Share News

టీ20 క్రికెట్‌లో తెలుగు తేజం శ్రీ చరణి అరుదైన ఫీట్

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:06 AM

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే తెలుగు తేజం శ్రీ చరణి ఓ అరుదైన ఫీట్ సాధించింది. అంతేకాక దీప్తీ శర్మ రికార్డును బ్రేక్ చేసింది.

టీ20 క్రికెట్‌లో తెలుగు తేజం శ్రీ చరణి అరుదైన ఫీట్
Sri Charani

స్పోర్ట్స్ డెస్క్: మ‌హిళ‌ల టీ20 ఆసియా క‌ప్ టోర్నీలో భాగంగా టీమిండియా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తోంది. వరుసగా రెండు మ్యాచుల్లో థాయిలాండ్, హాంకాంగ్‌ల‌పై భారీ విజయాలతో హ‌ర్మన్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక తన చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా శ‌నివారం చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డనుంది. గురువారం జరిగిన హాంకాంగ్ వుమెన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో తెలుగు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణి అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన ఫీట్ సాధించింది.


ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన రెండో బౌల‌ర్‌గా శ్రీ చ‌ర‌ణి అరుదైన ఘనతను సాధించింది. ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కు శ్రీ చ‌ర‌ణి 31 వికెట్లు ప‌డ‌గొట్టింది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన శ్రీ చరణి.. 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. త‌ద్వారా ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో భార‌త్ త‌ర‌ఫున‌ అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో దీప్తి శర్మను వెనక్కి నెట్టి శ్రీ చ‌ర‌ణి రెండో స్థానంలో నిలిచింది.


దీప్తీ శర్మ 2024లో30 వికెట్లు, 2022లో 9 వికెట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. ఇక తొలి స్థానంలో పూనమ్ యాదవ్ (2018లో 35 వికెట్లు) అగ్రస్థానంలో ఉంది. అయితే ఈ ఏడాది క్యాలెండ‌ర్ ఇయ‌ర్ ఇంకా ముగియ‌క‌పోవ‌డంతో శ్రీ చ‌ర‌ణి అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన జాబితాలో త్వ‌ర‌లోనే టాప్ స్థానానికి చేరుకునే అవ‌కాశ‌ముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక టీ20 వికెట్లు తీసిన మహిళ భారత బౌలర్లు

  • 35 - 2018లో పూనమ్ యాదవ్

  • 31* - 2026లో శ్రీ చరణి

  • 30 - 2024లో దీప్తి శర్మ

  • 29 - 2022లో దీప్తి శర్మ

  • 29 - 2024లో రాధా యాదవ్


ఇవి కూడా చదవండి:

విరాట్ కొడుకుకి 'అంకుల్'గా మారిన శుభ్‌మన్ గిల్

చాహల్ స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయిన బెన్ స్టోక్స్... వీడియో

Updated Date - Sep 04 , 2026 | 11:19 AM