Share News

విరాట్ కొడుకుకి 'అంకుల్'గా మారిన శుభ్‌మన్ గిల్

ABN , Publish Date - Sep 04 , 2026 | 09:51 AM

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కుమారుడు అకాయ్‌కు వన్జే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అంకుల్‌గా మారాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

విరాట్ కొడుకుకి 'అంకుల్'గా మారిన శుభ్‌మన్ గిల్

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియాలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. కోహ్లీనే తనకు ఆదర్శమని, మార్గదర్శం అని గిల్ చాలా సందర్భాల్లో తెలిపాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. తాజాగా విరాట్ కుమారుడు అకాయ్‌కు గిల్ అంకుల్‌గా మారాడు. ఓ కంటెంట్ క్రియేటర్ విరాట్ కొడుకుపై చేసిన ఈ వీడియోలో గిల్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఓ కంటెంట్‌ క్రియేటర్‌ అకాయ్‌ చదుతున్న పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలిగా నటిస్తూ.. ఓ సరదా వీడియోను రూపొందించింది. అల్లరి చేస్తున్నారంటూ అకాయ్‌ను టీచర్‌ మందలిస్తుంది. అంతేకాక మరుసటి రోజు తల్లిదండ్రులు విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మను పాఠశాలకు తీసుకురావాలని అకాయ్‌కు చెబుతుంది. ఇక్కడితో ఆగకుండా.. అకాయ్‌ మీ అంకుల్‌ శుభ్‌మన్ గిల్‌ను కూడా వెంట తీసుకురావాలని సదరు టీచర్ చెబుతుంది. అందుకు అకాయ్‌ పాత్రలో ఉండే బాలుడు 'ఓకే మేడం' అని చెబుతాడు.


ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన శుభ్‌మన్ గిల్‌ తెగ నవ్వుకున్నాడు. వీడియోకి కోహ్లీని ట్యాగ్‌ చేస్తూ.. ‘భాయ్‌ డోంట్‌ వర్రీ, ఐ గాట్‌ యూ కవర్డ్‌(బ్రదర్‌.. నువ్వేమీ టెన్షన్‌ పడొద్దు, నేను చూసుకుంటా)’ అని గిల్ పోస్ట్ చేశాడు. గిల్‌ చేసిన ఈ కామెంట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు ఈ వీడియోపై మీమ్స్‌, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక కోహ్లీ, గిల్‌ త్వరలోనే మరోసారి భారత వన్డే జట్టు తరఫున కలిసి ఆడనున్నారు. సెప్టెంబర్‌ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది.


ఇవి కూడా చదవండి:

చాహల్ స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయిన బెన్ స్టోక్స్... వీడియో

నిప్పులు చెరిగిన భువి.. సెలక్టర్లకు అగ్నిపరీక్ష!

Updated Date - Sep 04 , 2026 | 10:40 AM