Share News

ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక.. కట్ చేస్తే.. రెండేళ్ల నిషేధం!

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:58 PM

అండర్-19 టీమిండియా క్రికెటర్ రోహిత్ యాదవ్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికయ్యేందుకు వయసుకు సంబంధించి తప్పుడు ఆధారాలు సమర్పించాడనే కారణంతో రెండేళ్ల పాటు నిషేధం విధించింది.

ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక.. కట్ చేస్తే.. రెండేళ్ల నిషేధం!
Rohit Yadav

స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 టీమిండియా క్రికెటర్ రోహిత్ యాదవ్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికయ్యేందుకు వయసుకు సంబంధించి తప్పుడు ఆధారాలు సమర్పించాడనే కారణంతో రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని బీసీసీఐ పేర్కొంది. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా ఈ ఆదేశాలను అమలు చేయాలని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా రోహిత్‌ యాదవ్‌ ఇటీవలి కాలంలో భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున మెరుగ్గా రాణిస్తున్నాడు.


శ్రీలంక పర్యటనలో భాగంగా యూత్‌ టెస్టుల్లో రోహిత్‌ యాదవ్‌ ఆరు వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలోనే స్వదేశంలో ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఆసీస్‌తో యూత్‌ వన్డే, యూత్‌ టెస్టులు ఆడే జట్టులో అతడికి చోటు దక్కింది. అనూహ్యంగా రోహిత్‌ యాదవ్‌పై రెండేళ్ల పాటు నిషేధం పడింది. కాగా గత కొన్నేళ్లుగా తన పుట్టిన ఏడాదికి సంబంధించి రోహిత్‌ వేర్వేరు పత్రాల్లో వేర్వేరు వివరాలు సమర్పించినట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) గుర్తించింది. 2014లో బీసీఏకు ఇచ్చిన వివరాల్లో తాను 2007 జూలై 7 జన్మించినట్లు అతడు పేర్కొన్నాడు.


2017లో ఆధార్‌ అప్‌డేట్‌ సందర్భంగా తాను 2006లో జన్మించినట్లు రోహిత్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. ఆ తర్వాత 2020, 2021లో మరోసారి అప్‌డేట్‌ చేసుకోగా.. ఈసారి తాను 2009లో జన్మించినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన బెంగాల్‌ అసోసియేషన్‌ అతడు మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. ఈ సంఘటన మొత్తం బెంగాల్ క్రికెట్‌కే ఒక మచ్చగా మిగిలింది. ఎందుకంటే, రోహిత్ మాత్రమే కాకుండా, గతంలో ఫాస్ట్ బౌలర్ రవికుమార్, ఎడమచేతి వాటం స్పిన్నర్ విశాల్ భాటిపై కూడా ఇదే తరహా ఆరోపణలు రావడంతో బీసీసీఐ నిషేధం విధించింది.


ఇవి కూడా చదవండి:

ఆ రికార్డు బ్రేక్ చేస్తానని ఊహించలేదు: స్మృతి మంధాన

సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐ

Updated Date - Sep 04 , 2026 | 02:48 PM