అభిషేక్ శర్మ కాదు.. సంజు-వైభవ్ జోడీని ఓపెనింగ్‌కు పంపాలి: దీప్ దాస్‌గుప్తా
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:35 PM
టీమిండియా ఓపెనింగ్ కాంబినేషన్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా స్పందించారు. ఇప్పటి వరకు ప్రయత్నించని సంజు-వైభవ్ కాంబినేషన్‌ను పరిశీలించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబర్ 13 నుంచి భారత జట్టు అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ జట్టులో స్టార్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ఓపెనింగ్ కాంబినేషన్‌పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురిలో ఏ ప్లేయర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడో అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా స్పందించారు. ఇప్పటి వరకు ప్రయత్నించని మరో కాంబినేషన్‌ను పరిశీలించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
‘ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఓపెనింగ్ చేశాడు. అంతకుముందు జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. ఇప్పటివరకు మనం అభిషేక్-వైభవ్, అభిషేక్-సంజు కాంబినేషన్లను చూశాం. కానీ సంజు-వైభవ్ జోడీని ఇంకా చూడలేదు. వాళ్లిద్దరూ కలిసి ఓపెనింగ్‌కు దిగితే ఎలా ఉంటుందో పరీక్షించడం చెడ్డ ఆలోచన కాదు. అలా అని ఎవరినీ జట్టు నుంచి తప్పించాలని చెప్పడం లేదు. అభిషేక్ శర్మను తప్పించమని చెప్పే ఉద్దేశం కూడా కాదు. ప్రపంచకప్‌కు ముందు ప్రతి కాంబినేషన్‌ను, ప్రతి ఆటగాడిని తగినంతగా పరీక్షించాలి. వారికి సరైన అవకాశాలు, మ్యాచ్ సమయం ఇవ్వడం ద్వారా ఏది పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి’ అని దాస్‌గుప్తా వివరించాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో తనదైన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న వైభవ్‌కు.. సంజు శాంసన్ లాంటి సీనియర్ బ్యాటర్‌ను జోడిస్తే ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
ముగ్గురు పిల్లలతో కలిసి.. లోయలోకి దూకి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
కీలక భేటీకి అగార్కర్ గైర్హాజరు.. అసలు కారణాన్ని వెల్లడించిన బీసీసీఐ