పిల్లలతో కలిసి.. లోయలోకి దూకి మహిళా రెజ్లర్ ఆత్మహత్య

Updated Date - Sep 04 , 2026 | 05:34 PM